సీవీ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ముద్దుగా | C.V. Reddy producing new movie "Mudduga" | Sakshi
Sakshi News home page

సీవీ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ముద్దుగా

Published Tue, Oct 1 2013 1:10 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

సీవీ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ముద్దుగా - Sakshi

సీవీ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ముద్దుగా

విక్రాంత్, పల్లవి జంటగా 24 క్రాఫ్ట్స్ పతాకంపై సీవీ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ముద్దుగా’. సతీష్‌కుమార్ దర్శకుడు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు లోగోని ఆవిష్కరించారు. 
 
 ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఓ క్యూట్ లవ్‌స్టోరీతో ఈ చిత్రం రూపొందించాం. ఇప్పుడొస్తున్న ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. ఎంపీ రామన్ ఇచ్చిన అయిదు పాటలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 
 
 నూతన నటీనటులు, టెక్నీషియన్లతో రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో లైన్ ప్రొడ్యూసర్ బాచి పవార్, సహనిర్మాత కృష్ణారెడ్డి, కృష్ణ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement