former Miss Universe
-
త్వరలో టైటిల్
వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీటీ 13’ (వర్కింగ్ టైటిల్). సందీప్ ముద్ద నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ని త్వరలో ప్రకటించనున్నారు. ‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఇండియన్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న మూవీ ఇది. ఇందులో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ అధికారిగా కనిపిస్తారు. ఈ చిత్రం లోని భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి భారీ సెట్ రూపొందించాం. ఈ సీక్వెన్స్ కోసం వరుణ్ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ చిత్రం టైటిల్‌ను త్వరలో ప్రకటిస్తాం ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. -
సుస్మితా సేన్ ఎమోషనల్ పోస్ట్.. అందుకు 27 ఏళ్లు పట్టిందట
Sushmita Sen Emotional Post On Her Father Birthday: మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ నటించిన పాపులర్ వెబ్ సిరీస్ 'ఆర్య' రెండో సీజన్ డిసెంబర్ 10న విడుదలైంది. మొదటి సీజన్‌తో ప్రశంసలు అందుకున్న సుస్మితా సేన్ రెండో సీజన్లో కూడా తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది. చీకటి నేర ప్రపంచంలో చిక్కుకున్న తల్లి పాత్రలో సుస్మితా అద్భుతంగా నటించింది. తన సొంత తండ్రి, సోదరుడు నడుపుతున్న అక్రమ డ్రగ్ వ్యాపారాన్ని చేజిక్కించుకున్నాక తన ముగ్గురు పిల్లలను కాపాడటానికి ఎంతకైనా తెగించే ఆర్య సరీన్ పాత్రలో ఒదిగిపోయింది సుస్మితా సేన్. తన నిజ జీవితంలో కూడా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందీ మాజీ విశ్వ సుందరి. ఆదివారం (డిసెంబర్ 19) ఉదయం సుస్మితా సేన్ తండ్రి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతా ద్వారా తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. కుటుంబంతో ఆనందంగా దిగిన ఫొటోలను షేర్ చేస్తూ 'హ్యాపీ బర్త్‌డే బాబా. మీరు ఒక ప్రేమ, దయగల అద్భుతమైన వ్యక్తి. మీరు నా తండ్రి కావడం, నా పిల్లలకు తాతా అవడం నా అదృష్టం. మీరు ఒక అల్టిమేట్ గ్రాండ్‌ఫాదర్. మీలోని ప్రశాంతత, ఎవరికీ లొంగని స్ఫూర్తితో మీరు ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను. మీరు అద్భుతమైన తండ్రి. ఐ లవ్ యూ. దేవుడుకి కృతజ్ఞతలు.' అని ఎమోషనల్‌గా పోస్ట్ చేసింది. అలాగే తన తండ్రితో తనకున్న ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది సుస్మితా సేన్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'నా నటనను చూసి మా నాన్న నన్ను మెచ్చుకోవడానికి 27 ఏళ్లు పట్టింది. ఇది ఆర్య 2 సీజన్‌తోనే మా నాన్న నుంచి ప్రశంసలు దక్కాయి. నేను మా అమ్మ ఇద్దరం కలిసి ఆర్య రెండో సీజన్ చూశాం. మా నాన్న ఈ సిరీస్ చూసి ఉక్కరిబిక్కిరి అయ్యారు. కోల్‌కతా నుంచి నాకు ఫోన్ చేసి, నా గురించి ఎంతో గర్వపడుతున్నారో చెప్పారు. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. నేను మా నాన్నను గర్వపడేలా చేస్తానని ఎప్పుడూ చెప్పేదాన్ని. అలా గర్వపడేలా చేయడానికి నాకు 27 ఏళ్లు పట్టింది.' అని తెలిపింది. ఇటీవలే 'ఆర్య' వెబ్ సిరీస్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో బెస్ట్ డ్రామా సిరీస్‌గా నామినేట్ అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
సెక్స్ టేప్ ఆరోపణలు: ఆ వీడియోలో ట్రంప్!
వాషింగ్టన్: మాజీ విశ్వసుందరి ఎలీషియా మచాడో ఓ సెక్స్ టేప్‌లో నటించిందంటూ ఆరోపణలు చేసిన డొనాల్డ్ ట్రంప్ ఊహించనిరీతిలో చిక్కుల్లో పడ్డారు. ఆయన ఈ ఆరోపణలు చేసిన కాసేపటికే.. ఆయన ఉన్న సాఫ్ట్‌కోర్ పోర్న్ వీడియో ఒకటి ఆన్లైన్లో వెలుగుచూసింది. ‘డైలీమెయిల్’ కథనం ప్రకారం 2000 సంవత్సరం నాటి ప్లేబోయ్ వీడియో ఒకటి ఆన్లైన్ అడల్ట్ వీడియో స్టోర్‌లో లభించింది. చుట్టు ఉన్న మహిళలను ఉత్సాహ పరుస్తూ షాంపెన్ బాటిల్ పొంగిస్తూ ఈ వీడియోలో ట్రంప్ కనిపించారు. ఈ వీడియోలో నగ్నంగా ఉన్న మహిళలు లైంగిక చేష్టలకు పాల్పడుతూ కనిపించారు. ‘అందం అందమే. న్యూయార్క్‌లో ఏం జరగబోతున్నదో చూద్దాం’ అంటూ ఈ వీడియోలో ట్రంప్ పేర్కొన్నారు. మాజీ మిస్ యూనివర్స్‌ను తాను తిట్టానని అంతా అంటున్నారని, కానీ ఆమె ఒక సెక్స్ టేప్‌లో ఉన్న విషయాన్ని విమర్శకులు చూసుకోవాలని రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో హిల్లరీ క్లింటన్‌ను విమర్శిస్తూ ఆయన వరుసపెట్టి ట్వీట్లు చేశారు. 1996 నాటి మిస్ యూనివర్స్ విజేత ఎలీషియా మచాడోను గతంలో ట్రంప్ విమర్శించిన విషయాన్ని హిల్లరీ క్లింటన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ప్రస్తావించారు. 1996లో మిస్ యూనివర్స్‑గా గెలుపొందిన వెనిజులా సుందరి ఎలీషియా మచాడోను పంది (మిస్ పిగ్గీ), తిండిబోతు యంత్రం (ఈటింగ్ మిషన్) అంటూ ట్రంప్నానా దుర్భాషలు ఆడారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన హిల్లరీ క్లింటన్.. మహిళలంటే ట్రంప్‌కు ఏమాత్రం గౌరవం లేదన్నారు. దాన్ని ఇప్పుడు ఆయన ప్రస్తావిస్తూ... 'క్రూకెడ్ హిల్లరీ' ఎలీషియాను తన డిబేట్లో ఉపయోగించుకున్నారని, కానీ ఆమె దారుణమైన గతాన్ని (సెక్స్ టేపులు) గుర్తుచేసుకోవాలని తన ట్వీట్లలో పేర్కొన్నారు. ఫాక్స్ టీవీలో ఇంటర్వ్యూ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించుకున్నారు. మచాడో బరువు పెరగడం నిజంగా సమస్యే అవుతుందని ఆయన అన్నారు. -
ఆమె సెక్స్ టేపుల గురించి తెలీదా: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మరీ ఘోరంగా తయారవుతోంది. మాజీ మిస్ యూనివర్స్‌ను తాను తిట్టానని అంతా అంటున్నారని, కానీ ఆమె ఒక సెక్స్ టేప్‌లో ఉన్న విషయాన్ని విమర్శకులు చూసుకోవాలని రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో హిల్లరీ క్లింటన్‌ను విమర్శిస్తూ ఆయన వరుసపెట్టి ట్వీట్లు చేశారు. 1996 నాటి మిస్ యూనివర్స్ విజేత ఎలీషియా మచాడోను గతంలో ట్రంప్ విమర్శించిన విషయాన్ని హిల్లరీ క్లింటన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ప్రస్తావించారు. 1996లో వెనిజులా సుందరి ఎలీషియా మచాడో మిస్ యూనివర్స్‌గా గెలుపొందింది. ఆ ఆనందంలో ఉన్న ఆమె కొంతకాలానికి బరువు పెరిగింది. దీంతో ఆమెను వెంటాడి మరీ ట్రంప్ కంపు వ్యాఖ్యలు చేశారు. ఆమె ముఖం మీదే పంది (మిస్ పిగ్గీ), తిండిబోతు యంత్రం (ఈటింగ్ మిషన్) అంటూ నానా దుర్భాషలు ఆడారు. వ్యక్తిగతంగా తిట్టడంతో పాటు బహిరంగంగా కూడా దూషించిన విషయాన్ని హిల్లరీ క్లింటన్ ప్రశ్నించారు. మహిళలంటే ట్రంప్‌కు ఏమాత్రం గౌరవం లేదన్నారు. దాన్ని ఇప్పుడు ఆయన ప్రస్తావిస్తూ... 'క్రూకెడ్ హిల్లరీ' ఎలీషియాను తన డిబేట్లో ఉపయోగించుకున్నారని, కానీ ఆమె దారుణమైన గతాన్ని (సెక్స్ టేపులు) గుర్తుచేసుకోవాలని తన ట్వీట్లలో పేర్కొన్నారు. ఎలీషియా గతాన్ని ఏమాత్రం తెలుసుకోకుండా అనవసరంగా ఒక దేవతలా చూపించే ప్రయత్నం చేశారని మరో ట్వీట్లో చెప్పారు. అయితే ఆ టేపులకు సంబంధించి గానీ, ఎలీషియా గురించి అంతకుముందు ప్రచురించిన అంశాల గురించి గానీ ట్రంప్ ఎక్కడా ఎలాంటి లింకులు ఇవ్వలేదు. ఫాక్స్ టీవీలో ఇంటర్వ్యూ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించుకున్నారు. మచాడో బరువు పెరగడం నిజంగా సమస్యే అవుతుందని ఆయన అన్నారు. ట్రంప్ తనను ఎప్పుడూ ఒక చెత్తకుప్పలాగే చూసేవాడని మచాడో మండిపడ్డారు. ప్రస్తుతం రాజకీయాలలోకి వచ్చిన ఆమె.. బిగ్ డిబేట్ అయిన వెంటనే మర్నాడే మీడియా ముందుకు వచ్చారు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక పీడకలలా తన గురించి ఆయన చెప్పారని ఆవేదన చెందారు. మొదటి డిబేట్ తర్వాత ట్రంప్ విజయావకాశాలు మరింత తగ్గాయి. సర్వేలలో ఆయనకు .. హిల్లరీకి మధ్య తేడీ మరింత పెరిగిపోయింది. దాంతో కొత్త సలహాదారులను నియమించుకున్న ఆయన.. బహిరంగ సభల్లో కేవలం వాళ్లు చెప్పిన మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు. Wow, Crooked Hillary was duped and used by my worst Miss U. Hillary floated her as an "angel" without checking her past, which is terrible! — Donald J. Trump (@realDonaldTrump) 30 September 2016 Using Alicia M in the debate as a paragon of virtue just shows that Crooked Hillary suffers from BAD JUDGEMENT! Hillary was set up by a con. — Donald J. Trump (@realDonaldTrump) 30 September 2016 Did Crooked Hillary help disgusting (check out sex tape and past) Alicia M become a U.S. citizen so she could use her in the debate? — Donald J. Trump (@realDonaldTrump) 30 September 2016 Remember, don't believe "sources said" by the VERY dishonest media. If they don't name the sources, the sources don't exist. — Donald J. Trump (@realDonaldTrump) 30 September 2016 The people are really smart in cancelling subscriptions to the Dallas & Arizona papers & now USA Today will lose readers! The people get it! — Donald J. Trump (@realDonaldTrump) 30 September 2016 -
ట్రంప్ కంపు వ్యాఖ్యలపై వైరల్ వీడియో!
ఎవరి చేసిన తప్పులు వారిని వెంటాడుతాయంటారు. అదేవిధంగా గతంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన కంపు వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనను దారుణంగా వెంటాడుతున్నాయి. 1996లో వెనిజులా సుందరి ఎలిషియా మచాడో 'విశ్వసుందరి' (మిస్ యూనివర్స్)గా గెలుపొందింది. ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఆనందంలో ఉన్న ఆమె కొంతకాలానికి బరువు పెరిగింది. దీంతో ఆమెను వెంటాడి మరీ ట్రంప్ కంపు వ్యాఖ్యలు చేశాడు. ఆమె ముఖం మీదే పంది (మిస్ పిగ్గీ), తిండిబోతు యంత్రం (ఈటింగ్ మిషిన్) అంటూ నానా దుర్భాషలు ఆడాడు. ఆమెను వ్యక్తిగతంగా ఇలా తిట్టడమే కాదు బహిరంగంగానూ ట్రంప్ దూషించాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తాజాగా 'బిగ్ డిబేట్'లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్ గతంలో చేసిన ఈ దుర్మార్గ వ్యాఖ్యలను వీడియోను ప్రత్యర్థి హిల్లరీ విడుదల చేశారు. లైవ్ ప్రసారంలో ఈ వీడియోను లక్షలమంది చూశారు. ఈ డిబేట్ సందర్భంగా ట్రంప్ తీరును హిల్లరీ ఆసాంతం కడిగిపారేశారు. 'ఈ మనిషి మహిళలను పందులు, బద్ధకస్తులు, కుక్కలు అడ్డంగా తిట్టిపోశాడు. వారు గర్భవతులు కావడం ఉద్యోగులకు ఇచ్చేవాళ్లకు తలనొప్పి అని పేర్కొన్నాడు. పురుషులకు సమానంగా పనిచేస్తే తప్ప వారికి సమాన జీతం పొందే అర్హత లేదని వాగాడు. అందాల పోటీలో పాల్గొన్న ఓ మహిళపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అతను అందాల పోటీలను ఇష్టపడతాడు. వాటికి అండగా ఉంటాడు. వాటి చుట్టూ తిరుగుతాడు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడు' అంటూ ట్రంప్ తీరును హిల్లరీ తూర్పారబట్టారు. తాజాగా అమెరికా పౌరురాలిగా మారి ఓటు హక్కు పొందిన వెనిజుల సుందరి ఎలిషియా మచాడో కూడా స్పందించింది. తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీకే ఓటు వేస్తానని సోషల్ మీడియాలో తెలిపింది. తనను ట్రంప్ దారుణంగా అవమానించాడని ఆ రోజుల్ని గుర్తుచేసుకుంది.