
బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే ఓ ఇంటివాడయ్యాడు. ఫిబ్రవరి 18న ప్రేయసి, నటి శీతల్ ఠాకూర్‌ను పెళ్లాడాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కొత్త జంటకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో విక్రాంత్, శీతల్ ఒకరినొకరు కలుసుకున్నారు. అలా ఏర్పడ్డ పరిచయం ప్రేమకు దారి తీయగా కొంతకాలంగా ఇద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 2019 డిసెంబర్‌లో వీరికి నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ముందే వీరిద్దరూ విలాసవంతమైన ఇంటిని సైతం కొనుగోలు చేశారు. ఇదిలా ఉంటే విక్రాంత్ 'లవ్ హాస్టల్' సినిమాలో కనిపించనున్నాడు. అలాగే 'ముంబైకర్' సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment