భారీ అగ్నిప్రమాదం...ఆరు సిలండర్లు వరుసగా పేలడంతో... | Six Gas Cylinders Explode In Rajasthans Jodhpur Four Dead | Sakshi
Sakshi News home page

Cylinders Blast: భారీ అగ్నిప్రమాదం...ఆరు సిలండర్లు వరుసగా పేలడంతో...

Published Sat, Oct 8 2022 7:12 PM | Last Updated on Sat, Oct 8 2022 7:13 PM

Six Gas Cylinders Explode In Rajasthans Jodhpur Four Dead - Sakshi

రాజస్తాన్‌: ఆరు గ్యాస్‌ సిలిండర్‌లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐతే ఈ ఘటనలో వరసగా ఆరు సిలిండర్లలో పేలుడు సంభవించిందని, దీంతో పలు వాహనాలు దారుణంగా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే స్థానికులు సకాలంలో స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

ఈ ఘటన జోథ్‌పూర్‌లో మంగ్రా పుంజ్లా ప్రాంతంలోని రెసిడెన్షియల్‌ కాలనీలో చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనమయ్యారని, దాదాపు 16 మంది తీవ్ర గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. ఐతే దర్యాప్తులో ఒక సిలిండర్‌ నుంచి మరో సిలిండర్‌కి అక్రమంగా రీఫిల్‌ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తేలింది. ప్రస్తుతం క్షతగాత్రులు జోథ్‌పూర్‌లోని మహాత్మగాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన సిలిండర్‌ ప్రమాదం మరువక మునుపే ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరం.

(చదవండి: బస్సులో చెలరేగిన మంటలు.. 11 మంది సజీవ దహనం)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement