షకీలా
షకీలా ప్రధాన పాత్రలో విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా నటించిన చిత్రం ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం’. 24 క్రాఫ్ట్స్ బ్యానర్‌పై సీవీ రెడ్డి సమర్పణలో సీహెచ్ వెంకట్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిం చారు. సాయి రాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్ వి.ఎన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ సందర్భంగా షకీలా మాట్లాడుతూ– ‘‘నేను నిర్మించిన ‘లేడీస్ నాట్ ఎలౌడ్’ సినిమా పది నెలలుగా సెన్సార్ అవ్వటం లేదు. ప్రస్తుతం ట్రిబ్యునల్‌లో ఉంది. షకీలా అంటే వల్గారిటీ సినిమాలేనా, ఫ్యామిలీ సినిమాలు చేయదా? అనే విమర్శలున్నాయి. అన్ని రకాల కథలను చేస్తానని నిరూపించటం కోసం కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా చేస్తున్నాను. ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సతీష్ వి.ఎన్, హీరో విక్రాంత్, సినిమాటోగ్రాఫర్ కరామ్‌తోత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment