
జికా ఉన్నా.. జిల్‌జిల్ జిగా..
జికా వైరస్ అంటే అందరూ జడుసుకు చస్తున్నారు.. మరి ఇలాంటి టైమ్‌లో పర్యాటకులు ఏం చేయాలి? జికా వైరస్ ఉన్న దేశాల్లో తిరక్కూడదంటే ఎలా? అని అంటే.. ఇదిగో ఇదేసుకుని తిరిగేయండి అంటోంది ఓ జపాన్ కంపెనీ. మొత్తం అంతటినీ కప్పేసేలా నెట్స్‌మెన్ పేరిట ఈ దోమ తెరను తయారుచేసింది. ఇదేసుకుని ఎంచక్కా తిరిగేయొచ్చని చెబుతోంది. జికా కాదు.. డెంగీతోపాటు దోమల వల్ల వచ్చే వ్యాధులన్నిటి నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని ‘బిబిల్యాబ్’ కంపెనీ చెబుతోంది. దీన్ని తీయాల్సిన పని కూడా లేదట. కాళ్లు, చేతులు కడుక్కోవాలన్నా.. బాత్రూంకు వెళ్లాలన్నా అందుకు వీలుగా.. ఎక్కడికక్కడ జిప్‌లను ఏర్పాటు చేశారు. పర్యాటకులతోపాటు జికా వైరస్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకూ ఉపయోగపడుతుందని అంటోంది. దీని ధర రూ.4,200.