‘ఆ అద్భుతానికి నేటితో 20 సంవత్సరాలు’ | Lara Dutta Celebrates 20 Years of Miss Universe Win | Sakshi
Sakshi News home page

అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన లారా దత్తా

Published Tue, May 12 2020 5:54 PM | Last Updated on Tue, May 12 2020 6:13 PM

Lara Dutta Celebrates 20 Years of Miss Universe Win - Sakshi

‘నా జీవితంలో చోటుచేసుకున్న ఆ అద్భుతమైన ఘట్టానికి నేటితో 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. విశ్వం ఇచ్చిన ఈ బహుమతికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అన్నారు మిస్‌ యూనివర్స్‌, నటి లారా దత్తా. సరిగ్గా 20 ఏళ్ల క్రితం అంటే మే 12, 2000న లారా దత్తా మిస్‌ యూనివర్స్‌గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాటి వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు లారా దత్తా.

‘నేటికి 20 ఏళ్లు.. మే 12,2000,నికొసియా, సిప్రస్‌. విశ్వం నుంచి లభించిన అద్భుతమైన బహుమతి.. సదా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ రాసుకొచ్చారు లారా దత్తా. ఆ ఏడాది జరిగిన మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో ఆఖరి రౌండ్లో లారా దత్తా 9.99 స్కోర్‌ సాధించి చరిత్ర సృష్టించింది. అదే సంవత్సరం ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కిరీటం.. దియా మీర్జా మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ గెలుచుకున్నారు. మిస్ యూనివర్స్ కిరీటం పొందిన రెండవ భారతీయ మహిళ లారా దత్తా. ఆమె కంటే  ముందు సుస్మితా సేన్ 1994 లో ఈ టైటిల్ గెలుచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement