Red Meat
-
Health Tips: ఉప్పు, కారంతో పాటు ఆ అలవాట్లూ తగ్గించండి! లేదంటే!
హైపర్ టెన్షన్‌తో దాదాపు 10 శాతానికి మించి గుండె జబ్బుకు గురవుతున్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. హైపర్‌టెన్షన్‌తో ఉన్నవారిలో పది శాతం మంది పక్షవాతం బారిన పడగా మరో అయిదు శాతం కిడ్నీసమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ టెన్షన్ వల్ల కొందరికీ బ్రెయిన్ స్టోక్ కూడా వచ్చే ప్రమాదముంది. ఇటీవల కాలంలో బ్రెయిన్ స్టోక్, గుండెకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. హైపర్‌టెన్షన్ ఉన్నవారికీ కిడ్నీ రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడుతాయి. దీనివల్ల కిడ్నీ దెబ్బతిని పని వేయకుండా పోయే ప్రమాదముంది. అదే విధంగా రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడడం వల్ల గుండె, బ్రెయిన్ స్ట్రోక్‌లు వస్తున్నాయి. చిత్రం ఏమిటంటే, చాలామందికి తమకు హైపర్ టెన్షన్ ఉన్నట్లు కూడా తెలియకపోవడం. అయితే హైపర్ టెన్షన్‌ను గుర్తించగలిగితే దాని వల్ల కలగబోయే ముప్పును నివారించుకోవచ్చు. గుర్తించటం ఎలా? బీపీ తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు ముందు తలదిమ్ము మొదలవుతుంది. తర్వాత వివరీతమైన తలనొప్పి, నిద్రలేమి, చూపు మసక బారటం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వాన తీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి. రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►ప్రతిరోజూ తవ్పని నరిగ్గా 30 నుంచి 45 నిమిషాలు నడవాలి ►అస్తమానం కుర్చీకే అతుక్కుని కూర్చోకుండా ప్రతి అరగంటకు ఒకసారి లేచి నాలుగు అడుగులు వేస్తుండాలి. ►నిత్యం వ్యాయామం, యోగా చేయాలి. ►చిన్న చిన్న విషయాలకు టెన్షన్‌కు గురికావద్దు ►ఉదయం, సాయంత్రాల్లో మంచి వాతావరణంలో చక్కటి సంగీతం వినడం మంచిది. ►టెన్షన్‌కు గురవుతున్న నమయంలో నచ్చిన వారితో మాట్లాడడం, మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల టెన్షన్ దూరం అవుతుంది. ►ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏది తగ్గించాలి? ►ఆహారంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా జూగ్రత్త వహించాలి. ►బత్తాయి, కమలాలు, ద్రాక్ష వంటి పండ్లు ఎక్కువగా తీనుకోవాలి. ►ఆహారంలో పొటాషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ►ఎర్రటి మాంసం, మీగడ, వెన్న, నూనె వంటి వాటికీ దూరంగా ఉండాలి. ►బయటి ఆహార పదార్థాల జోలికి వెళ్లరాదు. ►బరువు పెరగకుండా చూనుకోవాలి. హైపర్‌టెన్షన్ ఉన్నవారు ఏమి చేయాలి? ►తరచు వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. ►మందుల వాడకాన్ని ఒకరోజు కూడా నిలిపేయొద్దు. ►ఆరోగ్య పరిస్థితిని బట్టి మందుల వాడకాన్ని మార్చుకోవాలి. ►షుగర్ , గుండె , థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ►కొలస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ►మద్యపానం, సిగరెట్లను పూర్తిగా మానేయాలి. ►కారం, ఉప్పు తగ్గించాలి. చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! High Vitamin D Rich Foods: ట్యూనా, సాల్మన్, గుడ్లు, పాలు.. వీటిలో విటమిన్- డి పుష్కలం! -
Health Tips: రొట్టె, తృణధాన్యాలు.. చేపలు, అవిసె గింజలు.. తరచుగా తింటే!
‘నిండు నూరేళ్లు చల్లగా ఉండు’ అని పెద్దలు దీవిస్తుంటారు... అయితే అలా నూరేళ్లు కాకపోయినా జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉండడం, సరాసరి జీవితకాలం కన్నా ఎక్కువ కాలం జీవించగలగడం మన చేతిలోనే ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 20 ఏళ్ల వయసు నుంచే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఆరంభిస్తే కనీసం పది నుంచి పదమూడేళ్లు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారని ఒక పరిశోధనలో తెలిసింది. అయితే దేనిని ఆరోగ్యకరమైన ఆహారం అంటారో తెలుసుకుందాం. ఇది చదివి ‘అయ్యో! మనం చిన్నప్పటినుంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని ఉంటే బాగుండేది, ఇప్పుడు ఏమి ప్రయోజనం! అని బాధపడనక్కరలేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మంచి ఆహారం తీసుకోవడం కనీసం ఇప్పటినుంచి ప్రారంభించినా మరికొంతకాలంపాటు మన ఆయుర్దాయాన్ని పొడిగించుకున్నట్లేనని అధ్యయనాలు చెబుతున్నాయి. రెడ్‌మీట్ అతిగా వద్దు ప్రాసెస్ చేసిన ఆహారం, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకునే వారికంటే పండ్లు, కూరగాయలు, తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని, రెడ్ మీట్‌ను తక్కువగా తీసుకునే వాళ్లు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారని కొన్ని సర్వేలలో తేలింది. అందుకే బరువు పెరుగుతారు ఆరోగ్యకరమైన ఆహారం చురుకుగా ఉండడానికి సహాయపడుతుంది. మీరు చేసే పనిపై మీరు తీసుకునే ఆహారం ఆధారపడి ఉంటుంది. మానసిక శ్రమ చేసేవారికంటే శారీరక శ్రమ చేసే వారు ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే, వారి శరీర అవసరాలకు మించి తినడం, తాగడం చేస్తే బరువు పెరుగుతారు. తీసుకునే అధిక కేలరీలు కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. అది చాలా హానికరం. అందువల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందేలా చూసుకోవాలి. పురుషులకు రోజుకు 2,500 కేలరీలు, మహిళలకు రోజుకు సుమారు 2,000 కేలరీలు అవసరమవుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. రొట్టె, బియ్యం.. ఆహారంలో మూడింట ఒక వంతు మాత్రమే కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థాలు) ఉండాలి. ఇవి అధికంగా ఉండే బంగాళాదుంపలు, రొట్టె, బియ్యం, తృణధాన్యాలు. పగలు చేసే భోజనంలో కనీసం పై వాటిలో ఒక పదార్థం ఉండేలా చూసుకోవాలి. కొంతమంది పిండి పదార్థాలను కొవ్వుగా భావిస్తారు, కాని తక్కువ మోతాదులో తీసుకున్న కార్బోహైడ్రేట్ సగం కంటే తక్కువ కేలరీలను అందిస్తుంది. జ్యూస్‌లు తాగాలి ప్రతిరోజూ ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. అల్పాహారంలో అరటిపండును ఎంచుకోవచ్చు. ఏదైనా పండును జ్యూస్ రూపంలో తీసుకుంటే అది మితంగానే ఉండేలా చూసుకోవాలి. చేపలు తరచుగా తింటే.. మరి శాకాహారులైతే చేప ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను అధికంగా కలిగి ఉంటుంది. వారానికి కనీసం రెండుసార్లు చేపలను తినడం మంచిది. చేపలలో ఉండే ఒమేగా –3 కొవ్వులు గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. శాకాహారులైతే వాటికి ప్రత్యామ్నాయంగా అవిసె గింజలు, మినుములు, నువ్వులతో తయారు చేసిన పదార్థాలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు, చక్కెరలు, నెయ్యి వాడకాన్ని తగ్గించాలి. మాంసాహార వంటల్లో అధిక మొత్తంలో కొవ్వు ఉంటుంది కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్‌లో అధికంగా చక్కెరలు ఉంటాయి. ఇది ఊబకాయానికి, దంత సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. అలాగే, నిల్వ ఉండే చిప్స్ వంటి చిరుతిళ్లలో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. చదవండి: Almonds Benefits: బాదాం ఎలా తింటే మంచిది? పోషకాలు పుష్కలంగా లభించాలంటే? -
మాంసం తినడం మంచిదేనట!
సాక్షి, న్యూఢిల్లీ : ఆవు, పంది, గొర్రె మాంసం రోజూ తినడం మంచిది కాదని, దాని వల్ల ప్రాణాంతకమైన గుండె జబ్బులు, క్సాన్సర్లే కాకుండా మధుమేహం–2 జబ్బు వస్తోందంటూ పలు ఆరోగ్య సంస్థలు ఇంతకాలం చేస్తూ వచ్చిన సూచనలు తప్పని కెనడా, పోలాండ్, స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు తేల్చారు. కెనడాలోని డలౌజీ, మ్యాక్‌మాస్టర్ యూనివర్శిటీలు, స్పెయిన్, పోలాండ్లోని కొక్రేన్ రీసర్చ్ సెంటర్లకు చెందిన 14 మంది పరిశోధకుల బృందం గతంలో 40 లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని సమీక్షించిన 61 అధ్యయనాలను క్షుణ్నంగా పరిశీలించి ఈ విషయాన్ని తేల్చింది. మోతాదుకు మించి మాంసం తినడం వల్ల జబ్బులు, ముఖ్యంగా ఈ మూడు జబ్బులు వస్తాయనడానికి వారు ఎలాంటి ఆధారాలను సేకరించలేక పోయారని పరిశోధకుల బృందం అభిప్రాయపడింది. గత అధ్యయనాలను దృష్టిలో పెట్టుకొని ఒకరు రోజుకు 70 గ్రాములకు మించి మాంసం తినరాదంటూ బ్రిటన్ జాతీయ ఆరోగ్య పథకం కింద జారీ చేసిన మార్గదర్శకాలు తొందరపాటు చర్యేనని ఈ పరిశోధకుల బృందం పేర్కొంది. మధ్య వయస్కులు కూడా మరీ ఎక్కువ కాకుండా ఇంతకన్నా ఎక్కువ మాంసమే తినవచ్చని తాజా అధ్యయనంలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. తమంతట తాము డైట్ మార్చుకోవాలనుకుని మాంసహారాన్ని తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చుగానీ, అనారోగ్యానికి, మాంసహారానికి సంబంధం ఉన్నట్లు పాత అధ్యయనాలు ఏవీ కూడా సహేతుకంగా రుజువు చేయలేక పోయయని కూడా తాజా అధ్యయనం పేర్కొంది. శుద్ధి చేసిన మాంసం తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో తాజా అధ్యయనంపై దుమారం రేగే అవకాశం ఎక్కువగా ఉంది. -
ఈ ఆహారంతో అకాల మరణానికి చెక్
లండన్ : అవకాడో, ఆలివ్ ఆయిల్ వంటి మొక్కల నుంచి లభ్యమయ్యే నూనెలు, కొవ్వుల ద్వారా అకాల మృత్యువాతన పడే ముప్పు గణనీయంగా తగ్గుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ చేపట్టిన అథ్యయనం వెల్లడించింది. ఈ తరహా కొవ్వులతో కూడిన ఆహారం తీసుకునే వారికి ఈ పోషకాలు లభించని ఆహారం తీసుకునే వారితో పోల్చితే అకాల మరణం ముప్పు 16 శాతం తక్కువగా ఉంటుందని అథ్యయనం తేల్చింది. ప్రజలు తీసుకునే కొవ్వు పదార్థాల రకాలను బట్టి వారి జీవితకాలం ఎలా ఉంటుందనేది 22 ఏళ్ల పాటు జరిపిన ఈ పరిశోధన విశ్లేషించింది. 93,000 మంది పురుషులు, మహిళల నుంచి సేకురించిన గణాంకాల ఆధారంగా ఈ పరిశోధన చేపట్టారు. ప్రతి నాలుగేళ్లకోసారి వీరి ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా సమీకరించి విశ్లేషించారు. వీరిలో మాంసం, గుడ్లు, పూర్తికొవ్వుతో కూడిన పాల ఉత్పత్తులను తీసుకునే వారిని ఓ గ్రూపుగా, అవకాడోలు, నట్స్,ఆలివ్ ఆయిల్ వంటి మొక్కల ఆధారిత నూనెలు, కొవ్వులు తీసుకునే వారిని ఓ గ్రూపుగా విభజించి సమాచారాన్ని విశ్లేషించారు. ప్లాంట్ బేస్డ్ కొవ్వులు తీసుకున్న వారు ఎక్కువ కాలం జీవిస్తారని ఈ పరిశోధన తేల్చింది. ఈ తరహా ఆహారంతో 25 శాతం మేర జీవనకాలాన్ని పెంచుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఈ రెండింటి మధ్య పోషకాల పరంగా ఎలాంటి వైరుధ్యాలున్నదీ వెల్లడిస్తూ వారు సాపేక్ష వివరాలు పేర్కొనలేదు. -
రెడ్ మీట్‌తో క్యాన్సర్.. గుట్టు తెలిసింది!
ఆరోగ్యానికి శాకాహారం మంచిదా? మాంసాహారం మంచిదా? ఈ చర్చ యుగాలుగా నడుస్తూనే ఉంది. అయితే కొన్నిరకాల మాంసాల (రెడ్ మీట్)తో క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగతాయని ఇప్పటికే కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కారణమేమిటన్నది మాత్రం ఇప్పటి వరకు తెలియదు. ఈ లోటును కాస్తా పూరించారు నెవెడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. జంతువులతోపాటు కొన్ని రకాల చేపలు, పాల ఉత్పత్తుల్లో సీఎంఏహెచ్ అనే జన్యువు ఉంటుంది. ఇది న్యూ5జీసీ అనే చక్కెర కణాలను ఉత్పత్తి చేస్తూంటుంది. మనుషుల్లోనూ సీఎంఏహెచ్ జన్యువు ఉన్నప్పటికీ దాంట్లో కొన్ని మార్పులు ఉంటాయి. ఫలితంగా న్యూ5జీసీ చక్కెర కణాలు ఉత్పత్తి కావు. రెడ్ మీట్ వంటివి తిన్నప్పుడు వాటిలోని న్యూ5జీసీ చక్కెరలు శరీరంలోకి చేరతాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థ వీటిని పరాయి కణాలుగా గుర్తిస్తుంది. వదిలించుకునే తీరులో స్పందిస్తుంది. ఇది కాస్తా వాపు/మంటలకు, కీళ్లనొప్పులకు, చివరకు క్యాన్సర్‌కూ కారణమవుతోందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూ5జీసీ చక్కెరలు ఉత్పత్తి చేసే జంతువులు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు నెవెడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దాదాపు 322 జంతు జన్యుక్రమాలను పరిశీలించారు. పరిణామ క్రమంలో కొన్ని వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు మానవుల్లోని సీఎంఏహెచ్ జన్యువు పనిచేయకుండా పోయిందని కొన్ని జంతువులు, చేపల్లో ఈ జన్యువు అలాగే ఉండటం, వాటి మాంసం మనం తీసుకోవడం వల్ల సమస్య ఏర్పడుతున్నట్లు గుర్తించామని రెనో అనే శాస్త్రవేత్త చెప్పారు. మరిన్ని పరిశోధనల ద్వారా దీనిపై అవగాహన పెంచుకోగలిగితే వేటి వల్ల సమస్య ఎక్కువవుతుందో అర్థమవుతుందని చెప్పారు. -
రెడ్‌మీట్, గుడ్లతో మరణం!
వాషింగ్టన్: ఎక్కువకాలం జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఇందుకోసం ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. రెడ్ మీట్ (పశుమాంసం), గుడ్లు, పాలు లాంటి జంతు ఉత్పత్తులతో మరణం తొందరగా వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. ‘‘పశుమాంసం, గుడ్లు ద్వారా శరీరానికి అందిన ప్రొటీన్లు హాని చేస్తాయి. ఇలాంటి ఆహారం తీసుకునేవారిని ఊబకాయం, అధికబరువు, బరువు తక్కువగా ఉండటం, అసహజ జీవనశైలి తదితర సమస్యలు కూడా చుట్టుముడతాయి. అదే పప్పులు, చిరుధాన్యాలు, బ్రెడ్, నట్స్‌లాంటì వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకున్నవారు దీర్ఘకాలం జీవిస్తారు’’ అని చెబుతున్నారు. వీటివల్ల శరీరానికి అందే ప్రోటీన్ల వల్ల ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. ఈ పరిశోధన కోసం 30 ఏళ్లపాటు 35లక్షల మంది ఆహారపు అలవాట్లను పరిశీలించారు. ఈ ఫలితాలను మసాచుసెట్స్ జనరల్ హస్పిటల్ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. -
క్యాన్సర్ నివారణ అస్సలు సాధ్యం కాదా?
ఇది పూర్తిగా వాస్తవం కాదు. నిజానికి క్యాన్సర్‌కు కారణమయ్యే అంశం నిర్దిష్టంగా తెలియదు. కాబట్టి ఎన్ని ఆరోగ్య నియమాలు పాటించినా కొందరిలో క్యాన్సర్ కనిపించవచ్చు. అయితే సాధారణంగా చాలా మంచి జీవనశైలిని అనుసరించే అనేక మందిలో క్యాన్సర్ నివారణ సాధ్యమవు తుందని గుర్తించారు. ప్రధానంగా కాలుష్యం లేని చోట్ల నివసించేవారిలో స్వాభావికంగానే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. బరువును అదుపులో పెట్టుకోవడం, మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం, వేట మాంసం (రెడ్ మీట్) బదులు చికెన్, చేపలు తినడం, ఆల్కహాల్, పొగతాగే దురలవాట్లను పూర్తిగా మానేయడం వంటి మంచి జీవన శైలితో క్యాన్సర్‌ను నివారించవచ్చు. ఇక క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం క్యాన్సర్ నివారణకు దోహదపడే అంశమే. అలాగే కుటుంబాల్లో పెద్దలకు క్యాన్సర్ ఉంటే అనువంశీకంగా క్యాన్సర్ వస్తుందనేది పూర్తిగా అపోహ మాత్రమే. అక్కచెల్లెళ్లు, అమ్మ, చిన్నమ్మ వంటి వారికి రొమ్ము క్యాన్సర్ వంటివి ఉంటే ముందుగా తెలుసుకోవడం వల్ల శస్త్రచికిత్సతో దాన్నుంచి పూర్తిగా విముక్తం అయ్యే అవకాశం ఉన్నందున ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉన్నప్పుడు ముందునుంచే అవసరమైన పరీక్షలు చేయించుకుంటూ, డాక్టర్ సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అంతే తప్ప క్యాన్సర్‌ను భయంకరమైన వ్యాధిగా భావించి, అనవసరంగా ఆందోళన పడక్కర్లేదు.