Mosambi
-
చీనీ పంటకు ‘ఏలియన్’ పీడ
సాక్షి, అమరావతి: చీనీ (బత్తాయి) రైతులకు కొత్త తలనొప్పి మొదలైంది. ‘ఏలియన్ పెస్ట్’గా పిలిచే హైలోకోకస్ స్ట్రిటస్ (రుస్సెల్) అనే కొత్త రకం పొలుసు పురుగును దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో చీనీ పంటపై మన శాస్త్రవేత్తలు గుర్తించారు. చూడటానికి సూక్ష్మజీవిలా కనిపించే ఈ పురుగులు బత్తాయి మొక్కల కాండం తొలిచేయడంతోపాటు ఆకుల్లో పత్రహరితం లేకుండా తినేస్తున్నాయి. ఈ పురుగుల ఉధృతిని చూసి శాస్త్రవేత్తలు సైతం ఆందోళనకు గురవుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన అరుదైన పురుగు ఇండోనేషియా, సింగపూర్ దేశాల్లో ఈ పురుగును తొలిసారిగా 1981లో గుర్తించారు. అక్కడ కూడా చీనీ పంటపైనే వీటిని కనుగొన్నారు. ఈ రెండు దేశాల్లో తప్ప ప్రపంచంలో మరే దేశంలోనూ వీటి జాడ ఇప్పటివరకు గుర్తించలేదు. అలాంటిది తొలిసారి అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో వీటి ఉనికిని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఐదారు వేల ఎకరాల్లో ఈ పురుగు ఉధృతి ఉన్నట్టు గుర్తించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొక్కలు, నర్సరీ మెటీరియల్స్ ద్వారా ఈ పురుగులు మన ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. అంగుళంలో 8వ వంతు సైజులో ఊదా రంగులో ఉండే ఈ పొలుసు పురుగుపై ఇతర పొలుసు పురుగుల మాదిరిగా శరీరంపై వాక్సీ లేయర్ (మైనపు పొర) ఉండదు. అందువల్ల ఈ పురుగు పూర్త పారదర్శకంగా కన్పిస్తుంది. ఈ పురుగు వ్యాప్తి చెందితే దిగుబడులపై ప్రభావం చూపడం కాకుండా.. మొత్తం తోటలనే సర్వనాశనం చేస్తుంది. ఈ పురుగులు లక్షల్లో పుట్టుకొస్తాయి. సామూహికంగా వ్యాపిస్తుంటాయి. ఒకసారి సోకిన తర్వాత 30–40 శాతం పంటను తుడిచి పెట్టేస్తుంది. రైతులు ఏమరుపాటుగా ఉంటే నూరు శాతం పంట నాశనమవుతుంది. చెట్టు వయసుతో సంబంధం లేకుండా చిన్న మొక్క నుంచి ముదురు తోటల వరకు వ్యాపిస్తుంది. సమీప భవిష్యత్‌లో బత్తాయి నుంచి ఇతర నిమ్మ జాతి మొక్కలకు కూడా సోకే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. పరిశోధనలు చేస్తున్నాంఈ పొలుసు జాతి పురుగును శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరులోని చీని తోటలపై తొలిసారి గుర్తించాం. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో కూడా ఈ పురుగు ఉదృతి కనిపించింది. వీటి ఉనికి, ఉధృతిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. చీనీ, నిమ్మ జాతి తోటలపై తీవ్ర ప్రభావం చూపే ఈ అరుదైన పురుగులపై పరిశోధనలు ప్రారంభించాం. ఇవి ఎంత కాలం జీవిస్తాయి. ఏయే పంటలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి, వీటి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలేమిటనే అంశాలపై లోతైన పరిశోధనలు చేస్తున్నాం. – డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, వెంకటగిరి -
రోగికి ప్లాస్మా బదులు బత్తాయి జ్యూస్ ఘటన.. ఆసుపత్రికి షాకిచ్చిన అధికారులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించిన ప్రైవేటు ఆసుపత్రిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రయాగ్‌రాజ్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో డెంగీ రోగికి బత్తాయి జ్యూస్ ఎక్కించడంతో బాధితుడు చనిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రోగి ప్రాణాలు కోల్పోయాడని, ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో తాజాగా సదరు ఆసుపత్రికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆసుపత్రి భవనాన్ని అనుమతులు లేకుండా నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. శుక్రవారం నాటికి భవనాన్ని ఖాళీ చేయాలని లేదంటే బుల్డోజర్తో కూల్చివేస్తామని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే డెంగ్యూ రోగి చనిపోయిన కేసు ప్రాథమిక విచారణలో అధికారుల నిర్లక్ష్యం బయటపడటంతో గత వారమే ఆసుపత్రిని సీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో రోగులు లేరు. అయితే గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఆసుపత్రి అధికారులు సమాధానం ఇవ్వలేదని తేలింది. ఈ ఏడాది ప్రారంభంలో కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు డెంగ్యూ రోగి మరణం అనంతరం ప్రయాగ్‌రాజ్ పోలీసులు నకిలీ ప్లేట్లెట్స్ సరఫరా చేసే ముఠాను ఛేదించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రయాగ్‌రాజ్ ఎస్పీ శైలేష్ కుమార్ పాండే తెలిపారు. నిందితుల నుంచి కొన్ని నకిలీ ప్లేట్లెట్ పౌచ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చదవండి: ‘ఏయ్ ఐటమ్. ఎక్కడికి వెళ్తున్నవ్’.. పోకిరికి బుద్ధి చెప్పిన కోర్టు In UP's Prayagraj, the development authority has issued demolition notice to the the hospital where a dengue patient died during treatment. Family of the deceased had alleged that the patient was given Mosambi juice in the drip instead of platelets. pic.twitter.com/T5a34EtIyY — Piyush Rai (@Benarasiyaa) October 25, 2022 -
ప్లేట్లెట్స్ బదులు పండ్ల రసం.. ఆస్పత్రికి సీల్
లక్నో: డెంగీ రోగికి ప్లేట్లెట్స్ బదులు పండ్ల రసం ఎక్కించి.. అతని మృతికి కారణమైన ఆస్పత్రిపై అధికారిక చర్యలు మొదలయ్యాయి. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆదేశాలనుసారం.. గురువారం రాత్రి ఆ ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ నిర్లక్ష్యపూరిత ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రయాగ్‌రాజ్‌లోని గ్లోబల్ హస్పిటల్ అండ్ ట్రామా సెంటర్‌ను అధికారులు సీజ్ చేశారు. అంతేకాదు.. బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ప్రయాగ్‌రాజ్ కలెక్టర్ సంజయ్ కుమార్ ఖాత్రి స్పష్టం చేశారు. మరోవైపు పేషెంట్ బంధువులు ప్రభుత్వాసుపత్రి నుంచి తెచ్చిన ప్లేట్లెట్స్ బ్యాగులనే తాము ఉపయోగించామని, విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని ఆస్పత్రి నిర్వాహకులు చెప్తున్నారు. 32 ఏళ్ల వయసున్న బాధితుడిని డెంగీ కారణంగా జీహెచ్‌టీసీలో చేర్పించారు. ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడంతో.. ఐదు యూనిట్ల ప్లేట్లెట్స్ ఎక్కించాలని సిబ్బంది ప్రయత్నించారు. మూడు యూనిట్లు ఎక్కించేసరికి వికటించడంతో.. పేషెంట్‌పై ప్రభావం పడింది. దీంతో మిగతావి ఎక్కించడం ఆపేశారు. ఈలోపు పరిస్థితి విషమించడంతో.. బంధువులు అతన్ని పక్కనే ఉన్న మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ కన్నుమూశాడు. ప్లేట్లెట్స్ బ్యాగు నకిలీదని, బత్తాయిలాంటి జ్యూస్‌లతో నింపేసి ఉన్నారని రెండో ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది బాధిత కుటుంబంతో చెప్పారు. దీంతో జీహెచ్‌టీసీ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. అన్యాయంగా తన సోదరి భర్తను పొగొట్టుకుందని.. యోగి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని సౌరభ్ త్రిపాఠి అనే బంధువు వాపోతున్నాడు. प्रयागराज में मानवता शर्मसार हो गयी। एक परिवार ने आरोप लगाया है कि झलवा स्थित ग्लोबल हॉस्पिटल ने डेंगू के मरीज प्रदीप पांडेय को प्लेटलेट्स की जगह मोसम्मी का जूस चढ़ा दिया। मरीज की मौत हो गयी है। इस प्रकरण की जाँच कर त्वरित कार्यवाही करें। @prayagraj_pol @igrangealld pic.twitter.com/nOcnF3JcgP — Vedank Singh (@VedankSingh) October 19, 2022 ఇక ఘటన దుమారం రేపడంతో.. ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాథక్ స్పందించారు. ఆస్పత్రి నుంచి వైరల్ అయిన వీడియోపై దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికే ఆస్పత్రికి సీజ్ వేయమని ఆదేశించాం. మరోవైపు ప్లేట్లెట్ ప్యాకెట్లను పరీక్షల కోసం పంపించాం అని పాథక్ ప్రకటించారు. మరోవైపు ప్లేట్లెట్స్ బ్యాగుల్లో పండ్ల రసాలను నింపి సప్లై చేస్తున్న ముఠాల గురించి కథనాలు వస్తుండడంతో దర్యాప్తు ద్వారా విషయం తెల్చేయాలని యోగి సర్కార్ భావిస్తోంది. ఇదీ చదవండి: భజరంగ్‌దళ్‌లోకి 50 లక్షల కొత్త సభ్యత్వాలు -
18 ఎకరాలు: బత్తాయి, వరి, సీతాఫలం సాగు.. బియ్యం కిలో రూ. 80 చొప్పున! ఇంకా..
జీవనమే నిత్య పోరాటమైతే వ్యవసాయం అనుక్షణ యుద్ధమే అంటారు ఒంటరి మహిళా రైతు శశికళ. ఎం.ఎ., బీఈడీ చదివిన ఆమె భర్త ఆకస్మిక మృతితో ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేపట్టారు. 2005 నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఆవులంటే ఇష్టంతో గోశాలను ఏర్పాటు చేసి వర్మీ కంపోస్టు, వర్మీ కల్చర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. పచ్చదనాన్ని అమితంగా ఇష్టపడే ఆమె నర్సరీ ఏర్పాటు చేసుకొని లాండ్స్కేప్ కన్సల్టెంట్‌గా ఎదిగారు. క్షణం తీరిక లేకుండా పనుల్లో మునిగిపోయే శశికళ రైతుగా అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇటు రైతుగా, అటు ఒంటరి మహిళగా దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను వజ్రసంకల్పంతో ఎదుర్కొంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 17 ఏళ్లుగా 18.5 ఎకరాల్లో మొక్కవోని దీక్షతో సమీకృత సేంద్రియ వ్యవసాయం కొనసాగిస్తున్న కర్ర శశికళ స్వగ్రామం (నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం) దుగ్గెపల్లి. సొంతంగా తయారు చేసుకున్న వర్మీ కల్చర్‌తో బత్తాయి తోటను చీడపీడల నుంచి కాపాడుకోగలగటం ఆమెను దృఢచిత్తంతో సేంద్రియ వ్యవసాయం వైపు తొలి అడుగులు వేయించాయి. సొంతంగా తయారు చేసుకునే వర్మీ కంపోస్టుకు అనేక జీవన ఎరువులు కలిపి తయారు చేసిన ‘వర్మీ కల్చర్’ను ప్రధానంగా శశికళ ఉపయోగిస్తున్నారు. దీనితోనే వరి, బత్తాయి, పశుగ్రాసం తదితర పంటలతో పాటు నర్సరీ మొక్కలను సాగు చేస్తున్నారు. వర్మీ కల్చర్‌ను ఇతర రైతులకూ విక్రయిస్తూ ఆదాయం గడిస్తున్నారు. – నాతి రమేష్, సాక్షి, త్రిపురారం, నల్లగొండ జిల్లా వరి.. రెండేళ్లకో పంట! తనకున్న వనరులను ప్రణాళికాబద్ధంగా ఉపయోగిస్తూ ముందడుగు వెయ్యటం శశికళ సేద్యం ప్రత్యేకత. సొంత భూమి 18.5 ఎకరాలకు గాను 6 ఎకరాల్లో బత్తాయి, 5 ఎకరాల్లో వరి పంట, 2 ఎకరాల్లో సీతాఫలం తోట సాగు చేస్తున్నారు. 2 ఎకరాల్లో దేశీ జాతుల గోశాలను ఏర్పాటు చేసి.. వర్మీ కల్చర్ ఉత్పత్తి చేస్తున్నారు. పుణేలో శిక్షణ పొంది 3.5 ఎకరాల్లో మూడేళ్లుగా నర్సరీని నిర్వహిస్తూ.. లాండ్స్కేప్ కన్సల్టెంట్‌గా ఎదుగుతున్నారు. అనుదినం 20 మంది మహిళా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని బియ్యం చేసి నేరుగా హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని పరిచయస్తులకు కిలో రూ. 80 చొప్పున అమ్ముతున్నారు. ఒక సీజన్లో పండించిన ధాన్యం నిల్వచేసి రెండేళ్లపాటు బియ్యం విక్రయిస్తుంటారు. రెండేళ్లకు ఒక సీజన్లో మాత్రమే వరి పండిస్తారు. ఉదా.. ప్రస్తుత వానాకాలంలో 5 ఎకరాల్లో 5204 సన్న రకం వరి పంటను సాగు చేస్తున్నారు. యాసంగిలో గానీ, వచ్చే ఏడాది రెండు సీజన్లలో గానీ వరి పండించరు. ఈ మూడు సీజన్లలో తమ ఆవుల కోసం పశుగ్రాసం పండిస్తారు. మార్కెట్ అవసరం మేరకు ఏ పంటైనా పండించటం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని శశికళ అనుభవపూర్వకంగా చెప్తున్నారు. వరి పంటకు దుక్కి దశలో ఓ సారి, చిరు పొట్ట దశలో మరోసారి వర్మీ కల్చర్‌ను వేస్తున్నారు. దీంతో పాటు ద్రవరూప ఎరువు వర్మీవాష్‌ను పైప్లైన్ల ద్వారా అందిస్తున్నారు. వర్మీ కల్చర్ ప్రొడక్ట్ ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తున్నదన్నారు. 70 కిలోల ధాన్యం బస్తాలు ఎకరానికి 35 వరకు పండుతాయన్నారు. పూర్తిస్థాయి శ్రద్ధతో 3 దఫాలు వర్మీకల్చర్, 4 దఫాలు పంచగవ్య వాడటం ద్వారా శ్రీవరిలో ఎకరానికి 55 బస్తాల ధాన్యం దిగుబడి(2008లో) సాధించిన అనుభవం ఆమెది. ప్రస్తుతం నర్సరీ, లాండ్‌స్కేపింగ్ రంగంలోకి అడుగుపెట్టడం వల్ల వరి సాగుపై అంతగా శ్రద్ధ చూపలేకపోతున్నామన్నారు. 6 ఎకరాల్లో బత్తాయి మొక్కలు నాటి మూడేళ్లయ్యింది. ఏడాదికి రెండుసార్లు వర్మీకల్చర్, హ్యూమిక్ యాసిడ్‌ను వాడుతున్నారు. వచ్చే ఏడాది పంట కాపు వస్తుంది. 2 ఎకరాల్లో రెండేళ్ల క్రితం సీతాఫలం తోటను సాగు చేస్తున్నారు. ఏడాదికి రెండు సార్లు వర్మికల్చర్, హ్యూమిక్ యాసిడ్‌ను వాడుతున్నారు. కాపు మొదలవుతోంది. ఏటా 100 టన్నుల వర్మీ కల్చర్ 2 ఎకరాల్లో ఏర్పాటైన గోశాలలో 45 దేశీ జాతుల ఆవులు, 25 ఎద్దులు 7 లేగదూడలు ఉన్నాయి. పేడ, మూత్రం, చేపల చెరువు వ్యర్థ జలాలను వర్మీ కల్చర్ ఉత్పత్తికి వాడుతున్నారు. ఏడాదికి సుమారు 100 టన్నుల వర్మీ కల్చర్‌ను తయారు చేస్తున్నారు. వర్మీ కల్చర్‌ను స్వంత వ్యవసాయానికి వినయోగిస్తూ ఇతర రైతులకు కిలో రూ. 15 చొప్పున విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. 450 రకాల మొక్కల ఉత్పత్తి పుణే వెళ్లి 20 రోజులు శిక్షణ పొందిన తర్వాత శశికళ తన వ్యవసాయ క్షేత్రంలోనే 3.5 ఎకరాల్లో నర్సరీని ఏర్పాటు చేశారు. లాండ్‌స్కేపింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తూ సమస్యలను అధిగమిస్తూ అభివృద్ధి సాధిస్తున్నారు. ఇన్డోర్, అవుట్ డోర్, బోన్సాయ్ మొక్కలు.. అంటుకట్టిన పండ్లు, పూల మొక్కలు సుమారు 450 రకాల మొక్కలు ఉన్నాయి. కొన్ని రకాల మొక్కలను పూణె, కోల్కత్తా, బెంగుళూరు నుంచి తెప్పిస్తున్నారు. నిమ్మ, నారింజ, ఉసిరి, బత్తాయి అంటు మొక్కలను, ఎవెన్యూ ప్లాంటేషన్‌కు వాడే రకరకాల మొక్కలను సొంతంగా ఉత్పత్తి చేస్తున్నారు. నర్సరీలో పెంచిన మొక్కలను స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపల్ ఆఫీసులకు విక్రయిస్తున్నారు. ప్రైవేటు గృహాల్లో లాండ్‌స్కేపింగ్‌కు వినియో విక్రయిస్తూ శశికళ ఆదాయం పొందుతున్నారు. సేంద్రియ వ్యవసాయంలో నిలదొక్కుకోవడంతో పాటు నర్సరీ రైతుగా, లాండ్స్కేప్ నిపుణురాలిగా ఎదుగుతున్న శశికళ మహిళా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తీరికలేని పనంటే ఇష్టం..! తీరిక లేని పనిలో నిమగ్నం కావటం అంటే ఇష్టం. పరిగెట్టి సంపాయించాలని కాదు. స్వతంత్ర జీవనం పట్ల, పచ్చదనం పట్ల మనసులో ఉన్న ఇష్టం కొద్దీ నర్సరీ–లాండ్‌స్కేపింగ్ రంగంలోకి అడుగుపెట్టాను. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే ఈ రంగం పుంజుకుంటున్నది. అమ్ముడుపోకుండా మిగిలిన మొక్కలను పెద్ద (21 ఇంచ్‌ల) కవర్లలోకి మార్చి తర్వాత నెమ్మదిగా ఎక్కువ ధరకు అమ్ముతున్నాను. 20 మందికి పనికల్పించాను. వ్యవస్థ సజావుగా నడిచే అంత ఆదాయం అయితే వస్తోంది. వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. సేంద్రియ వ్యవసాయంలో ఖర్చులు అదుపు చేసుకుంటేనే మంచి ఆదాయం వస్తుంది. ఒకే పంటపై ఆధారపడకుండా నర్సరీ ప్రారంభించాను. కష్టమైనా నష్టమైనా వ్యవసాయంలోనే నాకు సంతృప్తి. అమ్మానాన్న, బాబు సపోర్ట్ ఉండటంతో ఒంటరి మహిళనైనా పట్టుదలతో జీవన పోరాటం సాగిస్తున్నాను. పురుషులకు లేని సమస్యలు మహిళా రైతులను ఇంటాబయటా ఇబ్బంది పెడుతుంటాయి. తప్పదు. ఎదుర్కోవాల్సిందే! – కర్ర శశికళ (91824 43048), సేంద్రియ రైతు, లాండ్‌స్కేపింగ్ కన్సల్టెంట్, దుగ్గెపల్లి, త్రిపురారం మం., నల్లగొండ జిల్లా చదవండి: Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా.. ఎకరంలో కూరగాయల పందిరి సాగు.. ఏడాదికి లక్ష వరకు ఆదాయం! ఇక సోరకాయతో నెలలో 50 వేల వరకు.. -
అబ్బ నీ కమ్మని దబ్బ..తక్కువ పెట్టుబడితో అదిరిపోయే ఆదాయం!
సీతంపేట(పార్వతిపురం మన్యం): మన్యంలో పుల్లదబ్బ సీజన్ ఆరంభమైంది. ఈ ఏడాది దిగుబడి పెరగడంతో మైదాన ప్రాంతాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అంతగా పెట్టుబడులు అక్కర్లేక పోవడంతో భామిని, సీతంపేట ఏజెన్సీలో సుమారు 2 వందల ఎకరాల వరకు పంటను కొండపోడు వ్యవసాయంలో గిరిజనరైతులు పండిస్తారు. అక్కడక్కడ పోడులో వీటిని వేస్తారు. సుమారు 100 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా. కావిడ దబ్బ రూ. 200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నామని గిరిజనులు తెలిపారు. గతేడాది ఇదేసీజన్లో ఒక్కో కావిడి ఇవే ధరలకు అమ్మేవారమని గిరిజనులు చెబుతున్నారు. హడ్డుబంగి, సోమగండి, గొయిది, శంభాం, కుశిమి, పెదరామ తదితర పంచాయతీల పరిధిలో దబ్బ ఎక్కువగా పండుతుంది. వారపు సంతల్లో విక్రయాలు ఒక్కో పుల్ల దబ్బ పండు మైదాన ప్రాంతాల్లో ఒక రూపాయికి విడిగా విక్రయిస్తారు. ఇక్కడ ఒక్కో పండు అర్ధరూపాయికి సరాసరి కొనుగోలు చేసిన వ్యాపారులు పట్టణాల్లో కిలోల వంతున విక్రయిస్తారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒరిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారు. సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, గురువారం దోనుబాయిలో కుశిమి, పొల్ల గ్రామాల్లో శనివారం వారపు సంతలకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు వ్యాపారులు నేరుగా గ్రామాలకే వెళ్లి ఖరీదు చేస్తున్నారు. పుల్లదబ్బ ఎక్కువగా పచ్చళ్లు తయారు చేసే చిన్నతరహా కంపెనీలకు విక్రయిస్తామని వ్యాపారులు చెబుతూ గిరిజన రైతులు నిర్ణయించిన ధరలు కాకుండా సిండికేట్‌గా మారి ధర నిర్ణయిస్తారు. దీంతో వారు చెప్పిన ధరలకు గిరిజనులు విక్రయించాల్సి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో గిరిజనులు ముందుగా వ్యాపారుల నుంచి అడ్వాన్స్‌లు తీసుకుంటారు. పంట పక్వానికి వచ్చే సమయంలో వ్యాపారులకు సరుకు అప్పగిస్తారు. వ్యాపారుల ధరకే విక్రయిస్తున్నాం పైనాపిల్, సీతాఫలం తర్వాత ఆదాయాన్ని ఇచ్చేది దబ్బ పంట. కావిళ్లలో మోసుకుని తీసుకువస్తాం. వ్యాపారులు నిర్ణయించిన ధరకు అమ్మకాలు చేస్తున్నాం. – ఎస్.రైకన్న, అక్కన్నగూడ పంట దిగుబడి బాగుంది ఈ సంవత్సరం పంట దిగుబడి బాగుంది: కొండపోడు వ్యవసాయంలో పండిస్తాం కాబట్టి సేకరణ కష్టంగా ఉంటుంది. ఈ సీజన్ వచ్చేనెల వరకు ఉంటుంది. ఒడిశా వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. – ఎస్.ఎల్లంగో, మెట్టుగూడ చదవండి: ఒకేసారి డబుల్ డిగ్రీలు.. యూజీసీ మార్గదర్శకాలు ఇవే.. -
Sagubadi: లాభాల బుట్టలో రైతు.. బత్తాయి కాయలకు తాటాకు బుట్టలు తొడిగి!
తాటాకు బుట్టలు బత్తాయి కాయలకు చుట్టడం, రసాయనిక ఎరువులకు బదులు చివికిన కోళ్ల పెంటను ఎరువుగా వేయటం ద్వారా బత్తాయి సాగులో యువ రైతు కడసాని రవీందర్‌రెడ్డి బహుళ ప్రయోజనాలు పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలోని తోపుచర్ల గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి మూడు ఎకరాల్లో బత్తాయి సాగు చేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి రసాయనిక ఎరువులు వాడి భూమి నిస్సారమై పంట దిగుబడి తగ్గిపోయింది. దీంతో రవీందర్ రెడ్డి రసాయనిక ఎరువుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేసి చివికిన కోళ్ల పెంటను ఎరువుగా వాడుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. పిందె దశ నుంచే చీడపీడల బారి నుంచి పంటను కాపాడేందుకు అనేక రకాల రసాయనిక పురుగు మందులను బత్తాయి రైతులు పిచికారీ చేస్తుంటారు. రవీందర్ రెడ్డి మందుల జోలికి పోకుండా తాటాకు బుట్టలను కాయలకు తొడుగుతున్నారు. తద్వారా పేనుబంక, మంగు, దోమ తదితర చీడపీడల నుంచి కాయలను కాపాడుకోగలుగుతున్నారు. కాయ సైజు పెరగటం, బంగారు పసుపు రంగులోకి మారటం వల్ల కొనుగోలుదారులు ఈ కాయలను ఇష్టపడి అధిక ధర చెల్లించడానికి సిద్ధపడుతున్నారు. ఇలా చేస్తే అధిక లాభాలు! బత్తాయి రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని మాడుగులపల్లి ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి సూచిస్తున్నారు. సేంద్రియ సాగులోకి మళ్లటంతో పాటు కాయలకు తాటాకు బుట్టలు తొడిగే పద్ధతిని ఆచరిస్తే నాణ్యమైన దిగుబడులతో పాటు అధిక లాభాలు సాధించవచ్చన్నారు. మాడుగులపల్లి నుంచి బత్తాయిలను తూర్పుగోదావరి జిల్లాలో మార్కెట్లకు తరలిస్తుంటారు. అక్కడ కాయ రూ. 20–25లకు అమ్ముతున్నట్లు సమాచారం. బత్తాయి కాయలకు తొడిగే తాటాకు బుట్టలను సైతం రాజమండ్రి నుంచి తెప్పిస్తున్నారు. బుట్ట ఖరీదు రూ.5. రవాణా, కూలి ఖర్చులతో కలిపి బుట్టకు మొత్తం రూ.8 ఖర్చవుతున్నదని రవీందర్ రెడ్డి చెబుతున్నారు. వేములపల్లి మండలంలోని మొల్కపట్నంలో కూడా మరో ఇద్దరు బత్తాయి రైతులు తాటాకు బుట్టలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. 20–22 టన్నుల దిగుబడికి అవకాశం గతంలో రసాయనిక ఎరువుల వాడినప్పుడు ఎకరానికి బత్తాయి పండ్ల దిగుబడి 13–15 టన్నుల వరకు వచ్చేది. చివికిన కోళ్ల పెంటను ఎరువుగా వేయటం వల్ల కాయల సంఖ్యతో పాటు కాయ సైజు గణనీయంగా పెరిగింది. ఈసారి ఎకరానికి 20–22 టన్నుల దిగుబడి వస్తుందనుకుంటున్నా. తాటాకు బుట్టల వాడకం వల్ల తెగుళ్లు సోకటం లేదు. కాయ బంగారు పసుపు రంగులోకి మారి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నది. – కడసాని రవీందర్ రెడ్డి, బత్తాయి రైతు, ఫోన్: 9392990998, తోపుచర్ల, మాడుగులపల్లి మం. నల్లగొండ జిల్లా – పండుగ శ్రీనివాస్, సాక్షి, మాడుగులపల్లి, నల్లగొండ జిల్లా చదవండి: Maharashtra: ఇక నల్లేరుపై బండి నడకే!.. బండి లాగే ఎద్దుల కష్టం తగ్గించే ఆవిష్కరణ -
Health Tips: ఉప్పు, కారంతో పాటు ఆ అలవాట్లూ తగ్గించండి! లేదంటే!
హైపర్ టెన్షన్‌తో దాదాపు 10 శాతానికి మించి గుండె జబ్బుకు గురవుతున్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. హైపర్‌టెన్షన్‌తో ఉన్నవారిలో పది శాతం మంది పక్షవాతం బారిన పడగా మరో అయిదు శాతం కిడ్నీసమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ టెన్షన్ వల్ల కొందరికీ బ్రెయిన్ స్టోక్ కూడా వచ్చే ప్రమాదముంది. ఇటీవల కాలంలో బ్రెయిన్ స్టోక్, గుండెకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. హైపర్‌టెన్షన్ ఉన్నవారికీ కిడ్నీ రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడుతాయి. దీనివల్ల కిడ్నీ దెబ్బతిని పని వేయకుండా పోయే ప్రమాదముంది. అదే విధంగా రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడడం వల్ల గుండె, బ్రెయిన్ స్ట్రోక్‌లు వస్తున్నాయి. చిత్రం ఏమిటంటే, చాలామందికి తమకు హైపర్ టెన్షన్ ఉన్నట్లు కూడా తెలియకపోవడం. అయితే హైపర్ టెన్షన్‌ను గుర్తించగలిగితే దాని వల్ల కలగబోయే ముప్పును నివారించుకోవచ్చు. గుర్తించటం ఎలా? బీపీ తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు ముందు తలదిమ్ము మొదలవుతుంది. తర్వాత వివరీతమైన తలనొప్పి, నిద్రలేమి, చూపు మసక బారటం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వాన తీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి. రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►ప్రతిరోజూ తవ్పని నరిగ్గా 30 నుంచి 45 నిమిషాలు నడవాలి ►అస్తమానం కుర్చీకే అతుక్కుని కూర్చోకుండా ప్రతి అరగంటకు ఒకసారి లేచి నాలుగు అడుగులు వేస్తుండాలి. ►నిత్యం వ్యాయామం, యోగా చేయాలి. ►చిన్న చిన్న విషయాలకు టెన్షన్‌కు గురికావద్దు ►ఉదయం, సాయంత్రాల్లో మంచి వాతావరణంలో చక్కటి సంగీతం వినడం మంచిది. ►టెన్షన్‌కు గురవుతున్న నమయంలో నచ్చిన వారితో మాట్లాడడం, మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల టెన్షన్ దూరం అవుతుంది. ►ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏది తగ్గించాలి? ►ఆహారంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా జూగ్రత్త వహించాలి. ►బత్తాయి, కమలాలు, ద్రాక్ష వంటి పండ్లు ఎక్కువగా తీనుకోవాలి. ►ఆహారంలో పొటాషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ►ఎర్రటి మాంసం, మీగడ, వెన్న, నూనె వంటి వాటికీ దూరంగా ఉండాలి. ►బయటి ఆహార పదార్థాల జోలికి వెళ్లరాదు. ►బరువు పెరగకుండా చూనుకోవాలి. హైపర్‌టెన్షన్ ఉన్నవారు ఏమి చేయాలి? ►తరచు వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. ►మందుల వాడకాన్ని ఒకరోజు కూడా నిలిపేయొద్దు. ►ఆరోగ్య పరిస్థితిని బట్టి మందుల వాడకాన్ని మార్చుకోవాలి. ►షుగర్ , గుండె , థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ►కొలస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ►మద్యపానం, సిగరెట్లను పూర్తిగా మానేయాలి. ►కారం, ఉప్పు తగ్గించాలి. చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! High Vitamin D Rich Foods: ట్యూనా, సాల్మన్, గుడ్లు, పాలు.. వీటిలో విటమిన్- డి పుష్కలం! -
పైనాపిల్ – బత్తాయి.. పోషకాల జ్యూస్!
కావలసినవి: బత్తాయిలు – మూడు, పైనాపిల్ ముక్కలు – కప్పు, పంచదార – టేబుల్ స్పూను, ఐస్‌క్యూబ్స్ – ఐదు. తయారీ విధానం: ►బత్తాయిలను రెండు ముక్కలుగా కట్ చేసి జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ►పైనాపిల్ ముక్కలు, పంచదారను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ► పైనాపిల్ ముక్కలు గ్రైండ్ అయ్యాక బత్తాయి జ్యూస్‌ను వేసి మరోసారి గ్రైండ్ చేసి వడగట్టాలి. ► వడగట్టిన జ్యూస్‌ను గ్లాసులో పోసి ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. పైనాపిల్-బత్తాయి జ్యూస్ పోషకాల విలువలు.. ►పైనాపిల్, బత్తాయిలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ►పుల్లగా, తియ్యగా ఉండే ఈ జ్యూస్ దాహం తీరుస్తుంది. ► జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేయడమేగాక, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ► డీటాక్సింగ్ ఏజెంట్‌గా పనిచేసి ఒత్తిడి, కాలుష్య ప్రభావాలను తగ్గిస్తుంది. ►వర్క్అవుట్లు చేసేవారికి ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది. ►దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లను రానివ్వవు. ►చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ► జుట్టుకి పోషకాలనందించి వెంట్రుకలు చిట్లకుండా చేస్తుంది. -
ఇంట్లోనే ఇలా జ్యూస్ చేసుకోండి.. దీని ధర రూ.8,909!
కాస్త శక్తి రావాలన్నా, దాహం తీరాలన్నా.. ఏమాత్రం ఆరోగ్యం బాగోకున్నా.. ముందుగా గుర్తుకొచ్చేవి కమలా, బత్తాయి పళ్ల జ్యూసులే. ఆరోగ్యంపై పలు జాగ్రత్తలు పెరుగుతున్న ఈ తరుణంలో.. కూల్‌డ్రింక్స్ కంటే ఇలాంటి జ్యూసులకే ప్రాధాన్యం పెరిగింది. అయితే ఇంట్లో చిన్న హ్యాండ్ జ్యూసర్‌తో వీటి రసం తీసుకోవడం శ్రమతో కూడిన పని అయిపోతుంది. దాంతో జ్యూస్ కార్నర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటి సమస్యకు చెక్ పెడుతుంది ఈ డివైజ్. దీనిలో కమలా, బత్తాయి, దబ్బపళ్ల వంటి వాటిని.. అడ్డంగా కట్ చేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ స్ట్రెంత్ మోటరైజ్డ్ ప్రెస్ టెక్నాలజీ కలిగిన ఈ జ్యూసర్.. చేతికి శ్రమ లేకుండా సాఫ్ట్ గ్రిప్, నాన్–స్లిప్ హ్యాండిల్ కలిగి ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ డివైజ్‌లో సుదీర్ఘ మన్నిక కలిగిన 2 ఫిల్టర్స్ ఉంటాయి. డివైజ్‌కి సంబంధించిని జ్యూస్ ట్యాప్ దగ్గర లాక్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తేనే పైన ఉన్న ట్రాన్స్పరెంట్ పాత్రలో నిండిన జ్యూస్ కింద ఉండే గ్లాసులోకి వచ్చి చేరుతుంది. ధర : 118 డాలర్లు (రూ.8,909) చదవండి: Ragi Java Health Benefits: రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగే అలవాటు ఉందా.. అయితే -
Health Tips: రోజూ ఒక్క గ్లాస్ మోసంబి జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో..
Amazing Mosambi Juice Benefits for Skin, Hair and Health: మార్కెట్లో సులభంగా, తక్కువ ధరలో లభించే వాటిలో మోసంబి ఒకటి. ఇది సిట్రస్ పండు. దీనిని తీపి సున్నం అని కూడా అంటారు. ఇండోనేషియా నుంచి చైనా వరకు అనేక ప్రాంతాల్లో మూలాలను కలిగి ఉంది. మోసంబిలో సాధారణ నిమ్మకాయల కంటే కూడా తక్కువ మోతాదులో యాసిడ్ ఉంటుంది. విత్తనాలు, మందపాటి తొక్క కారణంగా పండు రూపంలో తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. జ్యూస్‌గా మాత్రం మంచి రుచిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో మోసంబి రసం ఎంత అలసిపోయిఉన్నా తక్షణమే రీఫ్రెష్ చేస్తుంది. మోసంబిలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం వంటి శరీరానికి ఉపయోగపడే అనేక మూలకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే మోసంబి ఆరోగ్య ప్రయోజనాలను మనం పరిశీలించనట్లయితే.. విటమిన్ సి యొక్క పవర్ హౌస్: ఇది నీటిలో కరిగే విటమిన్. దీనిని మనం శరీరంలో నిల్వ చేయలేము. అందువల్ల ప్రతిరోజూ మనకు ఆహారం ద్వారా అవసరం. రోజూవారీ మోతాదుగా విటమిన్ సీ పొందడానికి మోసంబి రసం గొప్ప మార్గం. ఇది శరీరంలోని అనేక జీవక్రియలకు అవసరం. మానవుని ఆరోగ్యంలో సమగ్ర పాత్ర పోషిస్తుంది. చదవండి: (Feet Care Tips: విటమిన్ ‘ఈ’ క్యాప్య్సూల్స్తో ఇలా అందంగా..) కళ్లకు మంచిది: యాంటి ఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా.. మోసంబి జ్యూస్ కళ్లను ఇన్ఫెక్షన్ల నుంచి, కంటి శుక్లం అభివృద్ధి కాకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్: క్రమం తప్పకుండా మోసంబి జ్యూస్ తాగడం వల్ల బలహీనత, అలసట తగ్గుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చదవండి: (Health Tips: రోజూ గ్లాసు పళ్ల రసం చక్కెర వేయకుండా తాగితే..) క్యాన్సర్ నిరోధక లక్షణాలు: మోసంబిలో ఉండే లిమోనాయిడ్లు వివిధ రకాల క్యాన్సర్లతో పోరాడటానికి సహాయపడతాయి. గ్లూకోజ్ అనే చక్కెర అణువుతో లిమోనాయిడ్లు జతచేయబడి సులభంగా జీర్ణమవుతాయి. అందమైన చర్మం కోసం: మోసంబి జ్యూస్‌లో ఉండే విటమిన్లు, మినరల్స్ అందమైన, ఆరోగ్యకరమైన చర్మానికి ఎంతగానో ఉపయోగపడాయి. ఆరోగ్యకరమైన మెరుస్తున్న చర్మానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్ విటమిన్ సీ ఇందులో పుష్కలంగా ఉంటుంది. మచ్చలను తొలగిస్తుంది: మోసంబి జ్యూస్‌లో తేలికపాటి బ్లీచింగ్, క్లెన్సింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి మచ్చలు, మొటిమలను తొలగించడంలో సహాయపడతాయి. చర్మం ముడతలు తగ్గడానికి: మోసంబి రసంలో వృద్ధాప్య నిరోధక లక్షణాలు ఉన్నాయి. చర్మం ముడతలు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన కొల్లాజెన్ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. శరీరానికి దృఢత్వాన్ని అందిస్తుంది. మనిషి కుంగిపోకుండా చేస్తుంది. జుట్టును బలపరుస్తుంది: మోసంబి జ్యూస్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది . మీరు ఎల్లప్పుడూ కోరుకునే మెరుపును ఇస్తుంది. -
హైదరాబాద్‌లో జ్యూస్ అమ్ముతున్న సోనూసూద్.. వీడియో వైరల్
సోనూసూద్.. ఇతని గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సాయం అనే పదం ఎక్కడ విన్న ఈ పేరే వినిపిస్తోంది. కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న ఎంతో మందిని ఆదుకున్న సోనూసూద్.. కొద్ది రోజుల నుంచి కొత్త అవతారం ఎత్తి మరిన్ని బాధ్యతలను నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు మద్దతు ఇస్తున్నాడు. సైకిల్‌పై గుడ్లు, బ్రెడ్ తదితర తినుబంఢారాలను పెట్టుకొని అమ్మడం నుంచి పంజాబీ దాబా ద్వారా తందూరి రొట్టెలు అమ్మడం ప్రారంభించాడు. సోనూసూద్ దా పంజాబీ ధాబా.. ఇక్కడ దాల్.. రోటీ ఉచితమే’ అంటూ ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. ఇటీవలే రిక్షా మీద గడ్డి తీసుకుని వెళ్తున్న ఓ వ్యక్తి ఆయన కంట పడటంతో వెంటనే కారు దిగి స్వయంగా తనే రిక్షా తొక్కుకుంటూ వెళ్లాడు. ఇలా రోజుకొక చిర వ్యాపారులకు సోనూసూద్ అండగా నిలుస్తున్నాడు. ఇక తాజాగా సోనూ కొత్త అవతారం ఎత్తాడు. ఈసారి జ్యూస్ షాప్ ఓనర్‌గా మారిపోయాడు. ఈ క్రమంలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్3 లో రోడ్డు పక్కన ఉన్న జ్యూస్ షాపు వద్దకు వచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఆ షాపు నడిపే వ్యక్తితో సరదాగా మాట్లాడాడు. ఇక్కడ బత్తాయి జ్యూస్ ఫ్రీ అంటూ స్వయంగా జ్యూస్ తయారు చేసి అమ్మాడు. కొద్దిసేపు అక్కడే ఉండి చిరు వ్యాపారులను ఆదుకోవాలని కోరాడు. దానికి చెందిన వీడియోను ట్విటర్లో షేర్చేశాడు. ఇలా తనదైన స్టైల్లో చిరు వ్యాపారులకు సోనూ సపోర్టు చేస్తుండటంతో ఆయన చేసిన ఈ పనిపై మరోసారి సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. -
పెరిగిన బత్తాయి ధర..!
గుర్రంపోడు : బత్తాయి రైతులకు మంచిరోజులొచ్చాయి. గతంలో పంట ఉంటే ధర లేని..ధర ఉంటే దిగుబడి రాని పరిస్థితులు ఉండేవి. వర్షాభావంతో తగ్గిన తోటల సాగు..పడిపోయిన దిగుబడులతో మార్కెట్లో ధర కూడా దోబూచులాడింది. దీంతో నెల క్రితమే చాలా వరకు బత్తాయి తోటల్లో కాయ కోతలు ముగిసాయి. దీంతో ఇప్పటి వరకు కాయలు కోయని పది నుంచి 20శాతం తోటలకు మంచి ధర పలుకుతుంది. దళారులు తోటల వద్దకు వచ్చి గతంలో ఎన్నడూ లేనంతగా టన్నుకు రూ25 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. నానా కష్టాలు పడి తోటలను కాపాడుకున్న తమకు ప్రస్తుత ధర ఎంతో ఊరటనిస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టన్నుకు రూ.పదివేల లోపు ఉన్న ధర ప్రస్తుతం పెరగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా బత్తాయి మార్కెట్ ప్రధాన కేంద్రాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లోనూ వర్షాకాలం సీజన్లో కురిసే వర్షాలపై మార్కెట్ ధర ఆధారపడి ఉంటుంది. ఐతే ఎన్నడూ లేనంతగా ఆగస్టులో ఆయా నగరాల్లో వర్షాలు లేక మన బత్తాయి రైతులకు కలిసొచ్చింది. సెప్టెంబర్‌లో టన్నుకు రూ.30 వేల వరకు ఉండవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
మోసంబీ.. కేజీ!
నిర్మల్: మోసంబీ పరి మాణం, బరువు ఎంత ఉంటుందంటే ..? మీరు ఏమని చెబుతారు.. మామూలుగా అయితే దాని పరిమాణం ఆపిల్ సైజులోనో.. లేక దానిమ్మ సైజులోనో ఉంటుందని, బరువు మహా అయితే పావుకిలో నుంచి ఆపై ఉంటుందని చెబుతారు. కానీ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో ఉపాధ్యాయుడు ఫరీద్ ఇంటి ఆవరణలో ఉన్న మోసంబీ చెట్టుకు కొమ్మలు వంగిపోయేలా కిలోకు పైనే బరువున్న పెద్దపెద్ద పండ్లు కాశాయి. దీంతో వాటిని తిలకించేందుకు పలువురు ఆయన ఇంటికి వస్తున్నారు. ఈ పండ్లు రెండు నెలల్లోనే పెద్దగా తయారవుతున్నాయని, ఈ మొక్కను నర్సరీ నుంచి తీసుకొచ్చానని ఫరీద్ తెలిపారు.