Health Tips In Telugu: High Blood Pressure (Hypertension) Signs, Causes, Diet, And Treatment - Sakshi
Sakshi News home page

Hypertension: పక్షవాతం, బ్రెయిన్‌ స్ట్రోక్‌, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్‌’ వద్దు! ఇవి తినండి!

Published Mon, Jun 6 2022 10:52 AM | Last Updated on Mon, Jun 6 2022 11:46 AM

Health Tips In Telugu: Hypertension Symptoms What To Eat What Not - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హైపర్‌ టెన్షన్‌తో దాదాపు 10 శాతానికి మించి గుండె జబ్బుకు గురవుతున్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. హైపర్‌టెన్షన్‌తో ఉన్నవారిలో పది శాతం మంది పక్షవాతం బారిన పడగా మరో అయిదు శాతం కిడ్నీసమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ టెన్షన్‌ వల్ల కొందరికీ బ్రెయిన్‌ స్టోక్‌ కూడా వచ్చే ప్రమాదముంది.

ఇటీవల కాలంలో బ్రెయిన్‌ స్టోక్, గుండెకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. హైపర్‌టెన్షన్‌ ఉన్నవారికీ కిడ్నీ రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడుతాయి. దీనివల్ల కిడ్నీ దెబ్బతిని పని వేయకుండా పోయే ప్రమాదముంది. అదే విధంగా రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడడం వల్ల గుండె, బ్రెయిన్‌ స్ట్రోక్‌లు వస్తున్నాయి.

చిత్రం ఏమిటంటే, చాలామందికి తమకు హైపర్‌ టెన్షన్‌ ఉన్నట్లు కూడా తెలియకపోవడం. అయితే హైపర్‌ టెన్షన్‌ను గుర్తించగలిగితే దాని వల్ల కలగబోయే ముప్పును నివారించుకోవచ్చు

గుర్తించటం ఎలా?
బీపీ తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు ముందు తలదిమ్ము మొదలవుతుంది. తర్వాత వివరీతమైన తలనొప్పి, నిద్రలేమి, చూపు మసక బారటం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వాన తీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి.

రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
ప్రతిరోజూ తవ్పని నరిగ్గా 30 నుంచి 45 నిమిషాలు నడవాలి
అస్తమానం కుర్చీకే అతుక్కుని కూర్చోకుండా ప్రతి అరగంటకు ఒకసారి లేచి నాలుగు అడుగులు వేస్తుండాలి.
నిత్యం వ్యాయామం, యోగా చేయాలి.
చిన్న చిన్న విషయాలకు టెన్షన్‌కు గురికావద్దు
ఉదయం, సాయంత్రాల్లో మంచి వాతావరణంలో చక్కటి సంగీతం వినడం మంచిది.
టెన్షన్‌కు గురవుతున్న నమయంలో నచ్చిన వారితో మాట్లాడడం, మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల టెన్షన్‌ దూరం అవుతుంది. 
ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏది తగ్గించాలి?
ఆహారంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా జూగ్రత్త వహించాలి.
బత్తాయి, కమలాలు, ద్రాక్ష వంటి పండ్లు ఎక్కువగా తీనుకోవాలి.
ఆహారంలో పొటాషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి.
ఎర్రటి మాంసం, మీగడ, వెన్న, నూనె వంటి వాటికీ దూరంగా ఉండాలి.
బయటి ఆహార పదార్థాల జోలికి వెళ్లరాదు.
బరువు పెరగకుండా చూనుకోవాలి.

హైపర్‌టెన్షన్‌ ఉన్నవారు ఏమి చేయాలి?
తరచు వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి.
మందుల వాడకాన్ని ఒకరోజు కూడా నిలిపేయొద్దు.
ఆరోగ్య పరిస్థితిని బట్టి మందుల వాడకాన్ని మార్చుకోవాలి.
షుగర్‌ , గుండె , థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి.
కొలస్ట్రాల్‌ పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి.
మద్యపానం,  సిగరెట్లను పూర్తిగా మానేయాలి.
కారం, ఉప్పు తగ్గించాలి. 

చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్‌- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్‌ ఉత్పత్తికి ఇది అవసరం!
High Vitamin D Rich Foods: ట్యూనా, సాల్మన్‌, గుడ్లు, పాలు.. వీటిలో విటమిన్‌- డి పుష్కలం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement