తిరువనంతపురం : కేరళలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. 24 ఏళ్ల గర్భిణీ మహిళకు జికా వైరస్ సోకినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లా పరస్సల గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ జూన్ 28న తలనొప్పితో పాటు, శరీరంపై రెడ్ మార్క్‌లు ఏర్పడడంతో ఆమె కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు.
పలు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె జికా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. మరోవైపు తిరువనంతపురానికి చెందిన డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు టెస్ట్‌లు చేయగా 13మందిలో దోమల ద్వారా వ్యాపించే జికా వైరస్ లక్షణాలు ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు అనుమానం వ్యక‍్తం చేస్తున్నారు. వాటిని నిర్ధారించేందుకు ఆ శాంపిల్స్‌లు పూణే వైరాలజీ ల్యాబ్‌కు తరలించారు. ఆ రిజల్ట్ రావాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం జికా వైరస్‌పై అప్రమత్తమైంది.
ఈ సందర్భంగా కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణజార్జ్ మాట్లాడుతూ.. జికా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. "గర్భిణీ మహిళకు జికా వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుంది. గత వారం రోజుల క్రితం బాధితురాలి తల్లి జికా వైరస్ లక్షణాలు ఉండడంతో ఆస‍్పత్రిలో చేరారు. ఆమె ట్రావెల్ హిస్టరీ గురించి ఆరాతీస‍్తున్నాం. బాధితురాలు, ఆమె తల‍్లికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని తెలుస్తోందని " అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment