పాలమూరు, న్యూస్‌లైన్: వంటగ్యాస్ సిలిండర్లకు నగదు బదిలీ పథకం అమలు మాటేమోగానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భరించిన భారాన్ని ఇకపై సామాన్య ప్రజానీకంపై మోపేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే జిల్లాలోని గ్యాస్ సిలిండర్ భారం వినియోగదారులకు గుదిబండ కాబోతుంది. జిల్లాలో దాదాపు 4.80 లక్షల మంది ఈ భారాన్ని మోయాల్సి వస్తుంది. సబ్సిడీ మొత్తం రూ.3.36కోట్ల భారం ప్రతినెలా జిల్లాలోని వినియోగదారులపై పడనుంది. ఒకవేళ నగదు బదిలీ పథకం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా వినియోగదారుల బ్యాంకుఖాతాల్లో జమ అవుతుంది. 2009-10లో కేంద్ర ప్రభుత్వం రూ.100 నుంచి రూ.150 వరకు ఒక్కో సిలిండర్‌పై ధరను పెంచింది. దీనిపై ప్రజలు భగ్గుమన్నారు. సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్రం వేసిన భారంలో నుంచి రూ.50 వరకు భరిస్తామంటూ మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అది కొంతకాలం అమలైన తరువాత రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ఉద్ధేశంతో ఆ తర్వాత వచ్చిన రోశయ్య ప్రభుత్వం రూ.50 నుంచి రూ.25 కోతపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం భరించే రాయితీని రూ.25కే పరిమితం చేసింది. గ్యాస్ సిలిండర్లకు నగదు బదిలీ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం పథకం కాబట్టి కేంద్రం ఎంత సబ్సిడీ భరిస్తుందో ఆ మొత్తాన్ని మాత్రమే బ్యాంకులో జమచేస్తుం ది. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం భరి స్తున్న రాయితీ గానీ, వ్యాట్‌గానీ అటు కేం ద్రం చెల్లించదు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్దుబాటు చేసే పరిస్థితి లేదు.
ప్రభుత్వానికి మిగులు బాటు!
సబ్సిడీ లేకుండా బహిరంగ మార్కెట్‌లో ఒక్కో సిలిండరు ధర రూ.1020. ప్రస్తుతం ఆ సిలిండర్ మన జిల్లాలో కాస్త అటూ ఇటుగా రూ.410కి లభిస్తుంది. ఇందులో కేంద్రం ఇచ్చే రాయితీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ, ఐదుశాతం వ్యాట్ మొత్తం కలిపి దాదాపు రూ.610 వరకు మనకు రా యితీగా వస్తుంది. నగదు బదిలీ పథకం ప్రారంభమైతే ఇందులోంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ వ్యాట్‌లు తీసేసి కేం ద్రం ఎంత మొత్తం రాయితీ ఇస్తుందో అం తమొత్తం మాత్రమే వినియోగదారుడి బ్యాంకుఖాతాలో జమచేస్తుంది.
దీని ఫలి తం ఏమిటంటే ప్రస్తుతం ఇప్పుడు రూ.410 పెట్టి కొంటున్న సిలిండర్‌కు ఇక నుంచి గరిష్టంగా రూ.70 వరకు వినియోగదారు డు అదనంగా చెల్లించాలి. జిల్లాలో వం టగ్యాస్ వినియోగదారులు దాదాపు 4.80 లక్షల మంది ఉన్నారు. దాని ప్రకారం లెక్కేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.3.36కోట్లు మిగులుబాటు అవుతుంది. ఈ మొత్తం జిల్లాలోని వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. రాష్ట్రం ఇచ్చే రాయితీ ఇకపై ఉండదని, అదనంగా ఐదు శాతం వ్యాట్‌ను కూడా వినియోగదారుల్సి ఉంటుందని ఎల్‌పీజీ డీలర్ల సం ఘం ప్రతినిధులు చెబుతున్నారు.
సబ్సిడీకి మంగళం
Published Mon, Sep 23 2013 2:31 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement