మాట్లాడుతున్న ఎస్పీ విక్రాంత్‌పాటిల్
చిత్తూరు అర్బన్ : ఎన్నికల తరుణంలో అక్రమ నగదు లావాదేవీలను అరికట్టేందుకు బ్యాంకర్లు సహకరించాలని చిత్తూరు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. పెద్ద మొత్తంలో నగదు నిల్వలు, బదిలీ లు జరుగుతున్న వాటిపై నిఘా ఉంచాలన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని పోలీసు అతి థి గృహంలో బ్యాంకు అధికారులు, వాణిజ్య ప న్నులశాఖ అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి రోజుకు రూ.20 వేలకు మించి నగదు బదిలీ చేయడానికి వీల్లేదని,అభ్యర్థిఖాతాలో రూ.10 వేలకు మించి డిపాజిట్లు ఉండకూడదన్నారు. కొ న్నిసార్లు ఓటర్లను మభ్య పెట్టడానికి ఒక్కసారిగా 40 నుంచి 50 మంది ఖాతాల్లో ఏకకా లంలో పెద్ద ఎత్తున డబ్బులు జమ అవుతుంటా యని, అలాం టి సమాచారాన్ని అం దజేయాలన్నారు. ఇక నిఫ్ట్, ఆర్‌టీజీఎస్ ఇతర ఆన్‌లైన్ లావాదేవీలపై కూడా ఆంక్షలు ఉన్నాయన్నారు. ఎక్సైజ్ అధి కారులు సైతం అక్రమ మద్యాన్ని అరికట్టడానికి పోలీసుశాఖతో కలిసి పనిచేయాలన్నారు. లీడ్ బ్యాంకు మేనేజరు గణపతి, డీఎస్పీలు సుబ్బారావు, సీఐలు సాయినాథ్, మహేశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment