![మోసంబీ.. కేజీ!](/styles/webp/s3/article_images/2017/09/2/41406746588_625x300.jpg.webp?itok=NXOJXM81)
మోసంబీ.. కేజీ!
నిర్మల్: మోసంబీ పరి మాణం, బరువు ఎంత ఉంటుందంటే ..? మీరు ఏమని చెబుతారు.. మామూలుగా అయితే దాని పరిమాణం ఆపిల్ సైజులోనో.. లేక దానిమ్మ సైజులోనో ఉంటుందని, బరువు మహా అయితే పావుకిలో నుంచి ఆపై ఉంటుందని చెబుతారు.
కానీ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో ఉపాధ్యాయుడు ఫరీద్ ఇంటి ఆవరణలో ఉన్న మోసంబీ చెట్టుకు కొమ్మలు వంగిపోయేలా కిలోకు పైనే బరువున్న పెద్దపెద్ద పండ్లు కాశాయి. దీంతో వాటిని తిలకించేందుకు పలువురు ఆయన ఇంటికి వస్తున్నారు. ఈ పండ్లు రెండు నెలల్లోనే పెద్దగా తయారవుతున్నాయని, ఈ మొక్కను నర్సరీ నుంచి తీసుకొచ్చానని ఫరీద్ తెలిపారు.