
Aamir Khans Lagaan Co-star Parveena Seeks Help: అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో 'లగాన్' ఒకటి. 2001లో విడుదలైన ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది. అంతేకాకుండా ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ మంచి గుర్తింపు వచ్చింది. అయితే కాలం మారుతున్న కొద్దీ పరిస్థితులు మారుతాయి. సినిమా అనే రంగుల ప్రపంచంలో కనిపించేదంత నిజం కాదు. తెర వెనుక ఎన్నో విషాదాలు గూడుకట్టుకుంటాయి. చదవండి: నా మాజీ భార్య ఎవరినైనా ఇష్టపడ్డా నేను సంతోషిస్తా
లగాన్‌లో నటించిన ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పర్వీనా పరిస్థితి కూడా ఇప్పుడు ఇలానే ఉంది. రీసెంట్ గా ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్ రావటం, ఆర్థికంగా చతికిలపడిపోవటం, చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవటంతో ఆమె పరిస్థితి అయోమయంగా ఉంది. దీంతో ఆమె గత్యంతరం లేక నన్ను ఆదుకోవాలంటూ తాజాగా అమీర్ ఖాన్ కి సోషల్ మీడియా వేదికగా మొర పెట్టుకుంది. చిత్ర పరిశ్రమలో తనకు కాస్టింగ్ డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతుంది. (ఖరీదైన కారును వదిలి ఆటోలో ప్రయాణించిన హీరోయిన్)
లగాన్‌తో పాటు ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించిన పర్వీనాకు 2002లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రంగంలోకి దిగి అక్షయ్ కుమార్, సోనూసూద్ లాంటి సెలబ్రిటీల ద్వారా ఆమె వైద్యానికి సాయం అందించారు. అయితే ఆ డబ్బు చికిత్సకే సరిపోయింది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో తనకు సాయం చేయాల్సిందిగా కోరుతుంది. తన పరిస్థితి గురించి అమీర్ ఖాన్‌కు తెలియదని, తెలిస్తే కశ్చితంగా ఏదో ఒక విధంగా సాయం చేసేవాడని తెలిపింది. గతంలో వల్లభ వ్యాస్ అనే నటుడికి బ్రెయిన్ స్ట్రోక్‌తో పక్షవాతానికి గురైనప్పుడు అమీర్ ఖాన్ సాయం చేయడాన్ని గుర్తుచేసింది. (సారికతో కపిల్‌దేవ్ బ్రేకప్ లవ్‌స్టోరీ)
Comments
Please login to add a commentAdd a comment