హిందీ సినీ పరిశ్రమలో నటీనటులంతా చెడిపోయారని ఒకనాటి హీరోయిన్, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ చెప్పింది. కేవలం పశ్చిమబెంగాల్లోనే కాక.. యావద్దేశంలోని మంచి నటులతో కలిసి పనిచేయడం తాను గౌరవంగా భావిస్తానని, కానీ బాలీవుడ్లో మాత్రం తాము చెడిపోయామనే చెప్పక తప్పదని ఆమె తెలిపింది. ''మేం బాగా కనిపిస్తాం, మా పని కూడా అవుతుంది. కొంతమంది నటులు వాళ్ల పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తారు. వంద సినిమాల్లో చేసినా వాళ్లు ఏపాత్రలోనైనా ఒదిగిపోతారు'' అని ఆమె చెప్పింది.
తాజాగా సుస్మితా సేన్ జాతీయ అవార్డు విజేత శ్రీజిత్ ముఖర్జీ తీస్తున్న నిర్బాక్ (మూగ) సినిమాలో చేస్తోంది. ఈ సినిమాను 22 రోజుల్లోనే పూర్తి చేశారు. మే 1న సినిమా విడుదల కానుంది. ట్రైలర్కు ఇప్పటికే లక్షకు పైగా హిట్లు వచ్చాయి. తాను తన సొంత భాషలో ఒక్క సినిమా అయినా చేయాలన్నది తన తండ్రి ఆశ అని, అందుకే ఈ సినిమాలో బెంగాలీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నానని సుస్మిత చెప్పింది.
'బాలీవుడ్లో మేం చెడిపోయాం'
Published Thu, Apr 30 2015 3:44 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement
Advertisement