జికా వైరస్‌కు సమర్థవంతమైన టీకా | Where Does Zika Virus Vaccine Research Stand Now? | Sakshi
Sakshi News home page

జికా వైరస్‌కు సమర్థవంతమైన టీకా

Published Sun, Aug 13 2017 1:19 AM | Last Updated on Sun, Sep 17 2017 5:27 PM

జికా వైరస్‌కు సమర్థవంతమైన టీకా

జికా వైరస్‌కు సమర్థవంతమైన టీకా

వాషింగ్టన్‌: ప్రాణాంతకమైన జికా వైరస్‌కు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మొక్కల నుంచి టీకాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది అత్యంత సమర్థవంతమైనదని, సురక్షితమైనదని, అంతేకాకుండా ఇది చాలా చవకైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జికా వైరస్‌ను నిలువరించేందుకు అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించి ఈ టీకాను అభివృద్ధి చేశార

జికా వైరస్‌ ప్రజలకు సోకేలా చేయడంలో జికా వైరల్‌ ప్రొటీన్‌లోని డీ – ఐఐఐ అనే డొమైన్‌ కీలక పాత్ర పోషిస్తుందని ఏఎస్‌యూకి చెందిన శాస్త్రవేత్త కియాంగ్‌ చెన్‌ వివరించారు. దీన్ని నిలువరించేందుకుగాను ముందుగా పొగాకు మొక్కల్లోకి డీ – ఐఐఐని ప్రవేశపెట్టి, అదే మొక్క నుంచి ప్రతిరక్షకాన్ని అభివృద్ధి చేసినట్లు కియాంగ్‌ చెప్పారు. ముందుగా ఈ టీకాను ఎలుకలపై ప్రయోగించి 100 శాతం విజయం సాధించామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement