Charu Asopa On Divorce From Rajeev Sen: I Am A Little Anxious, Know I Am Doing The Right Thing - Sakshi
Sakshi News home page

తన విడాకుల గురించి యూట్యూబ్‌లో వ్లాగ్‌ చేసిన నటి

Published Tue, Jun 13 2023 2:46 PM | Last Updated on Tue, Jun 13 2023 3:24 PM

Charu Asopa On Divorce From Rajeev Sen I Am Doing Right - Sakshi

బాలీవుడ్‌లో బుల్లితెర నటి, యూట్యూబ్‌ వ్లాగర్‌గా చారు అసోపా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సుష్మితా సేన్ బ్రదర్‌ అయిన రాజీవ్ సేన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. జూన్ 9, 2019న గోవాలో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2021లో వారికి పాప జన్మించడంతో జియానా అని పేరుపెట్టుకున్నారు.

వారి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో జూన్‌ 8న విడాకులు తీసుకున్నారు. తాజాగా తన మాజీ భర్త రాజీవ్ సేన్ గురించి తను మొదటి వీడియో షేర్‌ చేసింది. ఆమె యూట్యూబ్‌లోని తన వ్లాగ్‌లో విడాకుల కోసం కోర్టుకు వెళ్లే ముందు తన ఆలోచనలు ఎలా ఉన్నాయో పంచుకుంది.

(ఇదీ చదవండి: వైరల్‌ అవుతున్న రకుల్‌ డ్రెస్‌.. అతను పట్టుకోవడంతో..!)

ఆ వీడియోలో విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్న ప్పుడు తీసిన సన్నివేశాలను ఇలా పంచుకుంది. 'నేను కొంచెం ఆందోళనగా ఉన్నాను, నేను సరైన పని చేస్తున్నానని నాకు తెలుసు, కానీ ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ అదే ఆందోళనను అనుభవిస్తారని  భావిస్తున్నాను. విడాకుల ద్వారా...రాజీవ్ ఎల్లప్పుడూ జియానా తండ్రిగా ఉంటాడు. అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు జియానాను కలుసుకోవచ్చు'. అని తెలిపింది. ఆమె వ్లాగ్‌పై పలువురు నెటిజన్లు మద్దతుగా నిలిచారు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదర్కొనేందుకు సిద్దంగా ఉండాలని వారు కామెంట్స్‌ చేశారు.

(ఇదీ చదవండి: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement