అనంతపురం రూరల్ : గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే బాయ్స్‌కు అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని డీఎస్‌ఓ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అదనంగా చెల్లించవద్దని సూచించారు. డీలర్ పరిధిలో 5 కిలోమీటర్ల లోపు ఉంటే ఉచితం అన్నారు. 5–30 కి.మీలోపు ఉంటే సిలిండర్‌కు రూ.10, 30కి.మీ దాటితే రూ.15 చెల్లించాలన్నారు. అదనంగా అడిగితే 80083 01418 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.