cylinders
-
LPG Price Hike: పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి. దీని ప్రభావం సామాన్యులపై కూడా కనిపించనుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.39 పెరిగింది. దీంతో ఇప్పుడు ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర రూ.1,691.50గా మారింది. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.కోల్‌కతాలో వాణిజ్య సిలిండర్ కొత్త ధర రూ.1802.50గా, ముంబైలో కమర్షియల్ సిలిండర్ కొత్త ధర రూ.1644గా, చెన్నైలో కమర్షియల్ సిలిండర్ కొత్త ధర రూ.1855కి చేరింది. గత జూలై ఒకటిన వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగించేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. జూలై ఒకటిన 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.30 తగ్గింది.ప్రతి నెల ప్రారంభంలో ఎల్పీజీ సిలిండర్ ధరలలో చోటుచేసుకుంటున్న సర్దుబాట్లు మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంటాయి. అంతర్జాతీయ చమురు ధరలు, పన్నుల విధానాలు , సరఫరా, డిమాండ్ వంటి వివిధ అంశాలు ఈ ధర నిర్ణయాలలో కీలకంగా ఉంటాయి. -
Hyderabad: ‘గ్యాస్’ బెనిఫిట్.. 10 లక్షల మందికే..
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ వంట గ్యాస్ స్కీంకు రేషన్‌కార్డు మెలిక పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆహార భద్రత (రేషన్) కార్డులు కలిగిన నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లు పొందేందుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మహానగర పరిధిలోని గృహోపయోగ వంటగ్యాస్ కనెక్షన్‌దారుల్లో సగానికి పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. గత పదేళ్లలో అనేక కుటుంబాల్లోని సభ్యులు వివాహాలతో వేరుపడడం, కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయకపోవడంతో కార్డులు లేని కుటుంబాల సంఖ్య బాగా పెరిగింది. అది కాస్తా సబ్సిడీ వంట గ్యాస్ అర్హతకు సమస్యగా తయారైంది. 10 లక్షల కనెక్షన్లకే సబ్సిడీ వర్తింపు గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో సుమారు 10 లక్షల గ్యాస్ కనెక్షన్లకే సబ్సిడీ వంట గ్యాస్ వర్తించనుంది. ప్రసుత్తం కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అధికారికంగా గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు కలిగిన సుమారు 30 లక్షల కుటుంబాలకు మాత్రమే నగదుగా బదిలీ అవుతోంది. మరోవైపు ఉపాధి, ఇతరత్రా కోసం వలస వచి్చన కుటుంబాలతో మరో పది లక్షల అనధికార కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఇటీవల జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో సుమారు 19.01 లక్షల కుటుంబాలు సబ్సిడీ వంట గ్యాస్ వర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కాగా, అందులో తెల్లరేషన్ కార్డులు కలిగిన గ్యాస్ కనెక్షన్ దారులు కేవలం 10 లక్షల వరకు మాత్రమే ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచారు. దీంతో మిగిలిన వారి పరిస్థితి ప్రశ్నార్ధకంగా తయారైంది. ఉజ్వలకు వర్తింపు ? ప్రధాన మంత్రి ఉజ్వల కల్యాణ్ యోజన పథకం కింద గల కనెక్షన్లకు సబ్సిడీ వర్తింపుపై అయోమయం నెలకొంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద వంటగ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న కుటుంబాలకు సిలిండర్‌పై రూ.300ల సబ్సిడీ వర్తింపజేస్తోంది. మహానగరం మొత్తం మీద లక్ష వరకు కనెక్షన్లు ఉన్నట్లు ప్రధాన ఆయిల్ కంపెనీల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఉజ్వల పథకం ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తిస్తోంది. కొత్త పథకం వర్తిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ రెండు విధాలుగా నగదు బదిలీ జమ అవుతుందా? లేక సబ్సిడీ సొమ్ము తగ్గుతుందా? అనేది స్పష్టత లేకుండా పోయింది. ప్రస్తుతం సబ్సిడీ ఇలా కేంద్ర ప్రభుత్వం గృహోపయోగ వంటగ్యాస్ సిలిండర్లపై ప్రస్తుతం రూ.40.17 పైసలు సబ్సిడీ అందిస్తోంది. గత రెండేళ్లుగా వంట గ్యాస్ ధరతో సంబంధం లేకుండా సబ్సిడీలో మాత్రం ఏలాంటి మార్పు లేకుండా వర్తింపజేస్తోంది. వాస్తవంగా వంట గ్యాస్ సిలిండర్‌పై వర్తింపజేసే సబ్సిడీ వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలోకి నేరుగా జమ చేసే డీబీటీఎల్ పథకం 2014 నవంబర్ 10న అమల్లో వచి్చంది. వినియోగదారులు గ్యాస్ సిలిండర్ రీఫిల్ కోసం పూర్తి మొత్తాన్ని డెలివరీ సమయంలో చెల్లిస్తే అనంతరం వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ నగదు జమ జరిగేది. డీబీటీ పథకం అమలు తొలిరోజుల్లో సబ్సిడీ బాగానే వర్తించేంది. తాజాగా సిలిండర్ ధరతో నిమిత్తం లేకుండా సబ్సిడీ నగదు జమ రూ 40.71 పైసలకు పరిమితమైంది. -
భారీ అగ్నిప్రమాదం...ఆరు సిలండర్లు వరుసగా పేలడంతో...
రాజస్తాన్: ఆరు గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐతే ఈ ఘటనలో వరసగా ఆరు సిలిండర్లలో పేలుడు సంభవించిందని, దీంతో పలు వాహనాలు దారుణంగా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే స్థానికులు సకాలంలో స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటన జోథ్‌పూర్‌లో మంగ్రా పుంజ్లా ప్రాంతంలోని రెసిడెన్షియల్ కాలనీలో చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనమయ్యారని, దాదాపు 16 మంది తీవ్ర గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. ఐతే దర్యాప్తులో ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్‌కి అక్రమంగా రీఫిల్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తేలింది. ప్రస్తుతం క్షతగాత్రులు జోథ్‌పూర్‌లోని మహాత్మగాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన సిలిండర్ ప్రమాదం మరువక మునుపే ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరం. (చదవండి: బస్సులో చెలరేగిన మంటలు.. 11 మంది సజీవ దహనం) -
కేంద్రం సంచలన నిర్ణయం.. గ్యాస్ సిలిండర్లపై కొత్త రూల్స్!
ఇటీవలే నిత్యవసరాల వస్తువులకు జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి సామాన్యుడికి కేంద్రం ప్రభుత్వం షాకిచ్చింది. తాజాగా గ్యాస్ సిలిండర్లపై కొత్త నిబంధనలను తీసుకొచ్చి మరో ఊహించని షాక్ ఇవ్వనుంది. పలు మీడియా నివేదికల ప్రకారం.. గ్యాస్ వినియోగంపై పరిమితులు విధిస్తూ మోదీ సర్కార్ కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టనుంది. దీని ప్రకారం... వినియోగదారులు ఇకపై ఏడాదికి 15 సిలిండర్లు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. నెలకు కేవలం 2 గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేసేలా.. మార్పులు చేసింది. అయితే ఇప్పటి వరకూ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా..ప్రచారం మాత్రం సాగుతోంది. ఇదిలా ఉంటే.. దేశంలో నాన్-సబ్సిడీ కనెక్షన్ వినియోగదారులు ఇప్పటివరకు ఎన్ని సిలిండర్లు కావాలన్నా రీఫిల్స్ బుక్ చేసుకోవచ్చు. అయితే కొందరు వినియోగదారులు సిలిండర్లను దుర్వినియోగం చేస్తున్నారని నివేదికలు బయటపడ్డాయి. దీంతో ఈ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్తగా తీసుకురాబోయే చట్టం ప్రకారం.. ఒకవేళ అదనంగా సిలిండర్ల అవసరమైతే.. వినియోగదారులు సిలిండర్ తీసుకోవాల్సిన అవసరాన్ని తెలపడంతో పాటు నిర్ధేశించిన డ్యాకుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. వీటి డిమాండ్‌ని పరిశీలిస్తే.. జూలై 1, 2021, జూలై 6, 2022 మధ్య 12 నెలల కాలంలో వంట గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. జూలై 2021లో ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 834 ఉండగా, జూలై 2022 నాటికి , 26 శాతం పెరిగి రూ.1,053కి చేరుకుంది. ఎల్పీజీ( LPG)) సిలిండర్ ధరలు ప్రతి రాష్ట్రంలో వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే వాటి విలువ ఆ రాష్ట్రంలో విధించే పన్నులతో పాటు రవాణా ఛార్జీలపై ఆధారపడి ఉంటాయి. వాటిని కూడా ముడి చమురు ధరల ఆధారంగా లెక్కిస్తారు. చదవండి: బ్యాంకింగ్ బాదుడు.. రెడీగా ఉండండి, ఈ భారం కస్టమర్లదే! -
ఆక్సిజన్ ప్లాంట్లలో సిలిండర్లు నింపుకొనే వెసులుబాటు
సాక్షి, హైదరాబాద్: జిల్లా ఆసుపత్రుల్లోని పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద సిలిండర్లను నింపి ఏరియా, సామాజిక, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేయాలని వైద్యవిధాన పరిషత్ నిర్ణయించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద ఆక్సిజన్ భారీగా అందుబాటులో ఉందని, దాన్ని చిన్న ఆసుపత్రులకు సరఫరా చేస్తే రోగులకు ఉపయోగం ఉంటుందని పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ అన్నారు. సిలిండర్లను నింపుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రుల సూపరింటెం డెంట్లు, ఫార్మసిస్టులు, ఇతర అధికారులతో డాక్టర్ అజయ్‌కుమార్ శుక్రవారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, సిజేరియన్లను ప్రోత్సహించవద్దని సూచించారు. ఆరోగ్యశ్రీ ద్వారా సేవలను విస్త్రృత పరచాలని, అవసరం లేకపోయినా పైస్థాయి ఆసుపత్రులకు రోగులను రిఫర్ చేయకూడదని పేర్కొన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, రోగులు బయట కొనుగోలు చేసే పరిస్థితి రావొద్దని, డయాలసిస్ యూనిట్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జయరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హరీశ్‌రావు పుట్టినరోజు వేడుకలు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజును పురస్కరించుకొని వైద్య విద్యాసంచాల కుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి కేక్ కట్ చేశారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. -
ఆ నిరసన బాధ్యతారాహిత్యం.. మంత్రి కేటీఆర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: చెరువుల్లో బైక్స్, సిలిండర్లు వేసి నిరసన తెలపడంపై రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల్లో ఇలాంటి వేయకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీకి కేటీఆర్ సూచించారు. చెరువుల్లో బైక్స్, సిలిండర్లు వేయటం బాధ్యతారాహిత్యం అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. Protest is an important part of democracy to attract the attention of Govts & people But irresponsible behaviour such as these👇, throwing bikes & cylinders into lakes is reprehensible Request HM @mahmoodalitrs Garu and @TelanganaDGP Garu to issue instructions for stern action pic.twitter.com/TRTSGAWQLr — KTR (@KTRTRS) July 6, 2021 -
ప్రాణవాయువు పంపిస్తాన్న హీరోయిన్.. నెటిజన్స్ ట్రోల్స్
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రోజుకి మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. కేసుల సంఖ్య పెరగడంతో పలు ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు దొరకడం లేదు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, ముంబైల్లో కరోనా ధాటికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాంటి కష్ట సమయంలో సాయం చేయడానికి పలువు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితాసేన్ కరోనా రోగులకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఢిల్లీలోని శాంతి ముకుంద్ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు అందజేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ట్వీట్ చేసింది. ఇటీవపల ఢిల్లీలోని శాంతి ముకుంద్ ఆసుపత్రి సీఈఓ సునీల్ సాగర్ ఓ ఇంటర్వ్యూలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉందని చెప్పారు. ఆ వీడియో చూసిన సుస్మితా.. ‘హృదయ విదారకమైన పరిస్థితి ఇది. దేశంలో ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత ఉంది. ఈ ఆస్పత్రికి కొన్ని ఆక్సిజన్ సిలీండర్లను నేను అందించగలను. కానీ ముంబయి నుంచి ఢిల్లీకి వాటిని ఎలా పంపించాలో అర్థం కావడం లేదు. దయచేసి వాటి రవాణాలో నాకు కొంచెం సాయం చేయగలరు’ అని ట్వీట్ చేశారు. కాగా, సుస్మిత సేన్ సాయాన్ని కూడా ఓ నెటిజన్ అవహేళన చేశాడు. ‘దేశమంతా ఆక్సిజన్ కొరత ఉన్నప్పుడు ముంబైలో కాకుండా ఢిల్లీలోని ఆస్పత్రులకు మాత్రమే ఎందుకు సాయం చేస్తున్నారు’అని ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన సుస్మితా.. ఆ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చింది. ‘ఢిల్లీకి ఎందుకు సాయం చేస్తున్నానంటే.. ముంబైలో ఆక్సిజన్ కొరత పెద్దగా లేదు. ప్రస్తుతం ఢిల్లీలోని ఎన్నో ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలీండర్ల కొరత ఏర్పడింది. ముఖ్యంగా చిన్న చిన్న ఆస్పత్రులకు ప్రాణవాయువు సిలిండర్లు లభించడంలేదు. అందుకే సాయం చేస్తున్నా. వీలైతే మీరు సాయం చేయండి’అని ఘాటైన సమాధానం ఇచ్చింది. This is deeply heart breaking...oxygen crisis is everywhere. I have managed to organise a few oxygen cylinders for this hospital but have no way to transport it to Delhi from Mumbai...please help me find a way🙏 https://t.co/p8RWuVQMrO — sushmita sen (@thesushmitasen) April 22, 2021 చదవండి: మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్‌కు కోవిడ్ ఎలా సోకిందంటే.. -
పోలవరంలో మరో ముఖ్య ఘట్టం
సాక్షి, అమరావతి: పోలవరం స్పిల్ వే పనుల్లో మరో కీలక ఘట్టం మొదలైంది. స్పిల్ వే గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లను అమర్చే ప్రక్రియను మేఘా సంస్థ సోమవారం ప్రారంభించింది. ఈ హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లను జర్మనీకి చెందిన మాంట్ హైడ్రాలిక్ సంస్థ నుంచి దిగుమతి చేసుకున్నారు. జర్మనీ నుంచి సంస్థ ఇంజనీర్లు పోలవరానికి చేరుకుని గేట్లకు సిలిండర్ల బిగింపు పనులను పర్యవేక్షిస్తున్నారు. వరద పోటును తట్టుకునేలా... పోలవరం పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 అడుగులు కాగా గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరాక మిగులు జలాలను స్పిల్ వే ద్వారా దిగువకు విడుదల చేస్తారు. 1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజీకి గోదావరి నుంచి 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. గోదావరి చరిత్రలో ఇప్పటివరకూ వచ్చిన గరిష్ట వరద ప్రవాహం అదే. పోలవరం జలాశయం భద్రత దృష్ట్యా గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్ వే నిర్మాణ డిజైన్లను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించింది. ఆ మేరకు 1,128 మీటర్ల పొడవున స్పిల్ వేను నిర్మిస్తున్నారు. స్పిల్ వే పిల్లర్లకు 25.72 అడుగుల నుంచి 45.72 అడుగుల మధ్య 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను అమర్చాలి. ఇప్పటికే 29 గేట్లను అమర్చారు. ఒక్కో గేటు బరువు 300 టన్నులు ఉంటుంది. పోలవరం ప్రాజెక్టులోకి నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరాక వరదను దిగువకు విడుదల చేయాలంటే గేట్లను ఎత్తాలి. వరద ప్రవాహం తగ్గాక నీటిని గరిష్ట స్థాయిలో నిల్వ చేయాలంటే గేట్లను దించాలి. ఇలా గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ఒక్కో గేటుకు కుడి వైపున ఒకటి, ఎడమ వైపున ఒకటి చొప్పున రెండు హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చాలి. తాజాగా ఈ పనులు ప్రారంభమయ్యాయి. గేట్లు, హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక ఇలా.. ► భారీ క్రేన్లతో ఆర్మ్ గడ్డర్లను ఎత్తి పిల్లర్లలో నిర్మించిన ట్రూనియన్ బీమ్‌కు బిగిస్తారు. రెండు పిల్లర్ల ట్రూనియన్ బీమ్ బ్రాకెట్లకు ఒక్కోదానికి నాలుగు ఆర్మ్ గడ్డర్ల చొప్పున బిగిస్తారు. రెండు పిల్లర్లకు బిగించిన ఆర్మ్ గడ్డర్స్‌ను హారిజాంటల్ గడ్డర్లతో అనుసంధానం చేస్తారు. ► భారీ క్రేన్ల సహకారంతో ఎనిమిది స్కిన్ ప్లేట్లను ఎత్తి రెండు పిల్లర్లకు అమర్చిన ఆర్మ్ గడ్డర్స్, హారిజాంటల్ గడ్డర్స్ మధ్య ఎగువన నాలుగు స్కిన్ ప్లేట్లు(ఎలిమెంట్స్), దిగువన నాలుగు స్కిన్ ప్లేట్లను అతికిస్తారు. స్కిన్ ప్లేట్ల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా వెల్డింగ్ చేస్తారు. దీంతో ఒక గేటు సిద్ధమవుతుంది. ► పిల్లర్లకు 45 మీటర్ల ఎత్తు వద్ద డౌన్ స్ట్రీమ్ (స్పిల్ వేకు దిగువ) వైపు కార్దానిక్ అరైంజ్మెంట్కు బిగిస్తారు. రెండు పిల్లర్లకు ఏర్పాటు చేసిన కార్దానిక్ అరైంజ్‌మెంట్.. గేటు అడుగున ఉన్న హారిజాంటల్ గడ్డర్‌కు అమర్చిన బ్రాకెట్ మధ్య స్పిల్ వేకు ఇరువైపులా డౌన్ స్ట్రీమ్‌లో ఒక్కొక్కటి 215 టన్నుల సామర్థ్యంతో కూడిన రెండు హైడ్రాలిక్ సిలిండర్లను బిగిస్తారు. స్పిల్ వే పిల్లర్లకు 55 మీటర్ల స్థాయిలో ఏర్పాటు చేసిన పవర్ ప్యాక్‌లతో కార్దానిక్ అరైంజ్మెంట్ను అనుసంధానం చేస్తారు. ప్రతి రెండు గేట్లకు ఒకచోట ఈ పవర్ ప్యాక్‌లను అనుసంధానం చేస్తూ స్పిల్ వే బ్రిడ్జిపై కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తారు. గేట్లను ఎత్తాలకున్నప్పుడు కంట్రోల్ రూమ్ వద్దకు వెళ్లి పవర్ ప్యాక్ స్విచ్ ఆన్ చేస్తారు. గేటుకు అడుగున హారిజాంటల్ గడ్డర్‌కు ఇరు వైపులా బిగించిన హైడ్రాలిక్ బ్రాకెట్‌కు అమర్చిన హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ సహకారంతో గేటుపైకి లేస్తుంది. నిమిషానికి అర మీటర్ చొప్పున గేటు పైకి లేస్తుంది. దించాల నుకున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తారు. పిల్లర్ 45 మీటర్ల స్థాయిలో కార్దానిక్ అరైంజ్మెంట్కు అమర్చిన హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల సహాయంతో గేటు కిందకు దిగుతుంది. ► జర్మనీ నుంచి ఇప్పటికే 70 సిలిండర్లు పోలవరానికి చేరుకున్నాయి. మిగిలిన 26 సిలిండర్లు మార్చి 15లోగా పోలవరానికి చేరుకుంటాయి. ఒకవైపు ఇప్పటికే అమర్చిన 29 గేట్లకు సిలిండర్లను బిగిస్తూ మరోవైపు మిగిలిన 19 గేట్లను బిగిస్తూ వాటికి సిలిండర్లను అమరుస్తారు. ఈ ప్రక్రియను ఏప్రిల్‌లోగా పూర్తి చేస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. -
సబ్సిడీ సిలిండర్లతో దందా
కరీంనగర్ అర్బన్: పేద, మధ్య తరగతి ప్రజలకు అందించే రాయితీ వంట ఇంధనం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. సబ్సిడీ గ్యాస్‌ను కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా మినీ సిలిండర్లలో నింపుతూ పెద్ద దందా సాగిస్తున్నారు. సబ్సిడీ సిలిండర్లను కొంతమంది బ్లాక్‌లో కొనుగోలు చేసి అందులోని ఇంధనాన్ని మినీ సిలిండర్లలో నింపి విక్రయిస్తున్నారు. రీఫిలి్లంగ్ ద్వారా ఒక్కో సిలిండర్‌కు అందనంగా రూ.వెయ్యి సంపాదిస్తున్నారు. జిల్లాలో మినీ గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా యథేచ్ఛగా నడుస్తోంది. ప్రభుత్వ నిబంధనలు పట్టని హోంనీడ్స్ దుకాణాల నిర్వాహకులు మినీ సిలిండర్లలో గ్యాస్ నింపి విక్రయాలు కొనసాగిస్తున్నారు. మినీ సిలిండర్ సైజ్‌ను బట్టి డబ్బులు గుంజుతున్న నిర్వాహకుల ఆగడాలకు కళ్లెం వేసేవారే కరువయ్యారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్, మంకమ్మతోట, గణేశ్‌నగర్, కోతిరాంపూర్, పెద్దపల్లిరోడ్, కోర్టుచౌరస్తాల్లో పదుల సంఖ్యలో గ్యాస్ రీఫిలి్లంగ్ దుకాణాలున్నాయి. జనావాసాల నడుమ అక్రమ దందా నడుస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వీరి అక్రమాలపై నిఘా పెట్టి నియంత్రించాలి్సన సంబంధిత అధికారులు నెలవారీగా నిర్వాహకుల నుంచి ముడుపులు తీసుకుని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసులు పెడుతూ తర్వాత దందా నడిచేలా పరోక్షంగా సహకరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని పలు హోంనీడ్స్ దుకాణాలు అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ వ్యాపారానికి అడ్డాగా మారాయి. హైదరాబాద్ నుంచి చిన్న సిలిండర్లు కొనుగోలు చేసి ఇక్కడకు తెచ్చి వ్యాపారం చేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో మినీ సిలిండర్లు విక్రయిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. రాయితీ గ్యాస్ ధర రూ.766.50 కాగా, వాణిజ్య గ్యాస్ ధర రూ.1500. ఈ సిలిండర్లను వినియోగదారులు, ఏజెన్సీ నిర్వాహకుల సాయంతో కొనుగోలు చేసి రహస్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న గోదాంలకు తరలిస్తున్నారు. మరికొందరు దుకాణాల్లోనే వెనుక వైపు మినీ సిలిండర్లలో రీఫిలి్లంగ్ చేస్తున్నారు. జిల్లాలోని పలు మండలాలకు వీటిని తరలించి పెద్దమొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. మధ్య తరగతి ప్రజలు, చిరువ్యాపారులు, పెళ్లికాని ప్రసాదులు, ఉన్నత చదువుల కోసం వివిధ గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తున్న విద్యార్థులు మినీ సిలిండర్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీరి అవసరాలను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రూ.766 ఉన్న రాయితీ గ్యాస్ ను గ్యాస్ వినియోగదారుల నుంచి రూ.900 నుంచి రూ. 1000కి కొనుగోలు చేస్తున్న నిర్వాహకులు 3 లేదా 4 సిలిండర్లలో నింపుతూ రూ.వెయ్యి అదనంగా సంపాదిస్తున్నారు. జనావాసాల మధ్య వ్యాపారం జనావాసాల మధ్య అక్రమ దందా నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మినీ సిలిండర్లు వాడడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. నిర్వాహకులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న గోదాంలలో గ్యాస్ నింపే సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే భారీ మూల్యం చెల్లించాలి్సందే. ఇవన్నీ సంబంధిత అధికారులకు తెలిసినా సీరియస్‌గా తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనావాసాల మధ్య కార్లలో గ్యాస్ నింపే దందా కూడా ఎక్కువగా సాగుతోంది. భగత్‌నగర్, కోతిరాంపూర్, మంకమ్మతోట, రాంనగర్, విద్యానగర్, సీతారాంపూర్ తదితర ప్రాంతాల్లో దందా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం పొందిన పలు గ్యాస్ కంపెనీలు మార్కెట్లో 5కిలోల సిలిండర్లు సరఫరా చేస్తున్నాయి. వీటిని వినియోగించేందుకు జనం ఆసక్తి చూపడం లేదు. దీనిపై అవగాహన కల్పించాలి్సన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
అమ్మకానికి ఆక్సిజన్ సిలిండర్లు
-
అక్రమ గ్యాస్ ఏజెన్సీ గుట్టు రట్టు
విశాఖపట్నం: జిల్లాలోని ఆరిలోవ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న గ్యాస్ ఏజెన్సీ గుట్టును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు రట్టు చేశారు. ఈ ఏజెన్సీపై అధికారులు దాడులు జరిపి 330 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.26 లక్షల 69 వేల ఉంటుంది. -
ఆక్సిజన్ సిలండర్లు ఉంటేనే.. బతుకుతాం!
ఢిల్లీలో ఇక తిరగాలంటే ఆక్సిజన్ సిలండర్లు ఉండాల్సిందేనా? ప్రతి వ్యక్తి రోజూ 5 సిలండర్లు దగ్గర పెట్టుకోవాల్సిందేనా? అంటే అవునని నిపుణులు చెబుతున్నారు. ఆ రోజులు ఉంతో దూరంలో లేవని కూడా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వాసులకు అత్యంత తీవ్ర స్థాయిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. చర్యలు తీసుకున్న సమయంలో కాలుష్యం తగ్గినట్లు కనిపించినా.. వెంటనే మళ్లీ వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలంటే.. ఆక్సిజన్ సిలండర్లు.. వెంట పెట్టుకోవాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయో రోజుల్లో ప్రతి వ్యక్తి కనీసం రోజుకు 5 సిలండర్లు వెంట పెట్టుకోవాల్సిందేనని నిపుణులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం అనేక రోగాలకు కారణంగా మారుతోంది. ప్రధానంగా.. నెలల నిండకుండానే పిల్లలు పుట్టడం, హృదయ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, అలర్జీలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలకు కారణమవుతోంది. ఢిల్లీ ఎయిర్ డాట్ ఓఆర్జీ వెబ్ సైట్ ప్రకారం.. ఢిల్లీ, రాజధాని పరిసర ప్రాంతాల్లో వాయుకాలుష్యం భీకరంగా జరుగుతోంది. మానవ కార్యకలాపాలు, వాహనాలు వెదజల్లే కార్బన్డయాక్సైడ్, నిర్మాణ పనులు, పరిశ్రమలు, గృహ అవసరాల కోసం ఇంధన ఉపయోగం వంటికి ఇందుకు ప్రధాన కారణాలు. ఢిల్లీ మున్సిపాలిటీ ప్రతిరోజూ 10 వేల టన్నుల చెత్తను సేకరిస్తోంది. కాలుష్యానికి ఇదీ ఒక కారణమే. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ ఆధారిత రవాణ వ్యవస్థను (ఎలక్ట్రిక్ బస్ తరహావంటివి) అభివృద్ధి చేయాలని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుమిత రాయ్ చౌదరి సూచించారు. అంతేకాక 2018లోపు భద్రాపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయాలని ఆయన చెప్పారు. -
మళ్లీ పేలింది..!
వంట గ్యాస్ మళ్లీ భగ్గుమంది. ఈ ఏడాది వరుసగా నాలుగుసార్లు ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో సారి వినియోగదారులపై భారం మోపింది. గృహావసరాల సిలిండర్‌కు రూ. 4.50 పెంచింది.ఇప్పటికే నిత్యావసరాల రేట్లు పెరిగి విలవిలలాడుతున్న సామాన్యుడు.. పెరిగిన గ్యాస్ ధరతో మరింత ఆందోళన చెందుతున్నాడు. సాక్షి, యాదాద్రి : వంట గ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని క్రమంగా ఎత్తివేసే ప్రక్రియలో భాగంగా మరోసారి వినియోగదారులపై భారం మోపింది. నెలనెలా గ్యాస్ ధరలను పెంచుతూపోతున్న కేంద్రం.. మరోసారి పెద్ద మొత్తంలో పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌పై రూ.4.50 పెంచింది. పెరిగిన దరలను గ్యాస్ ఏజెన్సీలు గురువారం నుంచి అమల్లోకి తెచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.807 అయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 25 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 16 మండలాల్లో గ్యాస్ వినియోగం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ఆర్, దీపం పథకం కింద కనెక్షన్లు ఇస్తుండడంతో గ్యాస్ వాడకం మరింత పెరిగింది. గ్యాస్ లేకపోతే వంట చేసుకోలేని పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆరు నెలలుగా గ్యాస్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతూపోతోంది. సబ్సిడీ సొమ్మును వినియోగదారుల ఖాతాల్లో వేస్తున్నప్పటికీ ఒకేసారి మొత్తం చెల్లించి కొనుగోలు చేయడం వారికి ఇబ్బందిగా మారింది. గత అక్టోబర్‌లో రూ.700 ఉన్న సిలిండర్ ప్రస్తుతం పెంచిన ధరతో రూ.807కు చేరింది. దీంతో ప్రతి సంవత్సరం జిల్లాలోని వినియోగదారులపై సుమారు రూ.16 కోట్ల భారం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 2,93,766 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 2,04,033 కనెక్షన్లు, 50,156 దీపం, 4377 సీఎస్ఆర్ కంపెనీ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కనెక్షన్లు ఉన్నాయి. డెలివరీ చార్జీలు... ఏజెన్సీ నిర్వాహకులు డెలివరీ చార్జీలు అంతకు పదింతలు పెంచుతున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారుల నియంత్రణ కొరవడడంతో ఒక్కో సిలిండర్‌పై డెలివరీ చార్జీల పేరుతో రూ.20 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. యాదగిరిగుట్టలోని ఓ గ్యాస్ ఏజెన్సీ 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలేరులో సిలిండర్లు డెలివరీ చేసినందుకు గాను చార్జీల కింద రూ.45 అదనంగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చాలా ఏజెన్సీలు రూ.20 నుంచి రూ.50వరకు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నాయి. ఒక్కో సిలిండర్‌పై డెలివరీ చార్జీల కింద రూ.20 అంచనా వేసిన జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా రూ.58.75 లక్షలు వినియోగదారుల జేబుకు చిల్లు పడుతోంది. ఉపసంహరించుకోవాలి గ్యాస్ ధర పెంపును కేంద్రం ఉపసంహరించుకోవాలి తరచు ధరలు పెంయడంతో సామాన్యులపై భా రం పడుతుంది. నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. –చింతల కరుణ, గృహిణి, చౌటుప్పల్ సబ్సిడీ ఎత్తివేసే కుట్ర.. గ్యాస్ సబ్సిడీ ఎత్తివేసే కుట్రలో భాగమే ధరలు పెంచుతున్నారు. సామాన్య ప్రజలపై విపరీతమైన భారం ప డుతోంది. ప్రస్తుతం పూర్తి ధర చెల్లించి సబ్సిడీ పొందాల్సి వస్తుంది. –అన్నెపు పద్మ, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు, మోత్కూరు -
గ్యాస్ వినియోగదారులూ అదనంగా చెల్లించొద్దు
అనంతపురం రూరల్ : గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే బాయ్స్‌కు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని డీఎస్ఓ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అదనంగా చెల్లించవద్దని సూచించారు. డీలర్ పరిధిలో 5 కిలోమీటర్ల లోపు ఉంటే ఉచితం అన్నారు. 5–30 కి.మీలోపు ఉంటే సిలిండర్‌కు రూ.10, 30కి.మీ దాటితే రూ.15 చెల్లించాలన్నారు. అదనంగా అడిగితే 80083 01418 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. -
ఖమ్మంలో సివిల్ సఫ్లై అధికారుల దాడులు
ఖమ్మం: నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై బుధవారం సివిల్ సఫ్లై అధికారులు ఆకస్మికదాడులు నిర్వహించారు. అక్రమంగా వినియోగిస్తున్న 50 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేశారు. -
సిలిండర్లపై మధ్యాహ్న భోజనం: కేటీఆర్
సిరిసిల్ల: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కట్టెల పొయ్యిలపై కాకుండా గ్యాస్ సిలిండర్లపై తయూరు చేయూలని, ఇందుకోసం అన్ని స్కూళ్లకు సిలిండర్లు అందిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ, పేదలకు భూపట్టాల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లావాసి అరుునందున ముందుగా ఇక్కడినుంచే మార్పునకు శ్రీకారం చుట్టాలన్నారు. అన్ని మతాలను గౌరవించే సంస్కారం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని, పండుగ పూట పేదలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు చేయూతనందిస్తున్నామని చెప్పారు. -
ఉప్పల్‌లో పోలీసులు కార్డాన్ సెర్చ్
హైదరాబాద్: ఉప్పల్ ప్రాంతంలోని చిలుకానగర్‌లో బుధవారం తెల్లవారుజాము నుంచి పోలీసుల కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. మల్కాజ్గిరి డీసీపీ ఆధ్వర్యంలో దాదాపు 400 మంది పోలీసులు 19 బృందాలుగా విడిపోయి, దాదాపు 2వేల ఇళ్లలో సోదాలు చేశారు.తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం వరకు తనిఖీలు కొనసాగాయి. ఈ సోదాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా ఉంచిన గ్యాస్ కట్టర్లు, సిలిండర్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారికి బ్యాంకు దొంగతనాలతో సంబంధం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
పొయ్యిలు సరే.. సిలెండర్లేవి?
మంత్రి పర్యటనలో భాగంగా ‘దీపం’ మంజూరు వెంటనే కనెక్షన్లు స్వాధీనం గిరిజనుల ఆందోళనతో స్టౌలు పంపిణీ ఇప్పటికీ అందని గ్యాస్ సిలిండర్లు చింతపల్లి, న్యూస్‌లైన్ : దీపం పథకంలో భాగంగా గ్యాస్ పొయ్యిలు పంపిణీ చేసిన అధికారులు సిలిండర్లు ఇవ్వడం మరిచిపోయారు. దీనిపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 11న మంత్రి బాలరాజు చింతపల్లి, జీకే వీధి మండలాల్లో పర్యటనలో భాగంగా గిరిజన సహకార సంస్థ అధికారులు సబ్సిడీతో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జీకే వీధి, చింతపల్లి మండలాల్లో సుమారు 200 మంది తెల్ల రేషన్ కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయనున్నామని ప్రకటించారు. మంత్రి బాలరాజు చేతుల మీదుగా చాలా మంది గిరిజనులకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. మంత్రి పర్యటన ముగిసిన మరుక్షణమే లబ్ధిదారుల నుంచి అధికారులు గ్యాస్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇదేమని అడిగితే తెల్ల రేషన్‌కార్డుతో పాటు ఆధార్ కార్డు, దరఖాస్తు ఫారాలు, రూ.2,700 చెల్లిస్తే వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తామని, కనెక్షన్ మంజూరైన తర్వాత ఈ పథకం కింద గ్యాస్ పంపిణీ చేస్తామని అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఈ నెల 14న పలువురు మహిళలు చింతపల్లి జీసీసీ బ్రాంచి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఇదంతా ‘మంత్రి మెప్పు కోసమేనా’ శీర్షికతో ఈ నెల 15న సాక్షి దినపత్రికలో కథనం కూడా ప్రచురితమైంది. ఈ మేరకు దిగివచ్చిన అధికారులు గ్యాస్ పొయ్యిలను హుటాహుటిన అందజేసి చేతులు దులుపేసుకున్నారు. గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయకపోవడంతో గిరిజనులు మరోసారి ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు. సిలిండర్లు లేకుండా పొయ్యిలు పంపిణీ చేయడం వల్ల ప్రయోజనమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పథకాన్ని పూర్తి స్థాయిలో వర్తింపజేయాలని కోరుతున్నారు. -
ఏడాదికి ఆరు సిలెండర్లు చాలు:పనబాక
బాపట్ల(గుంటూరు): కేంద్రమంత్రి పనబాక లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఏడాదికి రాయితీ సిలెండర్లను ఆరు నుంచి తొమ్మిది పెంచిన సంగతి తెలిసిందే. ఆ తొమ్మిది నుంచి మరో మూడు సిలెండర్లు పెంచాలని కూడా కేంద్రం యత్నాలు చేస్తున్న నేపథ్యంలో పనబాక మాత్రం విడ్డూరంగా మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత నియోజక వర్గం బాపట్ల కు విచ్చేసిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కుటుంబానికి ఆరు సిలెండర్లు కేంద్రం అందిస్తే చాలని పేర్కొన్నారు. ఆ విషయాన్ని సర్వే నే తెలిపిందంటూ వ్యాఖ్యానించారు. ఎక్కువగా సిలెండర్లు ఇస్తే దారిద్ర్యానికి దిగువన ఉన్న(బీపీఎల్)కుటుంబాలు అమ్మేసుకుంటున్నాయంటూ నోరు పారేసుకున్నారు. ఆమె వ్యాఖ్యలపై నిరసన గళం పెళ్లుబికింది. తొమ్మిది సిలెండర్లతో ఎలా నెట్టుకు రావాలని సామాన్య ప్రజలు తర్జన భర్జన పడుతుంటే..ఆమె ఇలా మాట్లాడటం మంచిది కాదని ఆందోళన కారులు హెచ్చరించారు. -
సబ్సిడీకి మంగళం
పాలమూరు, న్యూస్‌లైన్: వంటగ్యాస్ సిలిండర్లకు నగదు బదిలీ పథకం అమలు మాటేమోగానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భరించిన భారాన్ని ఇకపై సామాన్య ప్రజానీకంపై మోపేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే జిల్లాలోని గ్యాస్ సిలిండర్ భారం వినియోగదారులకు గుదిబండ కాబోతుంది. జిల్లాలో దాదాపు 4.80 లక్షల మంది ఈ భారాన్ని మోయాల్సి వస్తుంది. సబ్సిడీ మొత్తం రూ.3.36కోట్ల భారం ప్రతినెలా జిల్లాలోని వినియోగదారులపై పడనుంది. ఒకవేళ నగదు బదిలీ పథకం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా వినియోగదారుల బ్యాంకుఖాతాల్లో జమ అవుతుంది. 2009-10లో కేంద్ర ప్రభుత్వం రూ.100 నుంచి రూ.150 వరకు ఒక్కో సిలిండర్‌పై ధరను పెంచింది. దీనిపై ప్రజలు భగ్గుమన్నారు. సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్రం వేసిన భారంలో నుంచి రూ.50 వరకు భరిస్తామంటూ మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అది కొంతకాలం అమలైన తరువాత రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ఉద్ధేశంతో ఆ తర్వాత వచ్చిన రోశయ్య ప్రభుత్వం రూ.50 నుంచి రూ.25 కోతపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం భరించే రాయితీని రూ.25కే పరిమితం చేసింది. గ్యాస్ సిలిండర్లకు నగదు బదిలీ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం పథకం కాబట్టి కేంద్రం ఎంత సబ్సిడీ భరిస్తుందో ఆ మొత్తాన్ని మాత్రమే బ్యాంకులో జమచేస్తుం ది. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం భరి స్తున్న రాయితీ గానీ, వ్యాట్గానీ అటు కేం ద్రం చెల్లించదు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్దుబాటు చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి మిగులు బాటు! సబ్సిడీ లేకుండా బహిరంగ మార్కెట్లో ఒక్కో సిలిండరు ధర రూ.1020. ప్రస్తుతం ఆ సిలిండర్ మన జిల్లాలో కాస్త అటూ ఇటుగా రూ.410కి లభిస్తుంది. ఇందులో కేంద్రం ఇచ్చే రాయితీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ, ఐదుశాతం వ్యాట్ మొత్తం కలిపి దాదాపు రూ.610 వరకు మనకు రా యితీగా వస్తుంది. నగదు బదిలీ పథకం ప్రారంభమైతే ఇందులోంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ వ్యాట్లు తీసేసి కేం ద్రం ఎంత మొత్తం రాయితీ ఇస్తుందో అం తమొత్తం మాత్రమే వినియోగదారుడి బ్యాంకుఖాతాలో జమచేస్తుంది. దీని ఫలి తం ఏమిటంటే ప్రస్తుతం ఇప్పుడు రూ.410 పెట్టి కొంటున్న సిలిండర్‌కు ఇక నుంచి గరిష్టంగా రూ.70 వరకు వినియోగదారు డు అదనంగా చెల్లించాలి. జిల్లాలో వం టగ్యాస్ వినియోగదారులు దాదాపు 4.80 లక్షల మంది ఉన్నారు. దాని ప్రకారం లెక్కేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.3.36కోట్లు మిగులుబాటు అవుతుంది. ఈ మొత్తం జిల్లాలోని వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. రాష్ట్రం ఇచ్చే రాయితీ ఇకపై ఉండదని, అదనంగా ఐదు శాతం వ్యాట్‌ను కూడా వినియోగదారుల్సి ఉంటుందని ఎల్పీజీ డీలర్ల సం ఘం ప్రతినిధులు చెబుతున్నారు.