Sushmita Sen Emotional Post On Her Father Birthday - Sakshi
Sakshi News home page

Sushmita Sen: సుస్మితా సేన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. అందుకు 27 ఏళ్లు పట్టిందట

Published Sun, Dec 19 2021 3:18 PM | Last Updated on Sun, Dec 19 2021 3:33 PM

Sushmita Sen Emotional Post On Her Father Birthday: మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్ నటించిన పాపులర్‌ వెబ్‌ సిరీస్‌ 'ఆర్య' రెండో సీజన్‌ డిసెంబర్‌ 10న విడుదలైంది. మొదటి సీజన్‌తో ప్రశంసలు అందుకున్న సుస్మితా సేన్‌ రెండో సీజన్‌లో కూడా తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది. చీకటి నేర ప్రపంచంలో చిక్కుకున్న తల్లి పాత్రలో సుస్మితా అద్భుతంగా నటించింది. తన సొంత తండ్రి, సోదరుడు నడుపుతున్న అక్రమ డ్రగ్‌ వ్యాపారాన్ని చేజిక్కించుకున్నాక తన ముగ్గురు పిల్లలను కాపాడటానికి ఎంతకైనా తెగించే ఆర్య సరీన్‌ పాత్రలో ఒదిగిపోయింది సుస్మితా సేన్‌. తన నిజ జీవితంలో కూడా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందీ మాజీ విశ్వ సుందరి. 

ఆదివారం (డిసెంబర్‌ 19) ఉదయం సుస్మితా సేన్‌ తండ్రి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతా ద్వారా తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. కుటుంబంతో ఆనందంగా దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ 'హ్యాపీ బర్త్‌డే బాబా. మీరు ఒక ప్రేమ, దయగల అద్భుతమైన వ్యక్తి. మీరు నా తండ్రి కావడం, నా పిల్లలకు తాతా అవడం నా అదృష్టం. మీరు ఒక అల్టిమేట్‌ గ్రాండ్‌ఫాదర్‌. మీలోని ప్రశాంతత, ఎవరికీ లొంగని స్ఫూర్తితో మీరు ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను. మీరు అద్భుతమైన తండ్రి. ఐ లవ్‌ యూ. దేవుడుకి కృతజ్ఞతలు.' అని ఎమోషనల్‌గా పోస్ట్‌ చేసింది. 

అలాగే తన తండ్రితో తనకున్న ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది సుస్మితా సేన్‌. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'నా నటనను చూసి మా నాన్న నన్ను మెచ్చుకోవడానికి 27 ఏళ్లు పట్టింది. ఇది ఆర్య 2 సీజన్‌తోనే మా నాన్న నుంచి ప్రశంసలు దక్కాయి. నేను మా అమ్మ ఇద్దరం కలిసి ఆర్య రెండో సీజన్‌ చూశాం. మా నాన్న ఈ సిరీస్ చూసి ఉక్కరిబిక్కిరి అయ్యారు. కోల్‌కతా నుంచి నాకు ఫోన్‌ చేసి, నా గురించి ఎంతో గర్వపడుతున్నారో చెప్పారు. ఇది నాకు చాలా ఎమోషనల్‌ మూమెంట్‌. నేను మా నాన్నను గర్వపడేలా చేస్తానని ఎప్పుడూ చెప్పేదాన్ని. అలా గర్వపడేలా చేయడానికి నాకు 27 ఏళ్లు పట్టింది.' అని తెలిపింది. ఇటీవలే 'ఆర్య' వెబ్‌ సిరీస్‌ ఇంటర్నేషనల్‌ ఎమ్మీ అవార్డ్స్‌లో బెస్ట్‌ డ్రామా సిరీస్‌గా నామినేట్‌ అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement