Sushmita sen
-
పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు ‘తల్లి’..మాజీ విశ్వ సుందరి (ఫోటోలు)
-
మన విశ్వ సుందరీమణులు వీరే.. ముగ్గురు మహిళా మణులు(ఫొటోలు)
-
నేను పెళ్లి చేసుకుంటానంటే పిల్లలు వద్దంటున్నారు: సుష్మితా సేన్
బాలీవుడ్ నటి సుష్మితా సేన్ లవ్స్టోరీల గురించి చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఉన్నాయి. నచ్చితే ప్రేమించడం.. నచ్చనప్పుడు బ్రేకప్ చెప్పుకోవడం ఆమెకు సర్వసాధారణం.. అయితే పది మందికి పైగా ప్రేమించినప్పటికీ ఎవరితోనూ ఏడడుగులు వేసేంత వరకు వెళ్లలేదు. కానీ పిల్లలంటే ఇష్టం కావడంతో ఇద్దరిని దత్తత తీసుకుని పెంచుకుంటోంది. సుష్మితకు 24 ఏళ్ల వయసున్నప్పుడు అంటే 2010వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. 2010లో అలీషాను దత్తత తీసుకుంది. వీరిద్దరినీ కన్నబిడ్డల్లా కంటికి రెప్పలా చూసుకుంటోంది. తండ్రి లేడు అన్న లోటు వారికి తెలియకుండా పెంచుతోంది. మాకైతే నాన్న అవసరం లేదు.. తాజాగా ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా పిల్లలు నాన్న లేడు అని ఎన్నడూ ఫీలవలేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నది కోల్పోతేనే మిస్ అవుతాం. లేనిదాని గురించి మిస్ అయిన భావనే రాదు. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కూడా ఇప్పుడెందుకు పెళ్లి? అసలు దేనికోసం? మాకైతే నాన్న అవసరం లేదు అనేస్తారు. నేను భర్తను కోరుకుంటున్నానేమో అని కూడా అనుకోరు. పిల్లలకు ఆయనే అన్నీ.. పెళ్లి గురించి మేము చాలా జోక్స్ చేసుకుంటాం. వాళ్లకు తండ్రి లేడు అనే లోటు కూడా తెలియదు. ఎందుకంటే వారికి తాత ఉన్నాడు. మా నాన్నే వారి తాతయ్య.. ఆయనే వారికి అన్నీ అయి ఆడిస్తాడు' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే సుష్మితా సేన్ ఇటీవలే తాలి అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. తర్వాత ఆమె ఆర్య 3 వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. చదవండి: 5 ఏళ్ల కంటే ఎక్కువ బతకనని చెప్పారు.. ఈ బాధ కంటే చనిపోవడమే నయమనిపించింది! -
విడాకులు తీసుకున్న నటి.. నేను సరైన పనే చేస్తున్నా
బాలీవుడ్లో బుల్లితెర నటి, యూట్యూబ్ వ్లాగర్‌గా చారు అసోపా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ సుష్మితా సేన్ బ్రదర్ అయిన రాజీవ్ సేన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. జూన్ 9, 2019న గోవాలో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2021లో వారికి పాప జన్మించడంతో జియానా అని పేరుపెట్టుకున్నారు. వారి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో జూన్ 8న విడాకులు తీసుకున్నారు. తాజాగా తన మాజీ భర్త రాజీవ్ సేన్ గురించి తను మొదటి వీడియో షేర్ చేసింది. ఆమె యూట్యూబ్‌లోని తన వ్లాగ్‌లో విడాకుల కోసం కోర్టుకు వెళ్లే ముందు తన ఆలోచనలు ఎలా ఉన్నాయో పంచుకుంది. (ఇదీ చదవండి: వైరల్ అవుతున్న రకుల్ డ్రెస్.. అతను పట్టుకోవడంతో..!) ఆ వీడియోలో విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్న ప్పుడు తీసిన సన్నివేశాలను ఇలా పంచుకుంది. 'నేను కొంచెం ఆందోళనగా ఉన్నాను, నేను సరైన పని చేస్తున్నానని నాకు తెలుసు, కానీ ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ అదే ఆందోళనను అనుభవిస్తారని భావిస్తున్నాను. విడాకుల ద్వారా...రాజీవ్ ఎల్లప్పుడూ జియానా తండ్రిగా ఉంటాడు. అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు జియానాను కలుసుకోవచ్చు'. అని తెలిపింది. ఆమె వ్లాగ్పై పలువురు నెటిజన్లు మద్దతుగా నిలిచారు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదర్కొనేందుకు సిద్దంగా ఉండాలని వారు కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Charu Asopa (@asopacharu) (ఇదీ చదవండి: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా) -
సుస్మితా సేన్ ఎమోషనల్ పోస్ట్.. అందుకు 27 ఏళ్లు పట్టిందట
Sushmita Sen Emotional Post On Her Father Birthday: మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ నటించిన పాపులర్ వెబ్ సిరీస్ 'ఆర్య' రెండో సీజన్ డిసెంబర్ 10న విడుదలైంది. మొదటి సీజన్‌తో ప్రశంసలు అందుకున్న సుస్మితా సేన్ రెండో సీజన్లో కూడా తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది. చీకటి నేర ప్రపంచంలో చిక్కుకున్న తల్లి పాత్రలో సుస్మితా అద్భుతంగా నటించింది. తన సొంత తండ్రి, సోదరుడు నడుపుతున్న అక్రమ డ్రగ్ వ్యాపారాన్ని చేజిక్కించుకున్నాక తన ముగ్గురు పిల్లలను కాపాడటానికి ఎంతకైనా తెగించే ఆర్య సరీన్ పాత్రలో ఒదిగిపోయింది సుస్మితా సేన్. తన నిజ జీవితంలో కూడా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందీ మాజీ విశ్వ సుందరి. ఆదివారం (డిసెంబర్ 19) ఉదయం సుస్మితా సేన్ తండ్రి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతా ద్వారా తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. కుటుంబంతో ఆనందంగా దిగిన ఫొటోలను షేర్ చేస్తూ 'హ్యాపీ బర్త్‌డే బాబా. మీరు ఒక ప్రేమ, దయగల అద్భుతమైన వ్యక్తి. మీరు నా తండ్రి కావడం, నా పిల్లలకు తాతా అవడం నా అదృష్టం. మీరు ఒక అల్టిమేట్ గ్రాండ్‌ఫాదర్. మీలోని ప్రశాంతత, ఎవరికీ లొంగని స్ఫూర్తితో మీరు ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను. మీరు అద్భుతమైన తండ్రి. ఐ లవ్ యూ. దేవుడుకి కృతజ్ఞతలు.' అని ఎమోషనల్‌గా పోస్ట్ చేసింది. అలాగే తన తండ్రితో తనకున్న ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది సుస్మితా సేన్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'నా నటనను చూసి మా నాన్న నన్ను మెచ్చుకోవడానికి 27 ఏళ్లు పట్టింది. ఇది ఆర్య 2 సీజన్‌తోనే మా నాన్న నుంచి ప్రశంసలు దక్కాయి. నేను మా అమ్మ ఇద్దరం కలిసి ఆర్య రెండో సీజన్ చూశాం. మా నాన్న ఈ సిరీస్ చూసి ఉక్కరిబిక్కిరి అయ్యారు. కోల్‌కతా నుంచి నాకు ఫోన్ చేసి, నా గురించి ఎంతో గర్వపడుతున్నారో చెప్పారు. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. నేను మా నాన్నను గర్వపడేలా చేస్తానని ఎప్పుడూ చెప్పేదాన్ని. అలా గర్వపడేలా చేయడానికి నాకు 27 ఏళ్లు పట్టింది.' అని తెలిపింది. ఇటీవలే 'ఆర్య' వెబ్ సిరీస్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో బెస్ట్ డ్రామా సిరీస్‌గా నామినేట్ అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
ప్రాణవాయువు పంపిస్తాన్న హీరోయిన్.. నెటిజన్స్ ట్రోల్స్
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రోజుకి మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. కేసుల సంఖ్య పెరగడంతో పలు ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు దొరకడం లేదు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, ముంబైల్లో కరోనా ధాటికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాంటి కష్ట సమయంలో సాయం చేయడానికి పలువు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితాసేన్ కరోనా రోగులకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఢిల్లీలోని శాంతి ముకుంద్ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు అందజేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ట్వీట్ చేసింది. ఇటీవపల ఢిల్లీలోని శాంతి ముకుంద్ ఆసుపత్రి సీఈఓ సునీల్ సాగర్ ఓ ఇంటర్వ్యూలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉందని చెప్పారు. ఆ వీడియో చూసిన సుస్మితా.. ‘హృదయ విదారకమైన పరిస్థితి ఇది. దేశంలో ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత ఉంది. ఈ ఆస్పత్రికి కొన్ని ఆక్సిజన్ సిలీండర్లను నేను అందించగలను. కానీ ముంబయి నుంచి ఢిల్లీకి వాటిని ఎలా పంపించాలో అర్థం కావడం లేదు. దయచేసి వాటి రవాణాలో నాకు కొంచెం సాయం చేయగలరు’ అని ట్వీట్ చేశారు. కాగా, సుస్మిత సేన్ సాయాన్ని కూడా ఓ నెటిజన్ అవహేళన చేశాడు. ‘దేశమంతా ఆక్సిజన్ కొరత ఉన్నప్పుడు ముంబైలో కాకుండా ఢిల్లీలోని ఆస్పత్రులకు మాత్రమే ఎందుకు సాయం చేస్తున్నారు’అని ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన సుస్మితా.. ఆ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చింది. ‘ఢిల్లీకి ఎందుకు సాయం చేస్తున్నానంటే.. ముంబైలో ఆక్సిజన్ కొరత పెద్దగా లేదు. ప్రస్తుతం ఢిల్లీలోని ఎన్నో ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలీండర్ల కొరత ఏర్పడింది. ముఖ్యంగా చిన్న చిన్న ఆస్పత్రులకు ప్రాణవాయువు సిలిండర్లు లభించడంలేదు. అందుకే సాయం చేస్తున్నా. వీలైతే మీరు సాయం చేయండి’అని ఘాటైన సమాధానం ఇచ్చింది. This is deeply heart breaking...oxygen crisis is everywhere. I have managed to organise a few oxygen cylinders for this hospital but have no way to transport it to Delhi from Mumbai...please help me find a way🙏 https://t.co/p8RWuVQMrO — sushmita sen (@thesushmitasen) April 22, 2021 చదవండి: మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్‌కు కోవిడ్ ఎలా సోకిందంటే.. -
ఆర్య 2 ఆరంభం
‘ఆర్య’ వెబ్‌సిరీస్ సెకండ్ సీజన్ స్టార్ట్ అయ్యింది. సుష్మితా సేన్ ప్రధాన పాత్రలో రామ్ మద్వానీ, సందీప్ మోడీ, వినోద్ రావత్ సంయుక్త దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్య’ వెబ్‌సిరీస్ గత ఏడాది జూలైలో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌కు మంచి వ్యూయర్షిప్ లభించింది. దీంతో వెంటనే ‘ఆర్య’ వెబ్‌సిరీస్‌కు సెకండ్ సీజన్ ను అనౌ¯Œ ్స చేశారు. తొలి సీజన్ లో సుష్మితా సేన్ తో పాటు చంద్రాచూడ్ సింగ్, నమిత్ దాస్, వికాస్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. మరి.. సెకండ్ సీజన్ లో కూడా వీరు కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
15 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్ చేస్తాననుకోలేదు
ముంబై: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ పెళ్లి కాకుండానే ఇద్దరూ ఆడ పిల్లలను దత్తత తీసుకుని తల్లయ్యారు. ఈ మాజీ బ్యూటీ క్వీన్ మోడల్ రోహమన్ షాల్‌తో కొంతకాలంగా డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. రోహమన్, ఆమెకు మధ్య 15 సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. అంటే సుస్మిత కంటే రోహమన్ 15 ఏళ్ల చిన్నవాడు. రోహమన్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయినట్టు ఓ ఇంటర్వ్యూలో సుస్మిత వెల్లడించారు. ‘కొన్నెళ్ల క్రితం సోషల్ మీడియాలో రోహమన్ నేరుగా ఓ మెసేజ్ పెట్టాడు. అది చూసి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రోహమన్‌ను కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత రోజు మేము సందేశాలు పంపుకోవడం చేశాం. కానీ 15 సంవత్సరాల వ్యత్యాసం ఉన్న వ్యక్తితో ప్రేమలో పడతానని ఆ సమయంలో నేను ఊహించలేదు’ అని చెప్పుకొచ్చారు. (చదవండి: ప్రియుడితో మాజీ విశ్వసుందరి పుట్టినరోజు) ‘ఇక ఏదేమైనా మేము మా బంధంతో చాలా సంతోషంగా ఉన్నాం. నేను నా పిల్లలు, రోహమన్ ఓ కుటుంబం’ అని పేర్కొన్నారు. అయితే ‘మహిళగా నాకు ఓ తోడు అవసరమని, ఓ వ్యక్తి సావాసం కోరుకునేంత రోమాంటిక్ నేను కాదు. జీవితంలో ఎప్పుడూ నేను అలా ఆలోచించలేదు. రోహమన్తో పరిచయం అనుకోకుండా ఏర్పడింది. అయితే దీనికి ఆ దేవుడికి ధన్యవాదలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తులు మాత్రమే కలిసి ఉండగలరు. లేని పక్షంలో వారు కలిసున్నా వ్యర్థమే’ అని సుస్మితాసేన్ అన్నారు. -
‘ఆ అద్భుతానికి నేటితో 20 సంవత్సరాలు’
‘నా జీవితంలో చోటుచేసుకున్న ఆ అద్భుతమైన ఘట్టానికి నేటితో 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. విశ్వం ఇచ్చిన ఈ బహుమతికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అన్నారు మిస్ యూనివర్స్, నటి లారా దత్తా. సరిగ్గా 20 ఏళ్ల క్రితం అంటే మే 12, 2000న లారా దత్తా మిస్ యూనివర్స్‌గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాటి వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు లారా దత్తా. ‘నేటికి 20 ఏళ్లు.. మే 12,2000,నికొసియా, సిప్రస్. విశ్వం నుంచి లభించిన అద్భుతమైన బహుమతి.. సదా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ రాసుకొచ్చారు లారా దత్తా. ఆ ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఆఖరి రౌండ్లో లారా దత్తా 9.99 స్కోర్ సాధించి చరిత్ర సృష్టించింది. అదే సంవత్సరం ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కిరీటం.. దియా మీర్జా మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ గెలుచుకున్నారు. మిస్ యూనివర్స్ కిరీటం పొందిన రెండవ భారతీయ మహిళ లారా దత్తా. ఆమె కంటే ముందు సుస్మితా సేన్ 1994 లో ఈ టైటిల్ గెలుచుకున్నారు. -
పదేళ్ల తర్వాత సినిమాల్లోకి ఆమె రీ ఎంట్రీ..
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ అభిమానులకు శుభవార్త. దాదాపు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ తన అభిమానులను అలరించడానికి వస్తున్నట్లు ఆమె ప్రకటించారు. 2010లో అనీస్ బాజ్మీ దర్శకత్వంలో వచ్చిన ‘నో ప్రాబ్లమ్’ చిత్రంలో నటించిన సుస్మితా ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించనే లేదు. ఈ విషయం గురించి అడిగినప్పుడల్లా తన వ్యక్తిగత కారణాల వల్లే సినిమాలకు విరామం ఇచ్చానంటూ ఆమె చెప్పుకొచ్చేవారు. అలా నటనకు దూరమైనప్పటికీ ఏదో విధంగా సోషల్ మీడియాలో అభిమానులకు చేరువగా ఉంటూ వస్తున్నారు సుస్మితా. ఇటీవలే 44వ పుట్టిన రోజును కుటుంబ సభ్యులతో జరుపుకున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తాజాగా తాను మళ్లీ సినిమాలలో నటించడానికి రెడీ అయ్యానంటూ సోషల్ మీడియా వేదికగా సుస్మితా ప్రకటించారు. బాల్కనీలో ఒంటరిగా నిలుచుని ఉన్న ఆమె ఫోటోకి ‘నేను ఎప్పుడూ సహన ప్రేమకు విధేయురాలిని’!! ‘ఈ ఒంటరితనం నా అభిమానులకు అభిమానిగా మార్చింది’, ‘పదేళ్ల నుంచి నన్ను నటన వైపు నడిపించడానికి వారి అభిమానంతో ప్రోత్సహకం అందిస్తూ వచ్చిన ఫ్యాన్స్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా’ అంటూ సుస్మితా తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇక ఈ వార్త విన్న మాజీ విశ్వసుందరి అభిమానులంతా ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్నారు. View this post on Instagram I have always been in awe of love that knows patience!! This alone makes me a fan of my fans!!😊❤️ They have waited 10 long years for my return to the Screen, lovingly encouraging me every step of the way throughout my hiatus...unconditionally!!!👏😍❤️ 🙏 I RETURN JUST FOR YOU!!!!! 😁💃🏻💋 #secondinnings #gratitude #love #faith #patience #showtime 👊😉😄💋❤️💃🏻 I love you guys!!! #duggadugga 🙏 A post shared by Sushmita Sen (@sushmitasen47) on Dec 8, 2019 at 11:56pm PST కాగా సుస్మితాసేన్ సినిమా విరామంపై ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాల వల్లే యాక్టింగ్‌కు బ్రేక్ ఇచ్చానని, తన రెండవ దత్త పుత్రిక అలిసా కోసమే సినిమాలకు కాస్తా దూరంగా ఉన్నట్లు చెప్పారు. ఎందుకంటే అలిసా బాల్యానికి తాను దూరంగా ఉండాలనుకోలేదని, తన మొదటి దత్త కూతురు రేనీ సమయంలో తన బాల్య స్మృతులను కోల్పోయానని అన్నారు. అలిసా విషయంలో ఆ తప్పు చేయాలనుకోలేదని ఇందుకోసమే నటనకు దూరంగా ఉన్నట్లు అమె చెప్పారు. -
మోస్ట్ పవర్ఫుల్
పోలీస్ సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు అందాల భామ సుష్మితాసేన్. ముఖ్యంగా ఐపీసీ సెక్షన్స్‌పై దృష్టిసారించారు. ఆమె ఏదైనా కేసులో ఇరుక్కున్నారా? అని కంగారు పడకండి. నిజానికి ఆమె కేసులను సాల్వ్ చేస్తానంటున్నారు. లాయర్‌గా కాదు. పోలీసాఫీసర్‌గా. సుష్మితాసేన్ ప్రధాన పాత్రలో హిందీలో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కనుందని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఇందులో సుష్మితాసేన్ మోస్ట్ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారట. ఈ సినిమా కథనం మధ్యప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని టాక్. కథ విని సుష్మిత ఇంప్రెస్ అయ్యారట కానీ, కొన్ని మార్పులు చెప్పారట. ప్రస్తుతం టీమ్ స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉంది. అంతా సాఫీగా జరిగితే ఈ సినిమా నెక్ట్స్ ఇయర్ సెట్స్‌పైకి వెళుతుంది. అలాగే ఈ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... దాదాపు ఎనిమిదేళ్ల కిత్రం వచ్చిన ‘నో ప్రాబ్లమ్’ సినిమా తర్వాత హిందీలో మరో సినిమా చేయలేదు సుష్మితాసేన్. ఇప్పుడు లాఠీపట్టి, ఖాకీ తొడిగి పోలీసాఫీసర్‌గా సిల్వర్‌స్క్రీన్‌పైకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ బ్యూటీ. -
'బాలీవుడ్లో మేం చెడిపోయాం'
హిందీ సినీ పరిశ్రమలో నటీనటులంతా చెడిపోయారని ఒకనాటి హీరోయిన్, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ చెప్పింది. కేవలం పశ్చిమబెంగాల్లోనే కాక.. యావద్దేశంలోని మంచి నటులతో కలిసి పనిచేయడం తాను గౌరవంగా భావిస్తానని, కానీ బాలీవుడ్లో మాత్రం తాము చెడిపోయామనే చెప్పక తప్పదని ఆమె తెలిపింది. ''మేం బాగా కనిపిస్తాం, మా పని కూడా అవుతుంది. కొంతమంది నటులు వాళ్ల పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తారు. వంద సినిమాల్లో చేసినా వాళ్లు ఏపాత్రలోనైనా ఒదిగిపోతారు'' అని ఆమె చెప్పింది. తాజాగా సుస్మితా సేన్ జాతీయ అవార్డు విజేత శ్రీజిత్ ముఖర్జీ తీస్తున్న నిర్బాక్ (మూగ) సినిమాలో చేస్తోంది. ఈ సినిమాను 22 రోజుల్లోనే పూర్తి చేశారు. మే 1న సినిమా విడుదల కానుంది. ట్రైలర్‌కు ఇప్పటికే లక్షకు పైగా హిట్లు వచ్చాయి. తాను తన సొంత భాషలో ఒక్క సినిమా అయినా చేయాలన్నది తన తండ్రి ఆశ అని, అందుకే ఈ సినిమాలో బెంగాలీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నానని సుస్మిత చెప్పింది.