
బాలీవుడ్ నటి సుష్మితా సేన్ లవ్‌స్టోరీల గురించి చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఉన్నాయి. నచ్చితే ప్రేమించడం.. నచ్చనప్పుడు బ్రేకప్ చెప్పుకోవడం ఆమెకు సర్వసాధారణం.. అయితే పది మందికి పైగా ప్రేమించినప్పటికీ ఎవరితోనూ ఏడడుగులు వేసేంత వరకు వెళ్లలేదు. కానీ పిల్లలంటే ఇష్టం కావడంతో ఇద్దరిని దత్తత తీసుకుని పెంచుకుంటోంది. సుష్మితకు 24 ఏళ్ల వయసున్నప్పుడు అంటే 2010వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. 2010లో అలీషాను దత్తత తీసుకుంది. వీరిద్దరినీ కన్నబిడ్డల్లా కంటికి రెప్పలా చూసుకుంటోంది. తండ్రి లేడు అన్న లోటు వారికి తెలియకుండా పెంచుతోంది.
మాకైతే నాన్న అవసరం లేదు..
తాజాగా ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా పిల్లలు నాన్న లేడు అని ఎన్నడూ ఫీలవలేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నది కోల్పోతేనే మిస్ అవుతాం. లేనిదాని గురించి మిస్ అయిన భావనే రాదు. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కూడా ఇప్పుడెందుకు పెళ్లి? అసలు దేనికోసం? మాకైతే నాన్న అవసరం లేదు అనేస్తారు. నేను భర్తను కోరుకుంటున్నానేమో అని కూడా అనుకోరు.
పిల్లలకు ఆయనే అన్నీ..
పెళ్లి గురించి మేము చాలా జోక్స్ చేసుకుంటాం. వాళ్లకు తండ్రి లేడు అనే లోటు కూడా తెలియదు. ఎందుకంటే వారికి తాత ఉన్నాడు. మా నాన్నే వారి తాతయ్య.. ఆయనే వారికి అన్నీ అయి ఆడిస్తాడు' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే సుష్మితా సేన్ ఇటీవలే తాలి అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. తర్వాత ఆమె ఆర్య 3 వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.
చదవండి: 5 ఏళ్ల కంటే ఎక్కువ బతకనని చెప్పారు.. ఈ బాధ కంటే చనిపోవడమే నయమనిపించింది!
Comments
Please login to add a commentAdd a comment