త్వరలో టైటిల్‌ | Varun Tej film title will be announced soon | Sakshi
Sakshi News home page

త్వరలో టైటిల్‌

Published Tue, Jun 27 2023 1:23 AM | Last Updated on Tue, Jun 27 2023 5:54 AM

Varun Tej film title will be announced soon - Sakshi

వరుణ్‌ తేజ్‌ హీరోగా శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీటీ 13’ (వర్కింగ్‌ టైటిల్‌). సందీప్‌ ముద్ద నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ని త్వరలో ప్రకటించనున్నారు. ‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఎయిర్‌ ఫోర్స్‌ యాక్షన్‌ చిత్రంగా రూపొందుతున్న మూవీ ఇది.

ఇందులో వరుణ్‌ తేజ్‌ ఐఏఎఫ్‌ అధికారిగా కనిపిస్తారు. ఈ చిత్రం లోని భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించడానికి భారీ సెట్‌ రూపొందించాం. ఈ సీక్వెన్స్‌ కోసం వరుణ్‌ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. ఈ చిత్రం టైటిల్‌ను త్వరలో ప్రకటిస్తాం ’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రంలో మాజీ మిస్‌ యూనివర్స్‌ మానుషి చిల్లార్‌ రాడార్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement