ట్యాంకర్లలో ఆక్సిజన్ నింపుతున్న ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్ చక్రధర్‌బాబు
ముత్తుకూరు: కరోనా బాధితులకు వైద్య చికిత్స కోసం మేఘా ఇంజనీరింగ్ సంస్థ సీఎస్సార్ ఫండ్స్‌తో రూ.1.65 కోట్ల విలువైన 75 ఎంటీ (మెట్రిక్ టన్ను)ల మెడికల్ ఆక్సిజన్‌ను జిల్లాకు అందించినట్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు. మేఘా సంస్థ ద్వారా శుక్రవారం ఒక్కోటి 25 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కలిగిన మూడు ట్యాంకర్లు రైలు మార్గంలో అదాని కృష్ణపట్నం పోర్టుకు చేరాయి.
వీటికి కలెక్టర్ చక్రధర్‌బాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మేఘా సంస్థను అభినందించారు. సీఎం వైఎస్ జగన్ తీసుకొన్న ప్రత్యేక శ్రద్ధతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీరిందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీలు హరేంద్రప్రసాద్, బాపిరెడ్డి, పోర్టు సీఈవో సతీష్ చంద్రరాయ్, మేఘా ప్రతినిధులు నారాయణ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment