Vikranth
-
మరో ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విక్రాంత్, మెహరీన్, రుక్సార్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం స్పార్క్. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి విక్రాంత్ దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేసింది. దాదాపు విడుదలైన పది నెలల తర్వాత సన్ నెక్ట్స్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతమందించారు.స్కార్క్ కథేంటంటే?లేఖ(మెహరీన్) కలలోకి ప్రతి రోజు ఓ వ్యక్తి వస్తుంటాడు. దీంతో ఆమె అతన్నే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. స్నేహితులతో కలిసి అతని కోసం వెతుకుతుంటుంది. ఓ ఆస్పత్రిలో అనుకోకుండా అతన్ని చూస్తుంది. అతనే ఆర్య(విక్రాంత్ రెడ్డి). లేఖ ఎదురింట్లోనే ఉంటాడు. అతన్ని ప్రేమలో పడేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆర్య మాత్రం లేఖ ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే.. నగరంలో వరుసగా అమ్మాయిలు చనిపోతుంటారు. సడెన్‌గా సైకోలుగా మారి తమ కుటుంబ సభ్యులను చంపి, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఈ హత్యలకు కారణం ఆర్యనే అని లేఖ తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్) ఆరోపిస్తాడు.పోలీసులు కూడా అతని కోసం గాలిస్తుంటారు. అసలు సిటీలో జరుగుతున్న హత్యలకు కారణం ఎవరు? అమ్మాయిలు సడెన్‌గా సైకోలుగా ఎందుకు మారుతున్నారు? ఆర్యకు ఈ మర్డర్లతో ఉన్న సంబంధం ఏంటి? వైజాగ్‌కు చెందిన జై.. ఆర్యగా పేరు మార్చుకొని హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లాడు? యువతుల మరణాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? జై ప్రియురాలు అనన్య(రుక్సార్ థిల్లాన్) ఎలా చనిపోయింది? ఈ మర్డర్లతో ఇండియన్ ఆర్మీలో పనిచేసే డాక్టర్ రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. View this post on Instagram A post shared by SUN NXT (@sunnxt) -
Ambitio: ధైర్యం ఇస్తూ... దారి చూపుతూ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో విదేశీ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్‌ను సులభతరం చేసి ‘అంబిటియో’ పేరుతో ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేశారు ఐఐటీ గ్రాడ్యుయేట్స్ దీర్ఘాయు కౌశిక్, విక్రాంత్ శివాలిక్, వైభవ్ త్యాగీ. మన దేశంలోని తొలి ఏఐ అడ్మిషన్ ప్లాట్‌ఫామ్ ‘అంబిటియో’ విజయపథంలో దూసుకు΄ోతోంది.... ఐఐటీ–బీహెచ్‌యూ(వారణాసి)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కౌశిక్ ఫారిన్ యూనివర్శిటీలో ఎంబీఏ చేయడం కోసం అప్లై చేయాలనుకున్నప్పుడు స్టూడెంట్స్‌కు సహాయపడే ప్లాట్ఫామ్లాంటిదేమీ తనకు కనిపించలేదు. ‘విదేశీ యూనివర్శిటీలలో చేరే విషయంలో సహాయం అందించడానికి కౌన్సెలర్లు ఉన్నప్పటికీ ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఆ ఆర్థికభారం అందరికీ సాధ్యం కాదు. మరో విషయం ఏమిటంటే వారు ఒకటి రెండు కాలేజిల గురించి మాత్రమే చెబుతారు’ అంటాడు కౌశిక్. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్‌కు సంబంధించి కాలేజి అప్లికేషన్స్, సరిౖయెన కాలేజీ ఎంపిక చేసుకోవడం, పర్సనల్ ఎస్సేస్...మొదలైన వాటి గురించి ఒక ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేయాలనుకున్నాడు. కాలేజీ ఫ్రెండ్స్ విక్రాంత్, వైభవ్ త్యాగీలకు తన ఆలోచన చెప్పాడు. వారికి ఐడియా నచ్చి కౌశిక్‌తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారు. అలా ‘అంబిటియో’ అంకురం మొలకెత్తింది. ‘అంబిటియో’ ప్లాట్‌ఫామ్ ద్వారా మొదట పాతిక మంది స్టూడెంట్స్‌కు టాప్ ఇనిస్టిట్యూట్స్‌లో అడ్మిషన్ దొరికేలా సహాయం చేశారు. స్టూడెంట్స్ ్ర΄÷ఫైల్స్‌పై ప్రధానంగా దృషి పెట్టి వాటికి మార్పులు, చేర్పులు చేశారు. కార్నెగి మెలన్ యూనివర్శిటీ, ఎన్‌వైయూ, ఇంపీరియల్ కాలేజ్, యూసీ బర్కిలి...మొదలైన ఇంటర్నేషనల్ యూనివర్శిటీలకు సంబంధించి 175 మంది స్టూడెంట్స్‌కు సహాయపడ్డారు. ‘అంబిటియో గురించి తెలియడానికి ముందు ఒక కౌన్సెలర్ సలహాలు తీసుకున్నానుగానీ అవి నాకు ఉపయోగపడలేదు. అంబిటియో ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సరిౖయెన దారి కనిపించింది’ అంటున్న ప్రహార్ కమల్‌కు లండన్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్లో ప్రవేశం దొరికింది. ‘అంబిటియో’ ప్లాట్ఫామ్లో ఏఐ ఎలా ఉపకరిçస్తుంది అనేదాని గురించి కో–ఫౌండర్, సీయీవో కౌశిక్ మాటల్లో... ‘రెండు ప్రైమరీ ఏరియాలలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోస్ట్ సూటబుల్ ప్రోగ్రామ్ లేదా యూనివర్శిటీని ఎంపిక చేసుకోవడంలో స్టూడెంట్స్‌కు సహాయపడడం అందులో ఒకటి. తమకు అర్హత ఉన్న కోర్సులను ఫిల్టర్ చేసి చూడడానికి ప్రస్తుతం ఫిల్టరేషన్ టూల్స్ ఉన్నప్పటికీ మేము ఏఐ ద్వారా మరో అడుగు ముందుకు వేశాం’ విస్తృతస్థాయిలో సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ పర్సనలైజ్డ్ రికమండేషన్లను వేగంగా అందిస్తూ స్టూడెంట్స్ టైమ్‌ను సేవ్ చేస్తుంది. ‘స్టూడెంట్స్ తమకు అవసరమైన కాలేజీని ఎంపిక చేసుకున్న తరువాత, తదుపరి దశ అద్భుతమైన వ్యాసం రాయడం. వివిధ యూనివర్శిటీలకు సంబంధించి 5,000 వ్యాసాలతో మా మోడల్‌కు శిక్షణ ఇచ్చాం. సరిౖయెన కాలేజిని ఎంపిక చేసుకోవడం నుంచి స్కాలర్షిప్కు అప్లై చేసుకోవడం వరకు మా ప్లాట్‌ఫ్లామ్‌లో అన్నీ ఉచితమే’ అంటున్నాడు కౌశిక్. ఏంజెల్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ 1.5 కోట్ల నిధులను సమీకరించింది. ‘భారత్ మార్కెట్లో వేగంగా దూసుకు΄ోయి మరింతగా విస్తరించాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు కౌశిక్. యూనివర్శిటీలలో అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థులకు ఇంటెలిజెంట్ డిజిటల్ అడ్వైజర్లుగా సేవలు అందించడమే మా లక్ష్యం. – దీర్ఘాయు కౌశిక్, అంబిటియో–సీయీవో, కోఫౌండర్ -
కలెక్షన్సే లేని సినిమాకు సక్సెస్ పార్టీ.. ఇది మరీ విడ్డూరం!
సూపర్‌స్టార్ రజనీకాంత్ అతిథిగా పవర్ ఫుల్ పాత్రను పోషించిన చిత్రం లాల్ సలామ్. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. నటి నిరోషా, జీవిత రాజశేఖర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించగా, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన లాల్ సలామ్ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ నెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం అంతంతమాత్రంగానే వసూళ్లు రాబడుతోంది. థియేటర్లలో రిలీజైన ఈ మూవీ వరుసగా మూడవ వారంలోకి అడుగు పెట్టడంతో చిత్ర యూనిట్ శుక్రవారం చైన్నెలో సక్సెస్ పార్టీని జరుపుకుంది. ఈ పార్టీలో రజనీకాంత్‌తో పాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొనడం విశేషం. హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ఇందులో పాల్గొనలేదు. కాగా లాల్ సలామ్ చిత్రం సక్సెస్ పార్టీ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కలెక్షన్సే లేని సినిమాకు సక్సెస్ పార్టీయా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. மக்களின் பேரன்பிற்கும், பேராதரவிற்கும் நன்றி!!! 🙏🏻😇 Successful 2 weeks of LAL SALAAM, into the 3rd week today! 📽️✨#LalSalaam 🫡 Running Successfully 💥📽️@rajinikanth @ash_rajinikanth @arrahman @TheVishnuVishal @vikranth_offl @Ananthika108 @LycaProductions #Subaskaran… pic.twitter.com/fcCdDYDmMu — Lyca Productions (@LycaProductions) February 23, 2024 చదవండి: నాన్న వల్లే నా జీవితం నాశనం అయింది: వనితా విజయ్ కుమార్ -
‘స్పార్క్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సినిమా కోసం జాబ్ వదిలేసి వచ్చేసా: హీరో విక్రాంత్
-
నీ ముఖానికి నువ్వు హీరో ఏంటి..?
-
తండ్రి కాబోతున్న మీర్జాపూర్ నటుడు..!
మిర్జాపూర్ వెబ్ సిరీస్ నటుడు విక్రాంత్ మాస్సే తండ్రి కాబోతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో శీతల్ ఠాకూర్‌ను పెళ్లి చేసుకున్న విక్రాంత్ తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట.. ఆ తర్వాత 2019 నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ప్రెగ్నెన్సీ వార్తలపై విక్రాంత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. గ్యాస్‌లైట్, ఫోరెన్సిక్, గిన్ని వెడ్స్ సన్నీ, ముంబైకర్, లవ్ హాస్టల్ లాంటి చిత్రాల్లో నటించారు. ఆయన భార్య సీతల్ ఠాకూర్ పంజాబీ సినిమాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2018లో వచ్చిన బ్రిజ్ మోహన్ అమర్ రహే అనే చిత్రం ద్వారా హిందీలోనూ ఎంట్రీ ఇచ్చింది. (ఇది చదవండి: ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసులో నటుడు నవదీప్ పేరు) విక్రాంత్ మాస్సే సినిమాలు విక్రాంత్ ఇటీవలే 'మేడ్ ఇన్ హెవెన్', 'గ్యాస్‌లైట్' 'ముంబైకర్'లో కనిపించాడు. ఈ ఏడాదిలో 'యార్ జిగ్రీ', 'సెక్టర్ 36', '12 ఫెయిల్' , 'ఆయీ హసీన్ దిల్రుబా' చిత్రాలలో కనిపించనున్నారు. మరోవైపు శీతల్ ఠాకూర్ 'బ్రిజ్ మోహన్ అమర్ రహే', 'ఛప్పర్ ఫాద్ కే' వంటి అనేక సినిమాలు, వెబ్ షోలలో పని చేశారు. 2018లో విడుదలైన 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' వెబ్ సిరీస్‌లో విక్రాంత్‌తో కలిసి నటించారు. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ అనే వెబ్ సిరీస్ సెట్స్‌లో ప్రేమలో పడ్డారు. కాగా.. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో బబ్లూ పండిట్ అనే పాత్రలో నటించారు. View this post on Instagram A post shared by Vikrant Massey (@vikrantmassey) -
ప్రత్యేక పాత్రలో రజినీకాంత్.. ప్రారంభమైన షూటింగ్
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం 'లాల్ సలాం'. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హోలీ రోజున ప్రారంభమైంది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ తన ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ.. 'విభిన్నమైన సినిమాలు నిర్మించడంలో లైకా ప్రొడక్షన్స్ ముందుంటుంది. అందులో భాగంగా లాల్ సలాం సినిమాను నిర్మిస్తున్నాం. ఇందులో ఓ పవర్ఫుల్ పాత్ర ఉంది. అందుకే సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారిని రిక్వెస్ట్ చేశాం. ఆయన ఈ రోల్లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ మళ్లీ మెగా ఫోన్ పట్టారు.'అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. Lights 💡 Camera 🎥 🎬 Action 😎✨#LalSalaam 🫡 Shoot starts today! 😌 Happy #HOLI everyone! 💫 🎬 @ash_rajinikanth 🎶 @arrahman 🌟 @rajinikanth @TheVishnuVishal & @vikranth_offl 🤝 @gkmtamilkumaran 🪙 @LycaProductions #Subaskaran pic.twitter.com/SHYXxnGYod — Lyca Productions (@LycaProductions) March 7, 2023 -
ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్ నటుడు, ఫొటోలు వైరల్
బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే ఓ ఇంటివాడయ్యాడు. ఫిబ్రవరి 18న ప్రేయసి, నటి శీతల్ ఠాకూర్‌ను పెళ్లాడాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కొత్త జంటకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో విక్రాంత్, శీతల్ ఒకరినొకరు కలుసుకున్నారు. అలా ఏర్పడ్డ పరిచయం ప్రేమకు దారి తీయగా కొంతకాలంగా ఇద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 2019 డిసెంబర్లో వీరికి నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ముందే వీరిద్దరూ విలాసవంతమైన ఇంటిని సైతం కొనుగోలు చేశారు. ఇదిలా ఉంటే విక్రాంత్ 'లవ్ హాస్టల్' సినిమాలో కనిపించనున్నాడు. అలాగే 'ముంబైకర్' సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Telly.bolly (@telly.bollyspynews) View this post on Instagram A post shared by Chipku Media (@chipkumedia) -
విజయవంతంగా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్ సీ ట్రయల్స్
సాక్షి, విశాఖపట్నం : ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్ సీ ట్రయల్స్ ముగిశాయి. ఎయిర్‌క్రాఫ్ట్ విజయవంతంగా సీ ట్రయల్స్ నిర్వహించి తిరుగు పయణమైంది. కొచ్చి హిందూ మహాసముద్రంలో 4 రోజుల పాటు సీ ట్రయల్స్ జరగనున్నాయి. ఇండియన్ నేవీ గతంలో బేసిక్ ట్రయల్స్ నిర్వహించింది. కాగా, ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ విక్రాంత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. స్వదేశీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నిర్మాణం చేపట్టే దేశాల సరసన భారత్ చేరింది. 2022 నాటికి విమాన వాహన నౌక అందుబాటులోకి రానుంది. రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు కానున్నాయి. -
కరోనాను జయించిన ఐపీఎస్ దంపతులు
సాక్షి, విజయవాడ: ఇటీవల కరోనా బారిన పడిన ఐపీఎస్ దంపతులు కరోనాను జయించి తిరిగి శుక్రవారం విధుల్లో చేరారు. దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, డీసీపీ విక్రాంత్ పాటిల్ దంపతులు ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరిన ఐపీఎస్ దంపతులకు డీజీపీ గౌతం సవాంగ్ ఘనస్వాగతం పలికారు. (చదవండి: ఆ తర్వాతే ఏపీలోకి అనుమతి..) ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లడుతూ.. కోవిడ్‌ను జయించిన పోలీసు అధికారులు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని పిలుపునిచ్చారు. కరోనా బాధితుల్లో మనోస్థైర్యాన్ని నింపాలని, విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఏ మాత్రం అనుమానం ఉన్న వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కోవిడ్ బారినపడిన పోలీసులు కోలుకొని విధుల్లో రావడం ఆనందంగా ఉందని డీజీపీ వ్యాఖ్యానించారు. పాటిల్ దంపతులు మాట్లాడుతూ.. డీజీపీ ఇచ్చిన నైతిక బలంతోనే త్వరగా కోలుకున్నామని తెలిపారు. -
షకీలా కుటుంబ కథా చిత్రం
షకీలా ప్రధాన పాత్రలో విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా నటించిన చిత్రం ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం’. 24 క్రాఫ్ట్స్ బ్యానర్‌పై సీవీ రెడ్డి సమర్పణలో సీహెచ్ వెంకట్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిం చారు. సాయి రాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్ వి.ఎన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ సందర్భంగా షకీలా మాట్లాడుతూ– ‘‘నేను నిర్మించిన ‘లేడీస్ నాట్ ఎలౌడ్’ సినిమా పది నెలలుగా సెన్సార్ అవ్వటం లేదు. ప్రస్తుతం ట్రిబ్యునల్‌లో ఉంది. షకీలా అంటే వల్గారిటీ సినిమాలేనా, ఫ్యామిలీ సినిమాలు చేయదా? అనే విమర్శలున్నాయి. అన్ని రకాల కథలను చేస్తానని నిరూపించటం కోసం కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా చేస్తున్నాను. ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సతీష్ వి.ఎన్, హీరో విక్రాంత్, సినిమాటోగ్రాఫర్ కరామ్‌తోత్ పాల్గొన్నారు. -
బ్యాంకు ఖాతాలపై నిఘా
చిత్తూరు అర్బన్ : ఎన్నికల తరుణంలో అక్రమ నగదు లావాదేవీలను అరికట్టేందుకు బ్యాంకర్లు సహకరించాలని చిత్తూరు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. పెద్ద మొత్తంలో నగదు నిల్వలు, బదిలీ లు జరుగుతున్న వాటిపై నిఘా ఉంచాలన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని పోలీసు అతి థి గృహంలో బ్యాంకు అధికారులు, వాణిజ్య ప న్నులశాఖ అధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి రోజుకు రూ.20 వేలకు మించి నగదు బదిలీ చేయడానికి వీల్లేదని,అభ్యర్థిఖాతాలో రూ.10 వేలకు మించి డిపాజిట్లు ఉండకూడదన్నారు. కొ న్నిసార్లు ఓటర్లను మభ్య పెట్టడానికి ఒక్కసారిగా 40 నుంచి 50 మంది ఖాతాల్లో ఏకకా లంలో పెద్ద ఎత్తున డబ్బులు జమ అవుతుంటా యని, అలాం టి సమాచారాన్ని అం దజేయాలన్నారు. ఇక నిఫ్ట్, ఆర్టీజీఎస్ ఇతర ఆన్లైన్ లావాదేవీలపై కూడా ఆంక్షలు ఉన్నాయన్నారు. ఎక్సైజ్ అధి కారులు సైతం అక్రమ మద్యాన్ని అరికట్టడానికి పోలీసుశాఖతో కలిసి పనిచేయాలన్నారు. లీడ్ బ్యాంకు మేనేజరు గణపతి, డీఎస్పీలు సుబ్బారావు, సీఐలు సాయినాథ్, మహేశ్వర్ పాల్గొన్నారు. -
సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయొద్దు
చిత్తూరు అర్బన్: సోషల్ మీడియా (సామాజిక మాధ్యమాలు)ను దుర్వినియోగం చేయరాదని చిత్తూరు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. బుధవారం స్థానిక ఏఆర్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇటీవల చిత్తూరు పరిధిలోని ఓ కోళ్ల దుకాణంలో జరిగిన వివాదం, ఓ బాలుడ్ని కొట్టిన వీడియో, మరో కానిస్టేబుల్‌ను కొట్టిన ఘటనల్లో పోలీసులు పట్టించుకోలేదంటూ వాట్సప్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయని పేర్కొన్నారు. ట్రోల్ అవుతున్న వీడియోలు వాస్తవమా.. కాదా? అని చూడకుండా చాలా మంది వీటిని మిగిలిన వారికి షేర్ చేస్తున్నారని తెలిపారు. వాస్తవాలైతే షేర్ చేయడంలో తప్పులేదని, పోలీసులు స్పందించలేదని చర్చలు లేపుతూ అవాస్తవాలు ప్రచారం చేయకూడదని హితవు పలికారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలను అనుసంధానం చేస్తూ తప్పుడు వీడియోలను, తప్పుడు సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం ఐటీ యాక్టు ప్రకారం నేరమన్నారు. దీనిపై కేసులు కూడా తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వచ్చే సందేశాలు, ఫిర్యాదుల్లో వాస్తవాలేమిటో నిర్ధారించడానికి పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక విభాగాన్ని సైతం ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరించి అసత్యాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయరాదని, నమ్మరాదని కోరారు. సమావేశంలో ఏఎస్పీ రాధి, డీసీఆర్బీ సీఐ మహేశ్వర్ పాల్గొన్నారు. -
సామాన్యులకు న్యాయమే నా లక్ష్యం
విక్రాంత్ పాటిల్.. పక్షం రోజుల ముందు చిత్తూరుకు కొత్త ఎస్పీగా నియమితులైనట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. డైరెక్ట్ ఐపీఎస్ అధికారి కావడంతో ప్రజల్లో ఆయనపై అంచనాలు పెరిగాయి. రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారని.. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతారని.. పోలీసుశాఖలోని అవినీతిని ప్రక్షాళన చేస్తారని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం విక్రాంత్ పాటిల్ చిత్తూరులో బాధ్యతలు స్వీకరించారు. తన ముందున్న బాధ్యత, తన పరిపాలన శైలి గురించి ఆయన వివరించారు. చిత్తూరు అర్బన్: మాది కర్ణాటక రాష్ట్రంలోని దువ్వాడ ప్రాంతం. 2012 సివిల్స్ రాసి ఐపీఎస్ ఆఫీసర్‌గా సెలక్ట్ అయ్యా. నా తొలి పోస్టింగ్ ఏఎస్పీగా తమిళనాడులోని కన్యాకుమారి. అక్కడ రెండేళ్లు పనిచేశాను. అక్కడి నుంచి కంచి ఏఎస్పీగా కొన్నాళ్లు పనిచేసి ఆంధ్రాకు బదిలీ అయ్యాను. విజయనగరం ఏఎస్పీ, విజయనగరం ఓఎస్డీగా పనిచేస్తూ చిత్తూరుకు వచ్చాను. ఎస్పీగా ఇదే నా తొలి పోస్టింగ్. సీఎం నాపై నమ్మకంతో బాధ్యతను అప్పగించారు. ఆ నమ్మకాన్ని కాపాడుకుంటా. అల్టిమేట్‌గా సామాన్యులకు న్యాయం జరగాలన్నదే నా మోటివ్. అనుభవం ఉంది కర్ణాటకలో పుట్టి పెరిగాను. తమిళనాడులో పనిచేశాను. ఓ కేసు విషయమై 2014లో చిత్తూరు వచ్చాను. సీఎం సొంత జిల్లా కావడంతో నాపై బాధ్యత ఎక్కువ ఉంటుంది. చిత్తూరు రెండు రాష్ట్రాలకు బోర్డర్. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలు, నేరస్తుల ఆలోచనా విధానాలపై నాకు అవగాహన ఉంది. అనుభవం కూడా ఉంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు మరో 6–8 నెలల్లో ఎన్నికలు రానున్నాయి. మాపై బాధ్యత పెరుగుతుంది. పోలీసు పాత్ర చాలా కీలకం. మా వరకు ఎలాంటి విమర్శలు రాకుండా పనిచేస్తాం. ఏ రాజకీయ పార్టీతో పనుండదు. నిజాయితీగా ఎన్నికలు జరగడానికి బాధ్యతగా పనిచేస్తాం. నా ముందున్నది. చిత్తూరులోని కమ్యూనిటీ పోలీస్ వ్యవస్థ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. దీన్ని మరింత పటిష్టం చేస్తా. ఎర్రచంద నం స్మగ్లింగ్, మహిళలపై దాడులను అరికట్టడానికి మిషన్ ప్రారంభమవుతుంది. జిల్లాలో పుణ్యక్షేత్రాలు ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని తగ్గించాల్సి ఉంది. సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తా. ఫ్రెండ్లీ పోలీస్ ప్రజలు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు. పోలీసులు.. ప్రజల మధ్య ఓ స్నేహ పూర్వక వాతావరణం ఉండాలి. అదే సమయంలో తప్పు చేసిన వారిపై చట్టపరంగా ముందుకెళతాం. అన్యాయం చేసిన వారిని, అక్రమాలకు పాల్పడేవారిని ఉపేక్షించే ప్రసక్తేలేదు. పోలీసు సంక్షేమానికి చేయూత ఇస్తా. హోంగార్డు నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు వారి సాధకబాధకాలు వినడానికి సమయం కేటాయిస్తా. -
‘ముద్దుగా’ ఉందంటారు!
‘‘తెలుగుదనం ఇష్టపడేవారికి, విలువలు ఉండాలని ఆశించేవారికి కచ్చితంగా నచ్చే సినిమా ఇది. ఓ క్లీన్ ఎంటర్టైనర్ ఇవ్వాలనే ఆశయంతో చేశాం. ఇటీవల మా సన్నిహితులకు రషెస్ చూపిస్తే చాలా ఎగ్జయిట్ అయ్యారు. సీవీ రెడ్డిగారు అందించిన సహకారంతో మేం అనుకున్న విధంగా సినిమా తీయగలిగాం. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఓ సున్నితమైన కోణాన్ని టచ్ చేస్తూ ప్రేమ, రొమాన్స్‌ను సరికొత్త రీతిలో ఆవిష్కరించిన ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు వి. సతీష్‌కుమార్. 24 క్రాఫ్ట్స్ పతాకంపై విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా సతీష్‌కుమార్ దర్శకత్వంలో సీవీ రెడ్డి నిర్మించిన చిత్రం ‘ముద్దుగా’. ఈ నెల 14న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా విక్రాంత్ మాట్లాడుతూ -‘‘ప్రేమ, వినోదం, సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాలు సమపాళ్లల్లో ఉన్న సినిమా. ప్రేక్షకులు సినిమా ‘ముద్దుగా’ ఉందని అంటారు’’ అన్నారు. లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని సహనిర్మాతలు చంటి రామకృష్ణారెడ్డి, జానకీ రామ్. ఆర్ తెలిపారు. -
ముద్దుగా మూవీ వాల్‌పోస్టర్స్
-
సీవీ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ముద్దుగా
విక్రాంత్, పల్లవి జంటగా 24 క్రాఫ్ట్స్ పతాకంపై సీవీ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ముద్దుగా’. సతీష్‌కుమార్ దర్శకుడు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు లోగోని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఓ క్యూట్ లవ్‌స్టోరీతో ఈ చిత్రం రూపొందించాం. ఇప్పుడొస్తున్న ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. ఎంపీ రామన్ ఇచ్చిన అయిదు పాటలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నూతన నటీనటులు, టెక్నీషియన్లతో రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో లైన్ ప్రొడ్యూసర్ బాచి పవార్, సహనిర్మాత కృష్ణారెడ్డి, కృష్ణ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.