ముంబై: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ పెళ్లి కాకుండానే ఇద్దరూ ఆడ పిల్లలను దత్తత తీసుకుని తల్లయ్యారు. ఈ మాజీ బ్యూటీ క్వీన్ మోడల్ రోహమన్ షాల్‌తో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. రోహమన్, ఆమెకు మధ్య 15 సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. అంటే సుస్మిత కంటే రోహమన్ 15 ఏళ్ల చిన్నవాడు. రోహమన్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయినట్టు ఓ ఇంటర్వ్యూలో సుస్మిత వెల్లడించారు. ‘కొన్నెళ్ల క్రితం సోషల్ మీడియాలో రోహమన్ నేరుగా ఓ మెసేజ్ పెట్టాడు. అది చూసి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రోహమన్‌ను కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత రోజు మేము సందేశాలు పంపుకోవడం చేశాం. కానీ 15 సంవత్సరాల వ్యత్యాసం ఉన్న వ్యక్తితో ప్రేమలో పడతానని ఆ సమయంలో నేను ఊహించలేదు’ అని చెప్పుకొచ్చారు. (చదవండి: ప్రియుడితో మాజీ విశ్వసుందరి పుట్టినరోజు)
‘ఇక ఏదేమైనా మేము మా బంధంతో చాలా సంతోషంగా ఉన్నాం. నేను నా పిల్లలు, రోహమన్ ఓ కుటుంబం’ అని పేర్కొన్నారు. అయితే ‘మహిళగా నాకు ఓ తోడు అవసరమని, ఓ వ్యక్తి సావాసం కోరుకునేంత రోమాంటిక్ నేను కాదు. జీవితంలో ఎప్పుడూ నేను అలా ఆలోచించలేదు. రోహమన్‌తో పరిచయం అనుకోకుండా ఏర్పడింది. అయితే దీనికి ఆ దేవుడికి ధన్యవాదలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తులు మాత్రమే కలిసి ఉండగలరు. లేని పక్షంలో వారు కలిసున్నా వ్యర్థమే’ అని సుస్మితాసేన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment