పదేళ్ల తర్వాత సినిమాల్లోకి ఆమె రీ ఎంట్రీ.. | Sushmita Sen Announced About Her Acting Reentry My Fans Have Waited 10 Long Years | Sakshi
Sakshi News home page

పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ: మాజీ విశ్వసుందరి

Published Mon, Dec 9 2019 8:07 PM | Last Updated on Mon, Dec 9 2019 8:26 PM

Sushmita Sen Announced About Her Acting Reentry My Fans Have Waited 10 Long Years - Sakshi

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌ అభిమానులకు శుభవార్త. దాదాపు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ తన అభిమానులను అలరించడానికి వస్తున్నట్లు ఆమె ప్రకటించారు.  2010లో అనీస్‌ బాజ్‌మీ దర్శకత్వంలో వచ్చిన ‘నో ప్రాబ్లమ్‌’ చిత్రంలో నటించిన సుస్మితా ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించనే లేదు. ఈ విషయం గురించి అడిగినప్పుడల్లా తన వ్యక్తిగత కారణాల వల్లే సినిమాలకు విరామం ఇచ్చానంటూ ఆమె చెప్పుకొచ్చేవారు.

అలా నటనకు దూరమైనప్పటికీ ఏదో  విధంగా సోషల్‌ మీడియాలో అభిమానులకు చేరువగా ఉంటూ వస్తున్నారు సుస్మితా. ఇటీవలే  44వ పుట్టిన రోజును కుటుంబ సభ్యులతో జరుపుకున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.  తాజాగా తాను మళ్లీ సినిమాలలో నటించడానికి రెడీ అయ్యానంటూ సోషల్ మీడియా వేదికగా సుస్మితా ప్రకటించారు. బాల్కనీలో ఒంటరిగా నిలుచుని ఉన్న ఆమె ఫోటోకి  ‘నేను ఎప్పుడూ సహన ప్రేమకు విధేయురాలిని’!! ‘ఈ ఒంటరితనం నా అభిమానులకు అభిమానిగా మార్చింది’, ‘పదేళ్ల నుంచి నన్ను నటన వైపు నడిపించడానికి వారి అభిమానంతో ప్రోత్సహకం అందిస్తూ వచ్చిన ఫ్యాన్స్‌ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా’ అంటూ సుస్మితా  తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇక ఈ వార్త విన్న మాజీ విశ్వసుందరి అభిమానులంతా ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్నారు.
 

కాగా సుస్మితాసేన్‌ సినిమా విరామంపై  ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాల వల్లే యాక్టింగ్‌కు బ్రేక్‌ ఇచ్చానని, తన రెండవ దత్త పుత్రిక అలిసా కోసమే సినిమాలకు కాస్తా దూరంగా ఉన్నట్లు చెప్పారు. ఎందుకంటే అలిసా బాల్యానికి తాను దూరంగా ఉండాలనుకోలేదని, తన మొదటి దత్త కూతురు రేనీ సమయంలో తన బాల్య స్మృతులను కోల్పోయానని అన్నారు. అలిసా విషయంలో ఆ తప్పు చేయాలనుకోలేదని ఇందుకోసమే నటనకు దూరంగా ఉన్నట్లు అమె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement