ట్రంప్‌ కంపు వ్యాఖ్యలపై వైరల్‌ వీడియో! | Trump called former Miss Universe as Miss Piggy | Sakshi
Sakshi News home page

విశ్వసుందరిని పంది అని తిట్టాడు!

Published Wed, Sep 28 2016 3:48 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ట్రంప్‌ కంపు వ్యాఖ్యలపై వైరల్‌ వీడియో! - Sakshi

ట్రంప్‌ కంపు వ్యాఖ్యలపై వైరల్‌ వీడియో!

ఎవరి చేసిన తప్పులు వారిని వెంటాడుతాయంటారు. అదేవిధంగా గతంలో డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన కంపు వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనను దారుణంగా వెంటాడుతున్నాయి. 1996లో వెనిజులా సుందరి ఎలిషియా మచాడో 'విశ్వసుందరి' (మిస్‌ యూనివర్స్‌)గా గెలుపొందింది. ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఆనందంలో ఉన్న ఆమె కొంతకాలానికి బరువు పెరిగింది. దీంతో ఆమెను వెంటాడి మరీ ట్రంప్‌ కంపు వ్యాఖ్యలు చేశాడు. ఆమె ముఖం మీదే పంది (మిస్‌ పిగ్గీ), తిండిబోతు యంత్రం (ఈటింగ్‌ మిషిన్‌) అంటూ నానా దుర్భాషలు ఆడాడు. ఆమెను వ్యక్తిగతంగా ఇలా తిట్టడమే కాదు బహిరంగంగానూ ట్రంప్‌ దూషించాడు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ తాజాగా 'బిగ్‌ డిబేట్‌'లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్‌ గతంలో చేసిన ఈ దుర్మార్గ వ్యాఖ్యలను వీడియోను ప్రత్యర్థి హిల్లరీ విడుదల చేశారు. లైవ్‌ ప్రసారంలో ఈ వీడియోను లక్షలమంది చూశారు.

ఈ డిబేట్‌ సందర్భంగా ట్రంప్‌ తీరును హిల్లరీ ఆసాంతం కడిగిపారేశారు. 'ఈ మనిషి మహిళలను పందులు, బద్ధకస్తులు, కుక్కలు అడ్డంగా తిట్టిపోశాడు. వారు గర్భవతులు కావడం ఉద్యోగులకు ఇచ్చేవాళ్లకు తలనొప్పి అని పేర్కొన్నాడు. పురుషులకు సమానంగా పనిచేస్తే తప్ప వారికి సమాన జీతం పొందే అర్హత లేదని వాగాడు. అందాల పోటీలో పాల్గొన్న ఓ మహిళపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అతను అందాల పోటీలను ఇష్టపడతాడు. వాటికి అండగా ఉంటాడు. వాటి చుట్టూ తిరుగుతాడు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడు' అంటూ ట్రంప్‌ తీరును హిల్లరీ తూర్పారబట్టారు.

తాజాగా అమెరికా పౌరురాలిగా మారి ఓటు హక్కు పొందిన వెనిజుల సుందరి ఎలిషియా మచాడో కూడా స్పందించింది. తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీకే ఓటు వేస్తానని సోషల్‌ మీడియాలో తెలిపింది. తనను ట్రంప్‌ దారుణంగా అవమానించాడని ఆ రోజుల్ని గుర్తుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement