కేరళ : మలేరియా జాతికి చెందిన కొత్త పరాన్నజీవి కేరళలో కలకలం రేపుతోంది. ఇటీవల సూడాన్ నుంచి కేరళకి వచ్చిన ఓ సైనికుడి శరీరంలో దీన్ని కనుగొన్నారు. అతడి ద్వారా వచ్చిన ఈ కొత్త జాతి ‘ప్లాస్మోడియం ఒవల్‌గా’ గుర్తించారని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కెకె.శైలజ తెలిపారు. అతనికి కన్నూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు గురువారం ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. నివారణ చర్యలు చేపట్టడం ద్వారా, తగిన సమయానికి చికిత్స తీసుకోవటం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు అని ఆమె పేర్కొన్నారు.
కాగా, భారత్‌లో తొలి కరోనా వైరస్ కేసు కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో నమోదయ్యింది. చైనాలోని వూహాన్ యూనివర్శిటీలో చదువుతున్న ఓ విద్యార్ధి అక్కడినుంచి భారత్ వచ్చాడు. అతడిలో కరోనా వైరస్‌ను గుర్తించారు. అంతేకాకుండా 2018లో వచ్చిన నిఫా వైరస్ కూడా ఇక్కడి కొజికొడ్ జిల్లాలో వెలుగుచూసింది.
Plasmodium ovale, a new genus of malaria, has been detected in the State. It was found in a soldier who was being treated at the District hospital in Kannur. The soldier had come from Sudan. The spread of the disease can be avoided with timely treatment and preventive measures.
— Shailaja Teacher (@shailajateacher) December 10, 2020
Comments
Please login to add a commentAdd a comment