సుష్మితాసేన్
పోలీస్ సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు అందాల భామ సుష్మితాసేన్. ముఖ్యంగా ఐపీసీ సెక్షన్స్‌పై దృష్టిసారించారు. ఆమె ఏదైనా కేసులో ఇరుక్కున్నారా? అని కంగారు పడకండి. నిజానికి ఆమె కేసులను సాల్వ్ చేస్తానంటున్నారు. లాయర్‌గా కాదు. పోలీసాఫీసర్‌గా. సుష్మితాసేన్ ప్రధాన పాత్రలో హిందీలో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కనుందని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఇందులో సుష్మితాసేన్ మోస్ట్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారట.
ఈ సినిమా కథనం మధ్యప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని టాక్. కథ విని సుష్మిత ఇంప్రెస్ అయ్యారట కానీ, కొన్ని మార్పులు చెప్పారట. ప్రస్తుతం టీమ్ స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉంది. అంతా సాఫీగా జరిగితే ఈ సినిమా నెక్ట్స్ ఇయర్ సెట్స్‌పైకి వెళుతుంది. అలాగే ఈ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... దాదాపు ఎనిమిదేళ్ల కిత్రం వచ్చిన ‘నో ప్రాబ్లమ్’ సినిమా తర్వాత హిందీలో మరో సినిమా చేయలేదు సుష్మితాసేన్. ఇప్పుడు లాఠీపట్టి, ఖాకీ తొడిగి పోలీసాఫీసర్‌గా సిల్వర్‌స్క్రీన్‌పైకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ బ్యూటీ.
Comments
Please login to add a commentAdd a comment