Kerala Health dept
-
కేరళలో ‘మీజిల్స్’ పంజా.. 160 మంది చిన్నారులకు వైరస్
తిరువనంతపురం: చిన్నారులకు సోకే మీజిల్స్ వ్యాధి దేశంలో మరో రాష్ట్రానికి పాకింది. ఇప్పటికే మహారాష్ట్రలో వందల కేసులు నమోదు కాగా.. తాజాగా కేరళలోనూ భారీగా కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఇప్పటి వరకు 160 మంది పిల్లలకు వైరస్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులోనూ మలప్పురమ్ జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపింది. అయితే, ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించకపోవటం ఊరట కలిగిస్తోందని తెలిపింది. మీజిల్స్ వైరస్ కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేరళలో మీజిల్స్ వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం రాష్ట్రానికి చేరుకుంది. మలప్పురమ్‌లో పర్యటన అనంతరం ఆరోగ్య శాఖ కార్యదర్సితో నిపుణులు భేటీ కానున్నారు. మరోవైపు.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు ఆరోగ్య శాఖ మంత్రి మీనా జార్జ్. అయితే, తమ పిల్లలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ‘మలప్పురమ్‌లో మీజిల్స్ వైరస్‌ను గుర్తించిన క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేశాం. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో భేటీలో జయపురపైనా సమీక్షించాం. ప్రజల భాగస్వామ్యంతో వైరస్‌పై పోరాడేందుకు ప్రజాహిత చర్యలు తీసుకుంటున్నాం. వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టాం.’ అని ఆరోగ్య శాఖ ఓ ప్రకటన చేసింది. జిల్లాలో అవసరమైన ఎంఆర్ వ్యాక్సిన్, విటమిన్ ఏ సిరప్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇదీ చదవండి: మహారాష్ట్రకు మరో టెన్షన్.. మీజిల్స్ వైరస్‌తో చిన్నారులు మృతి -
గుడ్ న్యూస్.. మంకీపాక్స్ నుంచి కోలుకున్న తొలి బాధితుడు
తిరువనంతపురం: భారత్‌లో మంకీపాక్స్ బారినపడ్డ తొలి బాధితుడు పూర్తిగా కోలుకున్నాడు. కేరళకు చెందిన ఇతడు తిరువనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. తాజాగా 72 గంటల వ్యవధిలో రెండుసార్లు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతనికి మంకీపాక్స్ నెగెటివ్ వచ్చినట్లు కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. శనివారమే అతడ్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బాధితుడు మానసికంగా, శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని మంత్రి తెలిపారు. అతని శరీరంపై వచ్చిన దద్దుర్లు కూడా పూర్తిగా నయమైనట్లు చెప్పారు. అంతేకాదు బాధితుని కుటుంబసభ్యుల్లో ఎవరికీ మంకీపాక్స్ సోకలేదని, అందరికీ నెగెటివ్ వచ్చినట్లు వివరించారు. అలాగే మంకీపాక్స్ బారినపడి చికిత్స పొందుతున్న మరో ఇద్దరు బాధితుల పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వెల్లడించారు. కేరళ కొల్లం జిల్లాకు చెందిన మంకీపాక్స్ తొలిబాధితుడికి జులై 14న పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అతను విదేశాల నుంచి వచ్చాడు. ఆ తర్వాత కేరళలోనే మరో రెండు కేసులు వెలుగుచూశాయి. వారు కూడా విదేశాలకు వెళ్లి వచ్చినవారే. మంకీపాక్స్ జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య ఇప్పటికే తెలిపింది.ఈ మహమ్మారిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇది స్మాల్‌పాక్స్ తరహా వ్యాధి అని ప్రాణాంతకం కాదని పేర్కొంది. చదవండి: హిందువులను విభజించాలని చూస్తున్నారు.. మరాఠీ గర్వాన్ని అవమానించారు -
‘జికా’ కలకలం, గర్భిణీ మహిళకు సోకిన మహమ్మారి
తిరువనంతపురం : కేరళలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. 24 ఏళ్ల గర్భిణీ మహిళకు జికా వైరస్ సోకినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లా పరస్సల గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ జూన్ 28న తలనొప్పితో పాటు, శరీరంపై రెడ్ మార్క్‌లు ఏర్పడడంతో ఆమె కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె జికా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. మరోవైపు తిరువనంతపురానికి చెందిన డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు టెస్ట్‌లు చేయగా 13మందిలో దోమల ద్వారా వ్యాపించే జికా వైరస్ లక్షణాలు ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాటిని నిర్ధారించేందుకు ఆ శాంపిల్స్లు పూణే వైరాలజీ ల్యాబ్‌కు తరలించారు. ఆ రిజల్ట్ రావాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం జికా వైరస్‌పై అప్రమత్తమైంది. ఈ సందర్భంగా కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణజార్జ్ మాట్లాడుతూ.. జికా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. "గర్భిణీ మహిళకు జికా వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుంది. గత వారం రోజుల క్రితం బాధితురాలి తల్లి జికా వైరస్ లక్షణాలు ఉండడంతో ఆస్పత్రిలో చేరారు. ఆమె ట్రావెల్ హిస్టరీ గురించి ఆరాతీస్తున్నాం. బాధితురాలు, ఆమె తల్లికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని తెలుస్తోందని " అన్నారు. చదవండి: ఎస్సై ఫిర్యాదు, రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు -
కేరళలో కొత్త వ్యాధి కలకలం
కేరళ : మలేరియా జాతికి చెందిన కొత్త పరాన్నజీవి కేరళలో కలకలం రేపుతోంది. ఇటీవల సూడాన్ నుంచి కేరళకి వచ్చిన ఓ సైనికుడి శరీరంలో దీన్ని కనుగొన్నారు. అతడి ద్వారా వచ్చిన ఈ కొత్త జాతి ‘ప్లాస్మోడియం ఒవల్‌గా’ గుర్తించారని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కెకె.శైలజ తెలిపారు. అతనికి కన్నూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు గురువారం ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. నివారణ చర్యలు చేపట్టడం ద్వారా, తగిన సమయానికి చికిత్స తీసుకోవటం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు అని ఆమె పేర్కొన్నారు. కాగా, భారత్‌లో తొలి కరోనా వైరస్ కేసు కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో నమోదయ్యింది. చైనాలోని వూహాన్ యూనివర్శిటీలో చదువుతున్న ఓ విద్యార్ధి అక్కడినుంచి భారత్ వచ్చాడు. అతడిలో కరోనా వైరస్‌ను గుర్తించారు. అంతేకాకుండా 2018లో వచ్చిన నిఫా వైరస్ కూడా ఇక్కడి కొజికొడ్ జిల్లాలో వెలుగుచూసింది. Plasmodium ovale, a new genus of malaria, has been detected in the State. It was found in a soldier who was being treated at the District hospital in Kannur. The soldier had come from Sudan. The spread of the disease can be avoided with timely treatment and preventive measures. — Shailaja Teacher (@shailajateacher) December 10, 2020 -
కేరళలో పెరుగుతున్న నిఫా వైరస్ మృతులు