
ఆమె సెక్స్ టేపుల గురించి తెలీదా: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మరీ ఘోరంగా తయారవుతోంది. మాజీ మిస్ యూనివర్స్‌ను తాను తిట్టానని అంతా అంటున్నారని, కానీ ఆమె ఒక సెక్స్ టేప్‌లో ఉన్న విషయాన్ని విమర్శకులు చూసుకోవాలని రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చెప్పారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మరీ ఘోరంగా తయారవుతోంది. మాజీ మిస్ యూనివర్స్‌ను తాను తిట్టానని అంతా అంటున్నారని, కానీ ఆమె ఒక సెక్స్ టేప్‌లో ఉన్న విషయాన్ని విమర్శకులు చూసుకోవాలని రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో హిల్లరీ క్లింటన్‌ను విమర్శిస్తూ ఆయన వరుసపెట్టి ట్వీట్లు చేశారు. 1996 నాటి మిస్ యూనివర్స్ విజేత ఎలీషియా మచాడోను గతంలో ట్రంప్ విమర్శించిన విషయాన్ని హిల్లరీ క్లింటన్ ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ప్రస్తావించారు.
1996లో వెనిజులా సుందరి ఎలీషియా మచాడో మిస్ యూనివర్స్గా గెలుపొందింది. ఆ ఆనందంలో ఉన్న ఆమె కొంతకాలానికి బరువు పెరిగింది. దీంతో ఆమెను వెంటాడి మరీ ట్రంప్ కంపు వ్యాఖ్యలు చేశారు. ఆమె ముఖం మీదే పంది (మిస్ పిగ్గీ), తిండిబోతు యంత్రం (ఈటింగ్ మిషన్) అంటూ నానా దుర్భాషలు ఆడారు. వ్యక్తిగతంగా తిట్టడంతో పాటు బహిరంగంగా కూడా దూషించిన విషయాన్ని హిల్లరీ క్లింటన్ ప్రశ్నించారు. మహిళలంటే ట్రంప్‌కు ఏమాత్రం గౌరవం లేదన్నారు.
దాన్ని ఇప్పుడు ఆయన ప్రస్తావిస్తూ... 'క్రూకెడ్ హిల్లరీ' ఎలీషియాను తన డిబేట్‌లో ఉపయోగించుకున్నారని, కానీ ఆమె దారుణమైన గతాన్ని (సెక్స్ టేపులు) గుర్తుచేసుకోవాలని తన ట్వీట్లలో పేర్కొన్నారు. ఎలీషియా గతాన్ని ఏమాత్రం తెలుసుకోకుండా అనవసరంగా ఒక దేవతలా చూపించే ప్రయత్నం చేశారని మరో ట్వీట్‌లో చెప్పారు. అయితే ఆ టేపులకు సంబంధించి గానీ, ఎలీషియా గురించి అంతకుముందు ప్రచురించిన అంశాల గురించి గానీ ట్రంప్ ఎక్కడా ఎలాంటి లింకులు ఇవ్వలేదు. ఫాక్స్ టీవీలో ఇంటర్వ్యూ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించుకున్నారు. మచాడో బరువు పెరగడం నిజంగా సమస్యే అవుతుందని ఆయన అన్నారు. ట్రంప్ తనను ఎప్పుడూ ఒక చెత్తకుప్పలాగే చూసేవాడని మచాడో మండిపడ్డారు. ప్రస్తుతం రాజకీయాలలోకి వచ్చిన ఆమె.. బిగ్ డిబేట్ అయిన వెంటనే మర్నాడే మీడియా ముందుకు వచ్చారు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక పీడకలలా తన గురించి ఆయన చెప్పారని ఆవేదన చెందారు.
మొదటి డిబేట్ తర్వాత ట్రంప్ విజయావకాశాలు మరింత తగ్గాయి. సర్వేలలో ఆయనకు .. హిల్లరీకి మధ్య తేడీ మరింత పెరిగిపోయింది. దాంతో కొత్త సలహాదారులను నియమించుకున్న ఆయన.. బహిరంగ సభల్లో కేవలం వాళ్లు చెప్పిన మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు.
Wow, Crooked Hillary was duped and used by my worst Miss U. Hillary floated her as an "angel" without checking her past, which is terrible!
— Donald J. Trump (@realDonaldTrump) 30 September 2016