దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రోజుకి మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. కేసుల సంఖ్య పెరగడంతో పలు ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు దొరకడం లేదు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, ముంబైల్లో కరోనా ధాటికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు.
ఇలాంటి కష్ట సమయంలో సాయం చేయడానికి పలువు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితాసేన్ కరోనా రోగులకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఢిల్లీలోని శాంతి ముకుంద్ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు అందజేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ట్వీట్ చేసింది. ఇటీవపల ఢిల్లీలోని శాంతి ముకుంద్ ఆసుపత్రి సీఈఓ సునీల్ సాగర్ ఓ ఇంటర్వ్యూలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉందని చెప్పారు. ఆ వీడియో చూసిన సుస్మితా.. ‘హృదయ విదారకమైన పరిస్థితి ఇది. దేశంలో ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత ఉంది. ఈ ఆస్పత్రికి కొన్ని ఆక్సిజన్ సిలీండర్లను నేను అందించగలను. కానీ ముంబయి నుంచి ఢిల్లీకి వాటిని ఎలా పంపించాలో అర్థం కావడం లేదు. దయచేసి వాటి రవాణాలో నాకు కొంచెం సాయం చేయగలరు’ అని ట్వీట్ చేశారు.
కాగా, సుస్మిత సేన్ సాయాన్ని కూడా ఓ నెటిజన్ అవహేళన చేశాడు. ‘దేశమంతా ఆక్సిజన్ కొరత ఉన్నప్పుడు ముంబైలో కాకుండా ఢిల్లీలోని ఆస్పత్రులకు మాత్రమే ఎందుకు సాయం చేస్తున్నారు’అని ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన సుస్మితా.. ఆ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చింది. ‘ఢిల్లీకి ఎందుకు సాయం చేస్తున్నానంటే.. ముంబైలో ఆక్సిజన్ కొరత పెద్దగా లేదు. ప్రస్తుతం ఢిల్లీలోని ఎన్నో ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలీండర్ల కొరత ఏర్పడింది. ముఖ్యంగా చిన్న చిన్న ఆస్పత్రులకు ప్రాణవాయువు సిలిండర్లు లభించడంలేదు. అందుకే సాయం చేస్తున్నా. వీలైతే మీరు సాయం చేయండి’అని ఘాటైన సమాధానం ఇచ్చింది.
This is deeply heart breaking...oxygen crisis is everywhere. I have managed to organise a few oxygen cylinders for this hospital but have no way to transport it to Delhi from Mumbai...please help me find a way🙏 https://t.co/p8RWuVQMrO
— sushmita sen (@thesushmitasen) April 22, 2021
చదవండి:
మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్‌కు కోవిడ్ ఎలా సోకిందంటే..
Comments
Please login to add a commentAdd a comment