లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బుధవారం 25 కొత్త జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నమోదైన 11 కేసులతో కలుపుకొని ఇప్పటి వరకు మొత్తం 36 జికా వైరస్ కేసులు నమోదైనట్లు కాన్పుర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నెపాల్ సింగ్ తెలిపారు. 36 జికా కేసుల్లో ఇద్దరు గర్భిణీ స్త్రీలు ఉన్నట్లు వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖ 400 నుంచి 500 ఇళ్లలో ఉన్నవారి నుంచి సాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిపారు.
ప్రతి ఇంటిలోను సాంపిల్స్ సేకరించే కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. జికా వైరస్ కేసులు పెరుగుతన్నాయని ఎవరూ ఆందోళన చెందవద్దని, నియంత్రణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాన్పుర్‌లోని తివారీపూర్, అష్రఫాబాద్, పోఖర్‌పూర్, శ్యామ్ నగర్, ఆదర్శ్ నగర్ ప్రాంతాల్లో కొత్త జికా వైరస్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment