కావలసినవి: బత్తాయిలు – మూడు, పైనాపిల్ ముక్కలు – కప్పు, పంచదార – టేబుల్ స్పూను, ఐస్‌క్యూబ్స్ – ఐదు.
తయారీ విధానం:
►బత్తాయిలను రెండు ముక్కలుగా కట్ చేసి జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి.
►పైనాపిల్ ముక్కలు, పంచదారను బ్లెండర్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి
► పైనాపిల్ ముక్కలు గ్రైండ్ అయ్యాక బత్తాయి జ్యూస్‌ను వేసి మరోసారి గ్రైండ్ చేసి వడగట్టాలి.
► వడగట్టిన జ్యూస్‌ను గ్లాసులో పోసి ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి.
పైనాపిల్-బత్తాయి జ్యూస్ పోషకాల విలువలు..
►పైనాపిల్, బత్తాయిలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
►పుల్లగా, తియ్యగా ఉండే ఈ జ్యూస్ దాహం తీరుస్తుంది.
► జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేయడమేగాక, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
► డీటాక్సింగ్ ఏజెంట్‌గా పనిచేసి ఒత్తిడి, కాలుష్య ప్రభావాలను తగ్గిస్తుంది.
►వర్క్‌అవుట్‌లు చేసేవారికి ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది.
►దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కంటికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌లను రానివ్వవు.
►చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
► జుట్టుకి పోషకాలనందించి వెంట్రుకలు చిట్లకుండా చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment