Electric Citrus Juicer: Know How It Works, Check Price Details - Sakshi
Sakshi News home page

Electric Citrus Juicer: ఇంట్లోనే ఇలా జ్యూస్‌ చేసుకోండి.. దీని ధర రూ.8,909!

Published Mon, Mar 21 2022 2:25 PM | Last Updated on Mon, Mar 21 2022 3:22 PM

Electric Citrus Juicer: Know How It Works Price Check Details - Sakshi

కాస్త శక్తి రావాలన్నా, దాహం తీరాలన్నా.. ఏమాత్రం ఆరోగ్యం బాగోకున్నా.. ముందుగా గుర్తుకొచ్చేవి కమలా, బత్తాయి పళ్ల జ్యూసులే. ఆరోగ్యంపై పలు జాగ్రత్తలు పెరుగుతున్న ఈ తరుణంలో.. కూల్‌డ్రింక్స్‌ కంటే ఇలాంటి జ్యూసులకే ప్రాధాన్యం పెరిగింది. అయితే ఇంట్లో చిన్న హ్యాండ్‌ జ్యూసర్‌తో వీటి రసం తీసుకోవడం శ్రమతో కూడిన పని అయిపోతుంది. దాంతో జ్యూస్‌ కార్నర్‌ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

అలాంటి సమస్యకు చెక్‌ పెడుతుంది ఈ డివైజ్‌. దీనిలో కమలా, బత్తాయి, దబ్బపళ్ల వంటి వాటిని.. అడ్డంగా కట్‌ చేసుకుని జ్యూస్‌ చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్‌ స్ట్రెంత్‌ మోటరైజ్డ్‌ ప్రెస్‌ టెక్నాలజీ కలిగిన ఈ జ్యూసర్‌.. చేతికి శ్రమ లేకుండా సాఫ్ట్‌ గ్రిప్, నాన్‌–స్లిప్‌ హ్యాండిల్‌ కలిగి ఉంటుంది. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో రూపొందిన ఈ డివైజ్‌లో సుదీర్ఘ మన్నిక కలిగిన 2 ఫిల్టర్స్‌ ఉంటాయి. డివైజ్‌కి సంబంధించిని జ్యూస్‌ ట్యాప్‌ దగ్గర లాక్‌ ఉంటుంది. అది ఓపెన్‌ చేస్తేనే పైన ఉన్న ట్రాన్స్‌పరెంట్‌ పాత్రలో నిండిన జ్యూస్‌ కింద ఉండే గ్లాసులోకి వచ్చి చేరుతుంది.
ధర : 118 డాలర్లు  (రూ.8,909)

చదవండి: Ragi Java Health Benefits: రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగే అలవాటు ఉందా.. అయితే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement