కొలెస్ట్రాల్‌ పూర్తిగా హానికరమేనా? | Cholesterol Levels: What You Need to Know | Sakshi
Sakshi News home page

కొలెస్ట్రాల్‌ పూర్తిగా హానికరమేనా?

Published Tue, Aug 27 2024 12:47 PM | Last Updated on Tue, Aug 27 2024 12:47 PM

Cholesterol Levels: What You Need to Know

శరీరంలో కాలేయం ఉత్పత్తి చేసే ఒకలాంటి కొవ్వుని కొలెస్ట్రాల్‌ అంటారు. మన శరీర ప్రతికణంలో కొలెస్ట్రాల్‌ ఉంటుంది. కొలెస్ట్రాల్‌ అనగానే అదేదో ఆరోగ్యానికి చాలా హానికరమనీ, చెడు చేస్తుందనే అభి్రపాయం పెరిగింది. కానీ జీవక్రియలకు పరిమిత మోతాదులో కొలెస్ట్రాల్‌ చాలా అవసరమే కాకుండా ఉండాల్సిన మోతాదులో ఉంటే మంచి చేస్తుంది కూడా.

ఏ కొలెస్ట్రాల్‌తో డేంజర్‌?
కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు రెండూ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ పాళ్లు ఉండాల్సిన పరిమితిలో ఉండి, శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్‌ కూడా ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాల్‌ను ‘హై డెన్సిటీ లైపో్రపోటీన్‌’ (హెచ్‌డీఎల్‌) అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ‘లో డెన్సిటీ లైపో్రపోటీన్‌’ (ఎల్‌డిఎల్‌) అంటారు. అందుకే ఎల్‌డీఎల్‌ను ‘‘చెడు కొలెస్ట్రాల్‌’’ (బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌) అంటారు. అదే హెచ్‌డీఎల్‌ రక్తనాళాల్లోకి కొవ్వు చేరకుండా చేస్తుంది. 

అందుకే దీన్ని ‘‘వుంచి కొలెస్ట్రాల్‌’’ (గుడ్‌ కొలెస్ట్రాల్‌) అని అంటారు. మన శరీరంలో ఎప్పుడు హెచ్‌డీఎల్‌ ఎక్కువగా ఉండి ఎల్‌డీఎల్‌ తక్కువగా ఉండేలా మంచిది. ఈ ఎల్‌డీఎల్‌ ఉండాల్సిన మోతాదు కంటే  మించితే అది రక్తనాళాల్లో చేరి రక్తప్రవాహాన్ని అడ్డుకుని గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారితీసే అవకాశం ఉంది. అందుకే చెడు కొలెస్ట్రాల్‌ను ఉండాల్సిన పరిమితికి మించకుండా చూసుకోవాలని జాగ్రత్త చెబుతారు.

మోతాదు కనుగొనడం ఎలా? 
వున శరీరంలో కొలెస్ట్రాల్‌ మోతాదులను రక్త పరీక్ష  ద్వారా కనుక్కోవచ్చు. పన్నెండు  గంటలపాటు ఏమీ తినకుండా ఈ టెస్ట్‌ చేయించుకోవాలి. ఈ పరీక్షలో ఎల్‌డీఎల్‌ (లో డెన్సిటీ లైపో్ర ప్రోటీన్‌ లెవల్‌), హెచ్‌డీఎల్‌ (హై డెన్సిటీ లైపో ప్రోటీ లెవెల్‌)  తెలుస్తాయి. ఎల్‌డీఎల్‌ ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం ఉంది.

మంచి కొలెస్ట్రాల్‌ కోసం... 
కొలెస్ట్రాల్‌ ఉండే గుడ్డు వంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అయితే వాటిని పరిమితంగా తీసుకోవాలి. అందరికీ అందుబాటులో ఉండే గుడ్డులోని తెల్లసొనలో మంచి కొలెస్ట్రాల్‌ ఉంటుంది. పచ్చ సొనలో చెడు కొలెస్ట్రాల్‌ ఉంటుంది. 
సరైన వ్యాయామం లేకపోవడం, ఫ్యామిలీ హిస్టరీ, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ పెరిగే ప్రమాదం 
ఉంది. అందుకే గతంలో ఎలాంటి లక్షణాలూ లేనివారు కూడా 40 ఏళ్లు పైబడ్డాక ప్రతి ఐదేళ్లకోవూరు పరీక్ష చేయించుకోవాలి. అదే రిస్క్‌ఫ్యాక్టర్స్‌ ఉన్నవారైతే డాక్టర్‌ సలహా మేరకు ప్రతి ఏడాదీ, లేదా డాక్టర్‌ సూచించిన ప్రకారం కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement