ఉప్పల్‌లో పోలీసులు కార్డాన్ సెర్చ్ | Salt police cordon search | Sakshi
Sakshi News home page

ఉప్పల్‌లో పోలీసులు కార్డాన్ సెర్చ్

Published Thu, Jan 29 2015 7:45 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Salt police cordon search

హైదరాబాద్: ఉప్పల్ ప్రాంతంలోని చిలుకానగర్‌లో బుధవారం తెల్లవారుజాము నుంచి పోలీసుల కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. మల్కాజ్‌గిరి డీసీపీ ఆధ్వర్యంలో దాదాపు 400 మంది పోలీసులు 19 బృందాలుగా విడిపోయి, దాదాపు 2వేల ఇళ్లలో సోదాలు చేశారు.తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం వరకు తనిఖీలు కొనసాగాయి. ఈ సోదాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా ఉంచిన గ్యాస్ కట్టర్లు, సిలిండర్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారికి బ్యాంకు దొంగతనాలతో సంబంధం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement