సాక్షి, విజయవాడ: ఇటీవల కరోనా బారిన పడిన ఐపీఎస్ దంపతులు కరోనాను జయించి తిరిగి శుక్రవారం విధుల్లో చేరారు. దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, డీసీపీ విక్రాంత్ పాటిల్ దంపతులు ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరిన ఐపీఎస్ దంపతులకు డీజీపీ గౌతం సవాంగ్ ఘనస్వాగతం పలికారు. (చదవండి: ఆ తర్వాతే ఏపీలోకి అనుమతి..)
ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లడుతూ.. కోవిడ్‌ను జయించిన పోలీసు అధికారులు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని పిలుపునిచ్చారు. కరోనా బాధితుల్లో మనోస్థైర్యాన్ని నింపాలని, విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఏ మాత్రం అనుమానం ఉన్న వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కోవిడ్ బారినపడిన పోలీసులు కోలుకొని విధుల్లో రావడం ఆనందంగా ఉందని డీజీపీ వ్యాఖ్యానించారు. పాటిల్ దంపతులు మాట్లాడుతూ.. డీజీపీ ఇచ్చిన నైతిక బలంతోనే త్వరగా కోలుకున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment