‘ముద్దుగా’ ఉందంటారు!
‘ముద్దుగా’ ఉందంటారు!
Published Sat, Mar 8 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
‘‘తెలుగుదనం ఇష్టపడేవారికి, విలువలు ఉండాలని ఆశించేవారికి కచ్చితంగా నచ్చే సినిమా ఇది. ఓ క్లీన్ ఎంటర్‌టైనర్ ఇవ్వాలనే ఆశయంతో చేశాం. ఇటీవల మా సన్నిహితులకు రషెస్ చూపిస్తే చాలా ఎగ్జయిట్ అయ్యారు. సీవీ రెడ్డిగారు అందించిన సహకారంతో మేం అనుకున్న విధంగా సినిమా తీయగలిగాం. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఓ సున్నితమైన కోణాన్ని టచ్ చేస్తూ ప్రేమ, రొమాన్స్‌ను సరికొత్త రీతిలో ఆవిష్కరించిన ఫ్యామిలీ, లవ్ ఎంటర్‌టైనర్ ఇది’’ అన్నారు వి. సతీష్‌కుమార్. 24 క్రాఫ్ట్స్ పతాకంపై విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా సతీష్‌కుమార్ దర్శకత్వంలో సీవీ రెడ్డి నిర్మించిన చిత్రం ‘ముద్దుగా’. ఈ నెల 14న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా విక్రాంత్ మాట్లాడుతూ -‘‘ప్రేమ, వినోదం, సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాలు సమపాళ్లల్లో ఉన్న సినిమా. ప్రేక్షకులు సినిమా ‘ముద్దుగా’ ఉందని అంటారు’’ అన్నారు. లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని సహనిర్మాతలు చంటి రామకృష్ణారెడ్డి, జానకీ రామ్. ఆర్ తెలిపారు.
Advertisement
Advertisement