ఆ వైరస్ సోకుతుందని భయపడను! | do not afraid to zika virus, says sania mirza | Sakshi
Sakshi News home page

ఆ వైరస్ సోకుతుందని భయపడను!

Published Tue, Jul 19 2016 10:49 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

ఆ వైరస్ సోకుతుందని భయపడను!

ఆ వైరస్ సోకుతుందని భయపడను!

ముంబై: త్వరలో జరగనున్న ఒలింపిక్స్‌లో పతకం గురించి ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. ప్రతి పెద్ద టోర్నీకి ఎలా సన్నద్ధమవుతానో ఒలింపిక్స్‌కు కూడా అలాగే సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. 'ప్రతి మ్యాచ్‌లో నెగ్గడానికి ప్రయత్నించాలి. ఆటను మెరుగుపర్చుకుంటూ వెళ్తే మంచి ఫలితాలు దక్కుతాయి. అలా కానీ పక్షంలో మళ్లీ ప్రయత్నించాలి. అంతేకానీ ముందుగానే ప్రతి విషయంపై అంచనాలు పెంచుకోకూడదు' అని సానియా అంటోంది.

డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్నతో తనకు చక్కటి భాగస్వామ్యం కుదిరిందని, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో అతనితో కలసి ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. తనకు జికా వైరస్ గురించి భయంలేదని, కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పింది. తన డబుల్స్ భాగస్వామి ప్రార్థన తొంబారే ఆత్మవిశ్వాసంతో ఉండడం ఒలింపిక్స్‌లో తమ జోడీకి కలిసొస్తుందని తెలిపింది. ఈ నెల 22న కెనడా ఓపెన్‌, ఆ తర్వాత ఒలింపిక్స్‌లో పాల్గొని అట్నుంచి యూఎస్ ఓపెన్‌లో ఆడేందుకు వెళ్తానని చెప్పుకొచ్చింది. చాలాకాలం పాటు టెన్నిస్‌లో కొనసాగాలని భావిస్తున్నట్లు తెలిపింది. మేకప్ వేసుకుని నటిస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేదని టెన్నిస్ క్వీన్ సానియా సమాధానమిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement