Lagaan
-
క్రికెట్ నేపథ్యంలో హిట్ కొట్టిన సినిమాలు.. ఈ ఓటీటీలలో చూడొచ్చు
వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్ సత్తా చాటి మరికొన్ని గంటల్లో నేడు ఆస్ట్రేలియాతో ఫైనల్ ఫైట్‌కు రెడీ అయింది. లీగ్ దశలో పరాజయమే లేకుండా విజయ పరంపరతో కొనసాగిన భారత జట్టు.. అదే దూకుడుతో ఫైనల్ మ్యాచ్‌లోనూ వీర విజృంభణతో దూసుకెళ్లి కప్ సాధించాలని కోట్లాది మంది భారతీయులు ఆశిస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా నేటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు విద్యార్థులు, ఉద్యోగులూ, వ్యాపారులూ, సినీ సెలబ్రెటీలు తదితర క్రికెట్ క్రీడాభిమానులంతా సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కొన్ని సూపర్ హిట్ సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు. ఆ సినిమాలో ఏ ఓటీటీలో ఉన్నాయో అని తెగ వెతుకుతున్నారు. సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ 2017లో 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' అనే చిత్రాన్ని జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించారు. భారతీయ త్రిభాషా డాక్యుమెంటరీ స్పోర్ట్స్ చిత్రంగా తెరకెక్కించారు. 200 నాటౌట్ ప్రొడక్షన్స్, కార్నివాల్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రవి భాగ్చంద్కా, శ్రీకాంత్ భాసీ నిర్మించారు . ఈ చిత్రం భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవితంపై రూపొందించిన డాక్యుమెంటరీ.ఇది టెండూల్కర్ క్రికెట్, వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా చూపించారు. అలాగే అతని జీవితంలో ఇంతకు ముందెన్నడూ వినని లేదా చూడని కొన్ని అంశాలను కూడా ఈ చిత్రంలో చూడవచ్చు. ఇందులో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్ కూడా కొన్ని సీన్స్‌లలో కనిపిస్తారు. ఈ చిత్రం చూడాలనుకుంటే సోనీ లైవ్‌లో అందుబాటులో ఉంది. MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ 2016లో MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రం విడుదలైంది. ధోని బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. నీరజ్ పాండే రచించి దర్శకత్వం వహించారు. భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగారూపొందించబడింది. ఈ చిత్రంలో MS ధోనిగా దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించారు , వీరితో పాటు దిశా పటానీ , కియారా అద్వానీ, అనుపమ్ ఖేర్ నటించారు. ఈ చిత్రం ధోని చిన్నప్పటి నుంచి జీవితంలోని అనేక సంఘటనల ద్వారా అతని జీవితాన్ని వివరిస్తుంది. ధోనీ అంగీకారంతో ఈ సినిమా మొదలైంది. 61 దేశాలలో ఈ సినిమా విడుదలైంది. వాణిజ్యపరంగా ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇది 2016లో అత్యధిక వసూళ్లు చేసిన ఐదవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా రూ. 215.48 కోట్లు వసూలు చేసిన ఆరవ భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను చూడాలనుకుంటే.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉచితంగానే చూడొచ్చు. 800 ముత్తయ్య మురళీధరన్ 2023లో తెలుగులో ఈ సినిమా విడుదలైంది. శ్రీలంక స్టార్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా శ్రీదేవి మూవీస్ పై శివలెంక కృష్ణప్రసాద్ దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేశాడు. మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 6న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్స్ తీసిన ఏకైక బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్ ఉన్నారు. అందుకే ఈ చిత్రానికి 800 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. 'ఆజార్' 2016లో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా 'ఆజార్' అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టోనీ డిసౌజా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ద్వారా శోభా కపూర్, ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇమ్రాన్ హష్మీ టైటిల్ రోల్లో సూపర్‌గా మెప్పించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 13 మే 2016న విడుదలైంది . అజార్ జీవితంలో మ్యాచ్ ఫిక్సింగ్, వివాహేతర సంబంధం వంటి అంశాలపై కూడా ఈ చిత్రంలో క్లారిటీ ఇచ్చారు. అజార్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమాలో ఇవే ► నాని నటించిన జెర్సీ ZEE5లో స్ట్రీమింగ్ అవుతుంది. ► గోల్కోండ హైస్కూల్ (సన్‌నెక్ట్స్) ► కౌసల్య కృష్ణమూర్తి (సన్‌నెక్ట్స్) ► విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' (అమెజాన్,డిస్నీ హాట్‌స్టార్) ► నాగచైతన్య 'మజిలీ' (అమెజాన్ ప్రైమ్ వీడియో) ► వెంకటేష్ 'వసంతం' (డిస్నీ హాట్‌స్టార్) ► లగాన్ హిందీ (నెట్‌ఫ్లిక్స్) -
చూపున్న పాట
‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి’ అన్నాడు కవి. పట్టలేని ఆనందంలో, ప్రశంసించడానికి మాటలు దొరకని పరిస్థితుల్లో కూడా కన్నీళ్లు వస్తాయి. మేనుక పౌదెల్ పుట్టు అంధురాలు. మంచి గాయకురాలు. ఇండియన్ ఐడల్ 14 సీజన్లో ‘లగాన్’ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన ‘ఓ పాలన్ హరే’ పాట పాడింది. అద్భుతమైన ఆమె పాట వింటూ జడ్జీలలో ఒకరైన శ్రేయా ఘోషల్ ఏడ్చేసింది. ఈ ఎపిసోడ్ ఇంటర్నెట్లో వైరల్ అయింది. వైరల్ కావడం మాట ఎలా ఉన్నా ‘శ్రేయ ఓవర్‌గా రియాక్ట్ అయ్యారు’ అని కొందరు విమర్శించారు. మరి ఆమె అభిమానులు ఊరుకుంటారా? వాళ్లు ఇలా స్పందించారు...‘రెండు దశాబ్దాలకు పైగా శ్రేయ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో జాతీయ అవార్డ్లు అందుకున్నారు. ఆమెకు ప్రతిభ లేకపోతే ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవారు. ఇలాంటి టాలెంటెడ్ సింగర్ గురించి నెగెటివ్ కామెంట్స్ పెట్టడం తగదు’. -
Independence Day 2023: మేరా భారత్ మహాన్
దేశం అనగానే భారతీయ ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అయిపోతారు. సరైన దేశభక్తి సినిమా వస్తే సూపర్ డూపర్ హిట్ చేసి భావోద్వేగంతో ఊగిపోతారు. బాలీవుడ్లో మంచి మంచి దేశభక్తి సినిమాలు వచ్చాయి. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన 10 దేశభక్తి సినిమాలు.. హకీకత్ (1964): దేశాల మధ్య యుద్ధాలు వస్తే సైనికుల వీరోచిత పోరాటాలు, త్యాగాలు తప్పనిసరి. వాటిని చూపుతూనే యుద్ధాలు ఎలా సగటు సైనికుడి ్రపాణాలు బలిగొంటాయో కూడా చూపిన సినిమా హకీకత్. 1962 నాటి ఇండో చైనా యుద్ధం మీద వచ్చిన ఈ సినిమా అతి తక్కువ మంది భారత సైనిక పటాలం చైనా భారీ సేనతో ఎలా తలపడిందో చూపుతుంది. బల్రాజ్ సహానీ, ధరేంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకు చేతన్ ఆనంద్ దర్శకుడు. కైఫీ ఆజ్మీ రాసిన ప్రఖ్యాత దేశభక్తి గీతం ‘కర్ చలే హమ్ ఫిదా జాన్ ఏ వతన్ సాథియో’ ఇందులోదే. ఉప్కార్ (1967): దేశభక్తి సినిమాలు తీసి ‘మిస్టర్ భరత్’ బిరుదు ΄÷ందిన నటుడు మనోజ్ కుమార్ నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సూచన మేరకు ‘జై జవాన్ జై కిసాన్’ నినాదానికి ఇచ్చిన సినీ రూపం ‘ఉప్కార్’. సైనికులు దేశ సరి హద్దుల వద్ద మాత్రమే సంఘర్షణ చేస్తారు... కాని రైతులు దేశంలో జీవితాంతం సంఘర్షణ చేసి గింజలు పండించి జనం కడుపులు నింపుతారు... వారే నిజమైన హీరోలు అని చెప్పే సినిమా ఇది. ‘ఇస్ దేశ్ కి ధర్తీ ఉగ్లే హీరా మోథీ’ హిట్ గీతం ఇందులోదే. బోర్డర్ (1997): యుద్ధంలో చావు కళ్ల ముందు కదలాడుతుంటే దేశం తప్ప మరేమీ గుర్తు రాక సంతోషంగా బలిదానం ఇచ్చే సైనికుల వీరత్యాగం ఎలా ఉంటుందో ‘బోర్డర్’లో చూడాలి. 1971 నాటి ఇండో పాక్ యుద్ధాన్ని కథాంశంగా తీసుకుని దర్శకుడు జె.పి. దత్తా తీసిన ఈ సినిమా ఒక గొప్ప వార్ మూవీ. సన్ని డియోల్, సునీల్ శెట్టి తదితరులు నటించిన ఈ సినిమాలో సైనికుల జీవితాన్ని వాస్తవికంగా చూపడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. యుద్ధ వ్యూహాలు కూడా ఈ సినిమాలో తెలుస్తాయి. లగాన్ (2001): దేశభక్తికి క్రీడలు జత చేసి గొప్ప సంచలనం సృష్టించిన సినిమా ‘లగాన్’. పన్నుల మీద పన్నులు వేసి దాష్టీకం చేస్తున్న బ్రిటిష్ వారిని చిన్న పల్లెజనం క్రికెట్లో ఓడించడం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు అశుతోష్ గోవారికర్ దర్శకుడు. ఆస్కార్ నామినేషన్ ΄÷ందింది. అద్భుతమైన కథనం, సంగీతం, నటన, భావోద్వేగాలు, ఆటలో ఉండే మలుపులు తోడు కావడంతో ప్రేక్షకులు జేజేలు పలికారు. ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్ (2002): అమర దేశభక్తుడు భగత్ సింగ్ కథను తీసుకుని రాజ్ కుమార్ సంతోషి తీసిన అద్భుతమైన సినిమా ఇది. అజయ్ దేవగణ్– భగత్ సింగ్ పాత్రను పోషించి ప్రేక్షకుల కంట కన్నీరు తెప్పించాడు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్... ఈ ముగ్గురు దేశభక్తులు తమ ఉడుకు నెత్తురుతో దేశం కోసం పోరాడి లేత వయసులో మరణించడం ప్రేక్షకుల మనసు కలచి వేసేలా ఈ సినిమా చూపుతుంది. దేశం కోసం ఎలాంటి స్ఫూర్తితో ఉండాలో తెలుపుతుంది. లక్ష్య (2004): మంచి దేశభక్తి సినిమా మాత్రమే కాదు యువతను లక్ష్యం వైపు నడిపించే సినిమా కూడా. రిలీజైనప్పుడు ప్రేక్షకుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉన్నా ఆ తర్వాత కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. కార్గిల్ వార్‌ను నేపథ్యంగా తీసుకుని గొప్ప సాంకేతిక విలువలతో తీశారు. హృతిక్ రోషన్‌తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. మిలట్రీ వాతావరణం, క్రమశిక్షణ, ధీరత్వం ఈ సినిమాలో పుష్టిగా చూడొచ్చు. స్వదేశ్ (2004): ఈ దేశం నీకేమిచ్చిందని కాదు... ఈ దేశానికి నువ్వేమిచ్చావ్ అని తరచి ప్రశ్నించుకోవాలని నెహ్రూ అన్నారు. ఆ ప్రశ్నకు జవాబు ఈ సినిమా. ఈ దేశంలో పుట్టి పెరిగి చదువుకుని పరాయి దేశానికి వెళ్లి ఆ దేశానికి సేవ చేయడం తప్పు కాదు కానీ మన దేశానికి ఏదైనా చేయాలన్న బాధ్యతను మరువకూడదని ఎంతో గట్టిగా చెప్పింది ‘స్వదేశ్’. షారూక్ ఖాన్ నటించిన ఈ చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకుడు. ఎన్ఆర్ఐల బాధ్యతను నిలదీసిన సినిమా ఇది. రంగ్ దే బసంతి(2006): ఉద్యోగం వచ్చే చదువును చదువుకోవడం వేరు, దేశం పట్ల చైతన్యాన్ని కలిగించుకుని బాధ్యతను గుర్తెరగడం వేరు. నేటి యువత తమ కెరీర్‌ను వెతుక్కుంటున్నది గాని దేశం కోసం ఏం చేయాలో ఆలోచించడం లేదు. ‘రంగ్ దే బసంతి’... అల్లరి చిల్లరి యూనివర్సిటీ కుర్రాళ్లను దేశం కోసం ఏదైనా గట్టిగా చేయాలని నిర్ణయించుకోవడాన్ని చూపుతుంది. పుచ్చిపోయిన వ్యవస్థను సరిచేయాలనుకుని ్రపాణాలు అర్పించే కుర్రాళ్ల కథ ఇది. రాకేష్ మెహ్రా దర్శకుడు. ఆమిర్ ఖాన్ హీరో. ది ఫర్గాటెన్ హీరో (2004): నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోసం ఈ దేశం గుండె సగర్వంగా స్పందిస్తూనే ఉంటుంది. బ్రిటిష్ వారిపై పోరాడటానికి ఏకంగా సైన్యాన్ని నిర్మించిన ధీరుడు ఆయన. నేతాజీ మరణం ఇంకా మిస్టరీనే. నేతాజీ జీవితాన్ని అథెంటిక్‌గా చూపిన సినిమా ఇది. శ్యామ్ బెనగళ్ దర్శకునిగా ఎంత రీసెర్చ్ చేశాడో తెలుస్తుంది. నేతాజీగా సచిన్ ఖడేకర్ అద్భుతంగా నటించారు. గతించిన చరిత్రకు దర్పణం ఈ సినిమా. రాజీ (2018): దేశం కోసం గూఢచారిగా పని చేసి త్యాగాలు చేసిన వారు ఎందరో. వారిలో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉన్నారు. అలాంటి ఒక స్త్రీ కథ ‘రాజీ’. ఆలియా భట్ నటించిన ఈ సినిమా పాకిస్తాన్‌కు కోడలుగా వెళ్లి అక్కడ భారత్ కోసం గూఢచారిగా పని చేసిన సెహమత్ అనే స్త్రీ ఎదుర్కొన్న సవాళ్లను చూపుతుంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చిన్న బడ్జెట్‌తో నిర్మితమైనా భారీ వసూళ్లను రాబట్టింది. -
ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రగిలించే సినిమాలు ఇవే
సినిమా అనేది వినోదాన్ని మాత్రమే కాదు పంచుతుందనుకుంటే పొరపాటే.. కొన్ని సనిమాలు యువకుల్లో దేశభక్తిని రగిలించింది. అందుకు తగినట్లుగానే కొందరు హీరోలు,దర్శకులు కథలను ఎంచుకుంటుంటారు. ఇలా వారు భారీ విజయాలను కూడా సొంతం చేసుకున్నారు. మన హీరోలు స్వాతంత్ర సమర యోధులుగా, దేశాన్ని రక్షించే వీరులుగా కనిపించి ఆకట్టుకున్నారు. అలాంటి సినిమాలపై 77వ స్వాతంత్య్రం సందర్భంగంగా కొన్నింటిపై ఫోకస్ చేయండి. గాంధీ (1982) 1982లో వచ్చిన గాంధీ సినిమా రిచర్డ్ అటెన్ బరో తీశారు. అస్కార్ అవార్డు పొందిన సినిమా ఇది. బెన్ కింగ్ స్లే గాంధీగా నటించారు. భారత స్వతంత్ర పోరాటాన్ని, గాంధీ జీవితాన్ని తెరకెక్కించిన మొదటి సినిమా ఇదే. గాంధీజీ పై చాలా సినిమాలు వచ్చాయి. కానీ 1982లో తెరకెక్కిన గాంధీ సినిమా మాత్రం ప్రత్యేకం. అయితే దానికి ప్రత్యేకమయిన కారణం కూడా ఉంది. ఈ సినిమాను రూపొందించింది ఇంగ్లాండ్‌లో పుట్టిపెరిగిన రిచర్డ్ అటెన్‌బరో అనే ఫిల్మ్ మేకర్. ఆ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్ కూడా. ఇక ఆ సినిమాలో గాంధీగా నటించింది కూడా బ్రిటిష్ యాక్టర్ అయిన బెన్ కింగ్స్లే. ఇలా ఏ దేశం పై అయితే గాంధీజీ తన పోరాటాన్ని సాగించారో వాళ్ళే మళ్ళీ ఆయనపై సినిమా తియ్యడం, దాన్ని ఇంగ్లాండ్‌లో కూడా రిలీజ్ చేస్తే అక్కడ అది ఘనవిజయం సాధించడం అనేది సామాన్యమయిన విషయం కాదు. పైగా ఆ సినిమాలో గాంధీజీ పాత్రను అద్బుతంగా పోషించిన బెన్ కింగ్స్లే కి అకాడెమీ అవార్డు కూడా వచ్చింది. అంటే గాంధీజీ జీవితంలో ఉన్న సారాంశం ఎంత గొప్పది అనేది ఆ సినిమాలో చూపించడం వల్ల, అది అందరి మనసులకు హత్తుకోవడం వల్ల ఆ విజయం సాధ్యమయింది. భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 582 సినిమా థియేటర్లలో ఆగష్ట్రు 14వ తేదీ నుంచి 24 వరకు 'గాంధీ' చిత్రాన్ని విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ (2000) భీంరావ్ రాంజీ అంబేడ్కర్ పాత్రలో మమ్ముట్టి రోల్ ఔట్‌స్టాండింగ్ అనే చెప్పవచ్చు. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా జబ్బర్ పటేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొదట ఆంగ్లంలో నిర్మించబడింది. తరువాత ప్రాంతీయ భాషలలోకి డబ్ చేయబడింది. ఈ చిత్రంలో మమ్ముట్టి డాక్టర్ అంబేడ్కర్ పాత్రను పోషించారు. అతని నటనకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అంబేద్కర్ యొక్క పోరాటాలను దృశ్యమానం చేసిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్రం, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించాలని పిలుపునిచ్చింది. నిర్మాణాన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. డాక్టర్ అంబేద్కర్గా మమ్ముట్టి నటన మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002) హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ తోటి సభ్యులతో కలిసి భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవకారుడు భగత్ సింగ్ గురించి 2002లో ఈ చిత్రం విడుదల అయింది. ఇందులో అజయ్ దేవగన్ టైటిల్ క్యారెక్టర్‌తో పాటు సుశాంత్ సింగ్ కూడా ఉన్నారు. ఈ సినిమాలో భారత స్వాతంత్రం కోసం పోరాడిన భగత్ సింగ్ జీవిత చరిత్రను పూర్తిగా చూపించారు. 1931 మార్చి 24న అధికారిక విచారణకు ముందు జలియన్ వాలాబాగ్ మారణకాండను చూపినప్పటి నుంచి భగత్ సింగ్ ని ఉరి తీసే వరకు ఈ సినిమాలో చూయించారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఉరికంబానికి ఎలా ఎక్కాడో తెలిపే చిత్రమే ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. లగాన్ (2001) బ్రిటీషు పాలనలో భూమి పన్ను రద్దుకు వ్యతిరేకంగా ఓ గ్రామ ప్రజలు క్రికెట్ ఆడటానికి నిర్ణయించుకుంటారు. అప్పటివరకూ అలవాటు లేని ఆట అది. పన్ను భారం తగ్గాలంటే ఆడి గెలవాల్సిందే. ఆడారు.. గెలిచారు. ఆమిర్ ఖాన్ నటించిన ఈ ‘లగాన్’ చిత్రకథను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. 2001లో ఈ సినిమా విడుదలైంది. అప్పట్లో ఎందరిలోనే దేశభక్తిని రగిలించిన సినిమా ఇది. ఇప్పటికి ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు దాటినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ (2004) నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా వచ్చిన Netaji Subhas Chandra Bose: The Forgotten Hero హిందీ చిత్రం 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ ఎపిక్ బయోగ్రాఫికల్ వార్ని సినిమాగా తెరకెక్కించింది. ఇందులో నేతాజీగా సచిన్ ఖేడేకర్ కరెక్ట్‌గా సెట్ అయ్యారు. బ్రిటీష్ ఇండియాలో మహాత్మా గాంధీతో రాజకీయ విబేధాల తర్వాత, బోస్ అరెస్టు, విడుదలయ్యాక జరిగిన కథను వివరించారు. ఈ చిత్రానికి ఇండియన్ ఆడియెన్స్ నుంచి విశేష ఆదరణ దక్కింది. సినిమాకు నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును కూడా దక్కింది. అలాగే 70వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంయుక్తంగా సమర్పించిన ఇండిపెండెన్స్ డే ఫిల్మ్ ఫెస్టివల్లో ఆగష్టు 14, 2016న ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. ఈ సినిమాకు శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ దర్శకత్వం వహించారు. ఎమ్ ఎక్స్ ప్లేయర్,యూట్యూబ్‌లో ఈ సినిమా ఉంది. సర్దార్ (1993) 1993లో ఈ చిత్రం విడుదలైంది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలను ఇండియన్ ఆఫ్ యూనియన్‌లో చేరేలా శ్రమించిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జీవితం ఆధారంగా నిర్మించిందే ఈ చిత్రం. ఈ సినిమాలో పరేష్ రావల్ సర్దార్‌గా నటించారు. ఈ సినిమాలో క్విట్ ఇండియా ఉద్యమంలో జరిగిన అల్లర్లతో పాటు నెహ్రుతో సర్దార్కు ఉన్న విబేధాలను చూపుతుంది. సర్దార్ లాంటి వ్యక్తి లేకుండా ఉండి ఉంటే భారత్ ఇప్పటికి కూడా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేదని చెప్పవచ్చు. యూట్యూబ్‌లో ఈ సినిమాను చూడొచ్చు కేసరి (2019) కేసరి 2019లో విడుదలైన బాలీవుడ్ సినిమా. 1897న భారత్‌లోకి సుమారు 10 వేలకు పైగా ఆఫ్ఘన్ దళాలు ఒక్కసారిగా చొచ్చుకొని వస్తారు. అప్పుడు వారందరినీ కేవలం 21 మంది సిక్కులు మాత్రమే ఎలా అడ్డుకున్నారు. అనేది ఈ సినిమాలో చూపిస్తారు .ఈ దళాల మధ్య 30 గంటల పాటు జరిగిన భీకర పోరాట సన్నివేశాలు మెప్పిస్తాయి. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, సుమీత్ సింగ్ బస్రా, రాకేష్ శర్మ, మీర్ సర్వర్, అశ్వథ్ భట్, రామ్ అవానా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మంగళ్ పాండే: ది రైజింగ్ (2005) మంగళ్ పాండే జీవితం ఆధారంగా 2005లో కేతన్ మెహతా దర్శకత్వంలో మంగళ్ పాండే: ది రైజింగ్ మూవీ వచ్చింది. ఇందులో ఆమీర్ ఖాన్ లీడ్ రోల్లో నటించారు. మంగళ్ పాండే ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో జులై 19, 1827న జన్మించారు. పాండే బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీలో రెజిమెంట్‌లో సిపాయిగా చేరారు. అప్పట్లో అతను తన అసాధారణమైన ప్రతిభ, తెగువతో సైనిక దళ నాయకుడిగా ఎదిగారు. అయితే ఆ కాలంలో బ్రిటిష్ వారు అందించిన తుపాకీ తూటాలను సిపాయిల వీసమెత్తు నచ్చలేదు. ఈ గుండ్లకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసేవారు. వాటిని పేల్చాలంటే సిపాయిలు నోటితో కొరికి తొక్క తీయాల్సి ఉంటుంది. హిందువులు, ముస్లింల మత విశ్వాసాలకు ఇది విరుద్ధమని భావించిన సిపాయిలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. బ్రిటీషర్లు మొదట జంతువుల కొవ్వును ఉపయోగించలేదని చెప్పారు. కానీ అది కోవ్వేనని పాండే, ఇతర సైనికుల్లో సందేహాలు మరింత బలపడ్డాయి. ఆ సందేహాలే చివరికి బ్రిటిష్ రాజ్యాధిపత్యంపై తిరుగుబాటుకు ఎలా దారితీసింది. పాండే ఉరి శిక్ష సమయంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు.ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మణికర్ణిక (2019) 2019లో వచ్చిన ఈ సినిమా ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఆదారంగా బాలీవుడ్లో తెరకెక్కించారు. ఇందులో కంగనా రనౌత్ ఝాన్సీగా తన నటనతో భారతీయులను మెప్పించింది.1828లో వారణాసిలో తన పుట్టుకతో కథ మొదలౌతుంది. పరాక్రమానికి మారుపేరుగా లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఉంటుంది. ఝాన్సీ రాజు అయిన గంగాధర్ రావుతో ఆమెకు వివాహం అవుతుంది. రాజ్యం గంగాధర్ అన్న అయిన సధాశివ్ బ్రిటీష్ వారితో కలిసి కుట్ర పన్నుతాడు. అందులో భాగంగా గంగాధర్ రావును బ్రిటీష్ వారు చంపేస్తారు. తన భర్తకు ఇచ్చిన మాట కోసం ఝాన్సీ లక్ష్మీ భాయ్‌గా రాజ్యాధికారం అందుకుంటుంది. ఈ క్రమంలో తెల్లవారిపై ఆమె చేసిన దండయాత్ర ఎలా ఉంటుందో చెప్పేదే మణికర్ణిక చిత్రం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. -
నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!
Bollywood Art Director Nitin Desai: ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ (57) అకాల మరణం అటు పలువురి ప్రముఖులను ఇటు నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. అనుమానాస్పద మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ. బుధవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఆయన మరణానికి సంబంధించి కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.252 కోట్ల అప్పులున్నాయని, ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే ఊహాగానాలు విని పిస్తున్నాయి. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా, కర్జాత్‌లోని ఎన్డీ స్టూడియోలోని అతని గదిలో నితిన్ దేశాయ్ మృతదేహం లభ్యమైంది. క్లీనింగ్ సిబ్బంది గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా.. ఈ విషయాన్ని గమనించారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత కర్జాత్, ఖలాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు సూపరింటెండెంట్ సోమనాథ్ ఘర్గే స్పష్టం చేశారు. నివేదికల ప్రకారం నితిన్ దేశాయ్ కొన్ని ఆర్థిక సంస్థల నుండి ఫిక్స్డ్ టర్మ్ లోన్ తీసుకున్నాడు.అదే అతని జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టి వేసి, చివరికి మరణానికి దారి తీసింది. రూ. 180 కోట్ల రుణం వడ్డీతో కలిపి రూ.252 కోట్లకు చేరింది. దీనికి సంబంధించి సదరుసంస్థ ఎన్డీ స్టూడియోసీజ్కు సిద్ధమౌతోంది. కలీనాకు చెందిన ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ రాయగడ కలెక్టరేట్‌కు దరఖాస్తు చేసింది. కానీ జప్తు చర్యలకు కలెక్టర్ కార్యాలయం తుది అనుమతి ఇవ్వలేదు. ఎన్డి స్టూడియో సీజ్‌కు సంబంధించిన దరఖాస్తు తన కార్యాలయానికి అందిందని రాయగడ రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్ సందేశ్ షిర్కే ధృవీకరించారు. కానీ జూలై 25న, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరించింది. మార్చి 31, 2021న ఖాతాని నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA)గా వర్గీకరించారని, జూన్ 30, 2022 నాటికి మొత్తం డిఫాల్ట్ మొత్తం రూ.252.48 కోట్లుగా తేలింది. (ఒప్పో కొత్త ఫోన్, ప్రారంభ ఆఫర్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?) నితిన్ దేశాయ్ వల్ల సీఎఫ్ఎం అనే ఆర్థిక సంస్థ నుంచి రూ.180 కోట్ల రుణం తీసుకున్నారు. 2 సంవత్సరాల 2016, 2018లో ఒప్పందం ప్రకారం దీని కోసం దేశాయ్ 40 ఎకరాల భూమి,ఇంకా 3 వేర్వేరు ఆస్తులను తనఖా పెట్టాడు. అనుకోని కారణాల వల్ల 2020నుంచి రుణం తిరిగి చెల్లించలేకపోయాడు. కొంత సమయం తర్వాత CFM తన రుణ ఖాతాలన్నింటినీ ఎడెల్వీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి కేటాయించింది. అయితే అప్పుడు కూడా రుణం రికవరీ కాలేదు. దీంతో దీంతో దేశాయ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ విషయమై కొద్దిరోజుల క్రితం ఖలాపూర్ ఎమ్మెల్యే మహేష్ బల్దితో కూడా చర్చించినట్టు సమాచారం. VIDEO | "He was a good friend of mine. I met him 10-15 days ago, but didn't feel that he was in any kind of tension," says Shiv Sena (UBT) leader Baban Dada Patil on film art director Nitin Desai's suicide. pic.twitter.com/uBBG8Q0cSX — Press Trust of India (@PTI_News) August 2, 2023 #WATCH | Maharashtra: Forensic team arrived at ND Studios in Karjat, Raigad district, where the body of art director Nitin Desai was found hanging. pic.twitter.com/lEgENNCRjy — ANI (@ANI) August 2, 2023 ఎమ్మెల్యే మహేష్ బల్ది ఏమన్నారు? ఆర్థిక ఇబ్బందుల వల్లే నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు కర్జాత్ ఎమ్మెల్యే మహేశ్ బల్ది తెలిపారు. ఆయన మాట్లాడుతూ- నితిన్ దేశాయ్ తన నియోజకవర్గానికి నిత్యం వచ్చేవారు. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఉదయం ఎన్డీ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని వ్యాఖ్యానించారు. (రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా? ) నితిన్ కుడిభుజం కాకా ఎన్డీ స్టూడియోస్‌ను నడిపిన నితిన్ కుడిచేతిగా భావించే కాకా కూడా ఆర్థిక ఇబ్బందులగురించి మాట్లాడారు. కానీ ఇంత కఠిన నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరులకు ప్రేరణగా నిలిచేవ్యక్తి ఆయన. కొన్ని ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి.ఇంతలోనే ఇలా జరగడం విషాదకరమన్నారు. నితిన్ దేశాయ్ మరణంతో అక్షయ్ కుమార్, మేకర్స్ అప్‌కమింగ్ మూవీ OMG 2 ఆన్లైన్ ట్రైలర్ లాంచ్‌ను వాయిదా వేశారు. (Today August 2nd gold price గుడ్ న్యూస్: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు) Unbelievably sad to know about the demise of Nitin Desai. He was a stalwart in production design and such a big part of our cinema fraternity. He worked on so many of my films… this is a huge loss. Out of respect, we are not releasing the OMG 2 trailer today. Will launch it… — Akshay Kumar (@akshaykumar) August 2, 2023 నాలుగు జాతీయ అవార్డులు, అద్భుతమైన సినిమాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్ , దేవదాస్ మూవీలకు నాలుగు సార్లు జాతీయ అవార్డులను సాధించిన నితిన్ జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడంపై పలువురు నటులు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్లను కూడా రూపొందించిన ఘనత ఆయన సొంతం. లగాన్, జోధా అక్బర్, మున్నాభాయ్ M.B.B.S., లగే రహో మున్నా భాయ్ అతను పనిచేసిన కొన్ని ప్రముఖ బాలీవుడ్ సినిమాలు . Shocking news this morning - Art Director Nitin Desai is no more. Such a warm human being, associated with many of my projects and ballets, his passing is a terrible loss to the film industry. May he find peace wherever he is🙏 pic.twitter.com/STNsz6Kwr8 — Hema Malini (@dreamgirlhema) August 2, 2023 -
కుల్దీప్ను అంత మాటన్నాడా? ‘చెత్త’ వాగుడు కట్టిపెట్టు సూర్య.. ఇదేం పద్ధతి!
Suryakumar Slammed For On Field Comments On Kuldeep: టీ20 ఫార్మాట్లో దుమ్మురేపుతున్న టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. వన్డేల్లో అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 50 ఓవర్ల క్రికెట్లో 25 మ్యాచ్‌లు ఆడిన అతడు 476 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 64. అవకాశాలు సద్వినియోగం చేసుకోలేక ఇక శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో నంబర్ 4లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకున్నాడు సూర్య. అయితే, వెస్టిండీస్ పర్యటనలో రెండు వన్డేల్లోనూ అతడు విఫలమయ్యాడు. బార్బడోస్ మ్యాచ్‌లలో వరుసగా 19, 24 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో స్కై ఏదో మ్యాజిక్ చేస్తాడనుకుంటే నిరాశపరుస్తున్నాడంటూ అభిమానులు అతడిని ట్రోల్ చేస్తున్నారు. అయితే, రెండో వన్డే సందర్భంగా ఆటతో కాకుండా తన ‘అనుచిత’ ప్రవర్తనతో ట్రోలర్స్ చేతికి చిక్కాడు సూర్య. ఇంతకీ ఏం జరిగిందంటే.. కుల్దీప్ యాదవ్‌ను అలా అనగానే కెన్నింగ్టన్ ఓవల్‌లో విండీస్‌తో రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 181 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు దూకుడుగానే ఆడింది. ముఖ్యంగా కెప్టెన్ షాయీ హోప్.. హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే.. విండీస్ ఇన్నింగ్స్ 29వ ఓవర్లో.. విజయానికి 48 పరుగుల దూరంలో ఉన్న సమయంలో.. సూర్యకుమార్ యాదవ్ కవర్ పొజిషిన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. అదే సమయానికి భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన ఏడో ఓవర్ వేసేందుకు వచ్చాడు. నువ్వు మా కచ్రావి ఈ క్రమంలో కుల్దీప్ను ఉద్దేశించి.. ‘‘నువ్వు మా కచ్రావి’’ అంటూ సూర్య కామెంట్ చేశాడు. ఇది స్టంప్‌మైక్‌లో రికార్డైంది. ఇందుకు బదులివ్వని కుల్దీప్ తన పని తాను చేసుకుపోయాడు. అయితే, టీమిండియా ఫ్యాన్స్ మాత్రం సూర్య మాటలను తేలికగా తీసుకోలేకపోయారు. కుల్దీప్ ఈ విధంగా బదులిచ్చేవాడు అంటూ తమదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘ముందు మీరేగా పెంట చేసింది. ఇంక నేనేం చేయగలను’’ అని అన్నాడని ఓ యూజర్ పేర్కొన్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ బ్లాక్‌బ్లస్టర్ ‘లగాన్’లోని కచ్రా(స్పిన్ బౌలింగ్ చేసే వ్యక్తి)ని ప్రస్తావిస్తూ సూర్య ఈ విధంగా మాట్లాడి ఉంటాడన్న అర్థంలో కుల్దీప్ రిప్లే ఇలా ఉంటుందని పేర్కొన్నాడు. చెత్తలాగే కనిపిస్తాలే! అయితే, మరో యూజర్ మాత్రం.. కచ్రా(హిందీలో చెత్త అని అర్థం) పదాన్ని ఉపయోగించడాన్ని తప్పుబడుతూ.. ‘‘అవును.. నేను హ్యాట్రిక్ వికెట్లు తీసినా చెత్తలాగే కనిపిస్తా. అయితే, బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం నువ్వే అసలైన చెత్తవి’’ అంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా లగాన్ మూవీలో కచ్రా.. అంటరానితనం పేరిట సామాజికంగా వెలివేయబడిన క్యారెక్టర్. సమాజ దురాగతానికి మూల్యం చెల్లించే పాత్ర.. స్పిన్ బౌలింగ్ చేసే అతడు బ్రిటిష్ జట్టుతో క్రికెట్ ఆడే ఆమీర్ టీమ్‌లో కష్టమ్మీద చోటు సంపాదించి హ్యాట్రిక్ సాధిస్తాడు. అయితే, సూర్య.. ఈ మూవీలోని పాత్రను ఉటంకిస్తూ స్ఫూర్తిని నింపే క్రమంలో ఈ మాటలు అన్నాడని అతడి ఫ్యాన్స్ అంటుండగా.. నెటిజన్లు మాత్రం.. ‘‘సూర్య చెత్తవాగుడు ఆపి.. ఆటపై దృష్టి పెట్టకపోతే జట్టులో చోటు గల్లంతవుతుంది’’ అని చురకలు అంటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కుల్దీప్ రెండో వన్డేలో ఒక వికెట్ తీశాడు. చదవండి: సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం.. 13 కోట్ల ఆటగాడికి గుడ్‌బై! అతడికి కూడా pic.twitter.com/0VxpgDo7lh — Nihari Korma (@NihariVsKorma) July 31, 2023 "Aap ne pehle hi itna kachra kar diya, ab mere liye kya bacha hai karne ko!!", replied Kuldeep Yadav — Scorpion (@NovemberMan_11) July 29, 2023 Kuldeep replied - Sahi kaha maine bhi hat-trick li hai kachra ki tarah. Par batting section mei team ka kachra tu hai. Sirf ek difference hai vo final match mei out nhi hua tha. Kher jaane de 😂 — Cric Top Class (@crictopclass) July 29, 2023 -
మలింగ, బుమ్రాను మించిపోయాడు.. ఎవరీ 'గోలీ' క్రికెటర్!
లసిత్ మలింగ నుంచి పాల్ ఆడమ్స్ వరకు చూసుకుంటే వింతైన బౌలింగ్ యాక్షన్‌కు పెట్టింది పేరు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కొత్తలో మలింగ బౌలింగ్ యాక్షన్‌ను క్రీడా ప్రపంచం ఆసక్తికరంగా చూసింది. కానీ అదే మలింగ శ్రీలంక తరపున దిగ్గజ బౌలర్‌గా పేరు పొందాడు. ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్‌కు 12 ఏళ్ల పాటు సేవలందించిన మలింగ ఆ జట్టు టైటిల్స్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఒక మ్యాచ్‌లో బౌలర్ తన బౌలింగ్ యాక్షన్‌తో మలింగనే మించిపోయాడు. మలింగ ఒక్కడే కాదు టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు జూనియర్ మలింగ.. శ్రీలంక బౌలర్ మతీషా పతీరాణాల బౌలింగ్‌ను కలగలిపి మరీ బౌలింగ్ చేయడం ఆసక్తికరంగా నిలిచింది. లైనప్ తీసుకున్నప్పుడు తన కుడిచేతిని పలుమార్లు తిప్పి బంతిని రిలీజ్ చేయడం.. బ్యాట్స్‌మన్ అతని బౌలింగ్‌కు కన్ప్యూజ్ అయ్యి క్లీన్‌బౌల్డ్ అవ్వడం జరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక 2001లో బాలీవుడ్లో వచ్చిన 'లగాన్' చిత్రం గుర్తుంది కదా. ఆ సినిమాలో గోలీ పాత్ర పోషించిన దయా శంకర్ పాండే క్లైమాక్స్‌లో తన గోలీ బౌలింగ్‌తో బ్రిటీషర్లను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న బౌలర్ కూడా అచ్చం అదే తరహాలో బౌలింగ్ చేయడం ఆసక్తిని రేపింది. అది సినిమా కాబట్టి రియాలిటీకి దూరంగా అనిపించింది. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడంతో క్రికెట్ ఫ్యాన్స్ లగాన్‌లోని గోలీ క్రికెటర్‌ను గుర్తుకు తెచ్చాడంటూ కామెంట్స్ చేశారు. చదవండి: ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వలేదు.. అక్కడ మాత్రం దుమ్ము రేపాడు! This puts @alricho21 double twirl to shame. Love it! pic.twitter.com/EHfLvOo9sc — Charles Dagnall (@CharlesDagnall) June 6, 2022 -
ఫీల్డింగ్, కీపింగ్, క్యాచ్.. ఆల్‌రౌండర్ ప్రదర్శన.. జట్టులో చోటుందా..!
సాధారణంగా ఇంట్లో పెంపుడు జంతువులుగా.. శునకాన్ని పెంచుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. కుక్కను విశ్వాసానికి గుర్తుగా భావిస్తారు. చాలా మంది వీటిని.. తమ ఇంట్లో ఒక సభ్యుడి మాదిరిగానే ట్రీట్ చేస్తారు. శునకం కూడా తమ యజమాని పట్ల ఎనలేని ప్రేమను, అభిమానాన్ని చూపిస్తుంటుంది. బయటకు వెళ్లిన తమ యజమాని వచ్చేవరకు గుమ్మం వద్దనే కాచుకుని ఉంటాయి. యజమాని తప్ప వేరే వారు ఏది తినడానికి పెట్టిన కనీసం ముట్టుకోవు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కుక్కలతో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. మరికొంత మంది కుక్కలకు చిన్నచిన్న పనులు నేర్పిస్తుంటారు. ఏదైన వస్తువును లేదా బాల్‌ను విసిరి.. దాని వెనుక పరిగెడతారు. కుక్క నోటికి అందించి తెచ్చేలా దానికి ట్రైనింగ్ ఇస్తారు. ఇలాంటివి తరచుగా మనం సోషల్ మీడియాలోను.. మనచుట్టు చూస్తునే ఉంటాం. తాజాగా, భారత్ మాజీ క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండుల్కర్ ఒక ఆసక్తికర వీడియోను తన ట్విటర్‌ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో ఒక వీధిలో కొందరు చిన్న పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఒక బాలిక లెఫ్ట్‌హ్యాండ్‌తో బ్యాటింగ్ చేస్తుంది. ఒక బాలుడు వేగంగా బౌలింగ్ చేస్తున్నాడు. అక్కడ ఒక శునకం కీపింగ్ చేస్తుంది. ఆ బాలుడు స్పీడ్‌గా బౌలింగ్ చేయగానే ఆ కుక్క.. దాన్ని తన నోటితో క్యాచ్ పట్టేసుకుంటుంది. అదే విధంగా ఆ బాలిక.. షాట్ కొట్టగానే వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ బాల్‌ను తీసుకొస్తుంది. ఈ వీడియోలో శునకం.. కీపింగ్, ఫీల్డింగ్, క్యాచ్‌లతో.. ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరుస్తుంది. ఈ ఆసక్తికర వీడియోను తన స్నేహితుడు పంపించినట్లు సచిన్ తెలిపాడు. ఆల్ రౌండర్ ప్రతిభ కనబరుస్తున్న శునకానికి మీరు ఏమని పేరుపేడతారంటూ సచిన్.. ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని’, ‘ ఆల్ రౌండర్ శునకం’, ‘లగాన్ సినిమా గుర్తొస్తుందంటూ..’ కామెంట్లు చేస్తున్నారు. Received this from a friend and I must say, those are some 'sharp' ball catching skills 😉 We've seen wicket-keepers, fielders and all-rounders in cricket, but what would you name this? 😄 pic.twitter.com/tKyFvmCn4v — Sachin Tendulkar (@sachin_rt) November 22, 2021 -
పిల్లలూ దేవుడూ చల్లనివారే...
రోజారమణి ‘భక్త ప్రహ్లాద’ చేస్తే నేటికీ అదొక అద్భుత నటన. ‘లవకుశ’లో లవుడుగా కుశుడుగా ఆ చిన్నారులు చెదిరిపోతారా మస్తిష్కం నుంచి. ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’ అన్న పద్మినికి ఇన్నేళ్లు వచ్చినా ‘కుట్టి పద్మినే’. గతంలో బాలలు గొప్పగా నటించే పాత్రలు ఉండేవి. బాలల కోసమే తీసే సినిమాలు ఉండేవి. బాలలే నటించగా బాల భారతం వచ్చింది. బాల రామాయణమూ వచ్చింది. బాలల సినిమాలకు ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చేవి. అవన్నీ ఇప్పుడు లేవు. పిల్లల భావోద్వేగాలను చెప్పే సినిమాలు దేవుడెరుగు. పిల్లలకు ఆరోగ్యకరమైన వినోదం అందించే సినిమాలు ఎక్కడ? ఆమిర్‌ఖాన్ తీసిన ‘లగాన్’ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో 11 మంది గ్రామీణులు బ్రిటిష్ వారి మీద క్రికెట్ ఆడి గెలుస్తారు. ఆ గ్రామీణుల్లో ఒక వయసు మళ్లిన వృద్ధ డాక్టర్ ఉంటాడు. ఒక దళిత వికలాంగుడు ఉంటాడు. చేతి వృత్తుల వారు ఉంటారు. ముస్లిం ఉంటాడు. వీరందరితోపాటు ఈ టీమ్‌కు సపోర్ట్‌గా ఒక పిల్లవాడు కూడా ఉంటాడు. మేచ్ జరుగుతున్నప్పుడు కీలక ఆటగాడు గాయపడితే ఈ పిల్లవాడే బై రన్నర్‌గా రంగంలో దిగుతాడు. ఈ పాత్రల అల్లిక ఇలా ఎందుకు? దేశం అంటే సమాజం అంటే అందరూ అని. వారిలో పిల్లలూ ఉంటారని. ఇదే ఆమిర్ ఖాన్ డిస్లెక్సియాతో బాధపడే పిల్లల పక్షాన నిలబడి ‘తారే జమీన్ పర్’ తీస్తే ఆ సినిమా గొప్ప ప్రశంసలు పొందింది. అతనికి కలెక్షన్లు కూడా కురిపించింది. తెలుగు సినిమా కూడా ఇలా ఆలోచించగలదు. కాని ఆలోచించడం లేదు. ఘనమైన బాలల పాత్రలు గతంలో తెలుగు సినిమాల్లో బాలల పాత్రలు చాలా గట్టిగా ఉండేవి. వారి మీదే తీసిన సినిమాలూ వచ్చేవి. బాలల కేంద్రంగా ఉన్నా పెద్ద హీరోలు ఆ సినిమాలు చేసేవారు. ఎన్.టి.ఆర్ ‘రాము’, ‘లవకుశ’, ఏ.ఎన్.ఆర్ ‘సుడిగుండాలు’, శోభన్‌బాబు ‘సిసింద్రీ చిట్టిబాబు’, హరనాథ్ ‘లేత మనసులు’ వంటి సినిమాల్లో నటించారు. సావిత్రి పిల్లల కోసమే ‘చిన్నారి పాపలు’ సినిమాను నిర్మించారు. ‘పాపం పసివాడు’ సినిమా ఆ రోజుల్లో మాస్టర్ రాము నటించగా సూపర్‌హిట్ అయ్యింది. పిల్లలే పాత్రలుగా బాలలకు చెప్పాల్సిన కథలు బాలల ద్వారానే చెప్పిస్తే బాగుంటుందనే ఆలోచనతో తెలుగులో ‘బాల భారతం’ వచ్చింది. భారత కథలోని అన్ని పాత్రలను ఈ సినిమాలో బాలలే ధరించడం విశేషం. ‘మానవుడే మహనీయుడు’ వంటి హిట్ సాంగ్‌ను శ్రీశ్రీ రాశారు. ఆ తర్వాత పిల్లలే అన్ని పాత్రలు పోషించగా భానుమతి రామకృష్ణ ‘భక్తధృవ మార్కండేయ’ తీశారు. కె.ఎస్.ప్రకాశరావు స్వీయదర్శకత్వంలో ‘బాలానందం’, బి.ఆర్.పంతులు దర్శకత్వంలో ‘పిల్లలు తెచ్చిన చల్లనిరాజ్యం’ ఇవన్నీ పిల్లలకూ సినిమాల్లో చోటు ఉందనీ పిల్లలూ సినిమా కథను నడిపించగలవనీ నిరూపించాయి. ఇదే సమయంలో ‘భక్త ప్రహ్లాద’లో రోజారమణి విశేష ప్రతిభ కనపరిచి ప్రహ్లాదునిగా ఘనఖ్యాతి పొందారు. ఇది జరిగిన చాలా రోజులకు నిర్మాత ఎం.ఎస్.రెడ్డి పూనిక మీద గుణశేఖర్ దర్శకత్వంలో ‘బాల రామాయణం’ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో రాముడిగా నటించారు. ఈ సమయాలకు అటు ఇటుగా బేబీ షాలినీ ‘బంధం’ వంటి సినిమాలతో వెలిగితే తరుణ్ ‘మనసు మమత’, ‘తేజ’ వంటి సినిమాలతో అలరించాడు. బేబి సుజిత ‘పసివాడి ప్రాణం’తో సినిమాకు ప్రాణం పోసింది. భద్రం కొడుకో కమర్షియల్ సినిమా ఒక ధోరణిలో బాలలకు చోటు కల్పిస్తే తెలుగులో 1992లో వచ్చిన ‘భద్రం కొడుకో’ పార్లల్ సినిమాగా బాలల చిత్రాలకు దారి గట్టి పరిచింది. వీధి బాలల సమస్యలను చర్చించిన ఈ సినిమాకు ఓల్గా రచన చేయగా అక్కినేని కుటుంబరావు దర్శకత్వం వహించారు. జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్న సినిమా ఇది. ఆ తర్వాత అక్కినేని కుటుంబరావు మరికొన్ని బాలల సినిమాలు తీశారు. అయితే ఆ దారిలో ఎక్కువ సినిమాలు రాలేదు. మణిరత్నం తమిళంలో తీయగా తెలుగులో డబ్ అయిన ‘అంజలి’ ఒక రకమైన పిల్లలను లోకానికి చూపితే పిల్లలు తమకు జీవితంలో ఎదురయ్యే పరిణామాలను బట్టి నిలబడి ఎదగాలని చెప్పిన గుణ్ణం గంగరాజు ‘లిటిల్ సోల్జర్స్’ పిల్లల్ని పిల్లల్లా చూపుతూ ప్రశంసలు పొందింది. స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు బాలల కోసం సినిమా తాను తీయకపోవడం వెలితిగా భావించి బి.నరసింగరావు దర్శకత్వంలో ‘హరివిల్లు’ నిర్మించారు. మారిన ధోరణి 2000 సంవత్సరం తర్వాత తెలుగు సినిమాల్లో పిల్లల పాత్రలు, చేష్టలు పూర్తిగా మారిపోయాయి. వారు పుట్టిన వెంటనే ప్రేమలో పడే స్థాయిలో ‘ఖుషి’ సినిమా నుంచి కొత్త పోకడలు పోయాయి. పదేళ్ల లోపే గట్టిగా ప్రేమలో పడుతూ ‘తూనీగా తూనీగా’ అని పాడుకోవడం మొదలెట్టారు. హైస్కూల్ తరగతి గదుల్లో వారి ప్రేమలు కొనసాగాయి. మాస్టర్ భరత్ తమిళం నుంచి వచ్చి హాస్యం పేరుతో పంచ్‌లు వేయడం మొదలుపెట్టాడు. భారతీయ భాషల్లో మెరుగైన బాలల పాత్రలతో సినిమాలు వస్తుంటే అతి చిన్న మార్కెట్ కలిగిన ఇరాన్ సినిమా అద్భుతమైన బాలల చిత్రాలతో ప్రపంచ ఖ్యాతి పొందుతుంటే మనం ఒక గొప్ప బాలల చిత్రం తీయలేకపోయాం. వారిని అలరించే టైం మిషన్ వంటి సబ్జెక్ట్స్ తీసుకుని ‘ఆదిత్య 369’ వంటి కమర్షియల్ చిత్రాలు కూడా తీయలేకపోతున్నాం. బాలలు ఏం చూడాలో సమాజం, సినిమా రంగం ప్రత్యేకంగా ఆలోచించకపోతే వారు నెట్లో అనివార్యంగా 18 ప్లస్ సినిమాలవైపుకు వెళతారు. వెళుతున్నారు. ప్రభుత్వం బాలల కోసం షార్ట్‌ఫిల్మ్స్‌ను, ఫీచర్ఫిల్మ్స్ను, యానిమేషన్ ఫిల్మ్ ్మ్సను ఎంకరేజ్ చేయాలి. బాలల థియేటర్ కొన్నాళ్లు యాక్టివ్‌గా ఉంది. ఇప్పుడు లేదు. బాలల సినిమాలు రాయితీల వల్ల అయినా తయారయ్యేవి. ఇప్పుడు అవీ లేవు. తెలుగు బాలలూ... మీరిప్పుడు అనుభవిస్తున్నది పసిడి కాలం కానేకాదు... ప్లాస్టిక్ స్క్రీన్ కాలం! ఏం విషాదం ఇది!! బాలలు ఏం చూడాలో సమాజం, సినిమా రంగం ప్రత్యేకంగా ఆలోచించకపోతే వారు నెట్లో అనివార్యంగా 18 ప్లస్ సినిమాలవైపుకు వెళతారు. వెళుతున్నారు. ప్రభుత్వం బాలల కోసం షార్ట్‌ఫిల్మ్స్‌ను, ఫీచర్ఫిల్మ్స్ను, యానిమేషన్ ఫిల్మ్ ్మ్సను ఎంకరేజ్ చేయాలి. వారికి కాసింత వినోదాన్ని పంచుదాం -
ఆర్థిక ఇబ్బందుల్లో 'లగాన్' నటి.. ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ..
Aamir Khans Lagaan Co-star Parveena Seeks Help: అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో 'లగాన్' ఒకటి. 2001లో విడుదలైన ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది. అంతేకాకుండా ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ మంచి గుర్తింపు వచ్చింది. అయితే కాలం మారుతున్న కొద్దీ పరిస్థితులు మారుతాయి. సినిమా అనే రంగుల ప్రపంచంలో కనిపించేదంత నిజం కాదు. తెర వెనుక ఎన్నో విషాదాలు గూడుకట్టుకుంటాయి. చదవండి: నా మాజీ భార్య ఎవరినైనా ఇష్టపడ్డా నేను సంతోషిస్తా లగాన్‌లో నటించిన ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పర్వీనా పరిస్థితి కూడా ఇప్పుడు ఇలానే ఉంది. రీసెంట్ గా ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్ రావటం, ఆర్థికంగా చతికిలపడిపోవటం, చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవటంతో ఆమె పరిస్థితి అయోమయంగా ఉంది. దీంతో ఆమె గత్యంతరం లేక నన్ను ఆదుకోవాలంటూ తాజాగా అమీర్ ఖాన్ కి సోషల్ మీడియా వేదికగా మొర పెట్టుకుంది. చిత్ర పరిశ్రమలో తనకు కాస్టింగ్ డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతుంది. (ఖరీదైన కారును వదిలి ఆటోలో ప్రయాణించిన హీరోయిన్) లగాన్‌తో పాటు ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించిన పర్వీనాకు 2002లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రంగంలోకి దిగి అక్షయ్ కుమార్, సోనూసూద్ లాంటి సెలబ్రిటీల ద్వారా ఆమె వైద్యానికి సాయం అందించారు. అయితే ఆ డబ్బు చికిత్సకే సరిపోయింది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో తనకు సాయం చేయాల్సిందిగా కోరుతుంది. తన పరిస్థితి గురించి అమీర్ ఖాన్‌కు తెలియదని, తెలిస్తే కశ్చితంగా ఏదో ఒక విధంగా సాయం చేసేవాడని తెలిపింది. గతంలో వల్లభ వ్యాస్ అనే నటుడికి బ్రెయిన్ స్ట్రోక్‌తో పక్షవాతానికి గురైనప్పుడు అమీర్ ఖాన్ సాయం చేయడాన్ని గుర్తుచేసింది. (సారికతో కపిల్‌దేవ్ బ్రేకప్ లవ్‌స్టోరీ) -
ఆటలతో ఆకట్టుకున్న హిట్ సినిమాలివే!
కోడి రామ్మూర్తి బయోపిక్ రానుంది. పి.వి.సింధు ఆటను బిగ్ స్క్రీన్ మీద చూస్తాం. పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లో ఆయన్ను పోలిన నటుడు ఎవరో? ఆటను సినిమాగా చెప్పడం కూడా పెద్ద ఆట. బాల్ వెళ్లి సూటిగా తాకినట్టుగా ప్రేక్షకుడికి తాకితేనే హిట్టు. లేకుంటే అంతే. చాలాకాలం స్పోర్ట్స్‌ను పట్టించుకోని ఇండియన్ సినిమా నేడు వరుస పెట్టి స్పోర్ట్స్ మూవీలు తీస్తోంది. ఒలింపిక్స్ ఇచ్చే ఉత్సాహంతో మరిన్ని తీయనుంది కూడా. అసలు ఇంతకు ముందు ఏం స్పోర్ట్స్ మూవీస్ వచ్చాయి.. ఇక మీదట ఏం రానున్నాయి మనకు తెలియాలి... ఎస్... తెలియాలి... జమీందారు కూతురైన హీరోయిన్– బంగ్లా లాన్లో బాడ్మింటన్ బ్యాట్ పట్టుకుని, ఫ్రెండ్స్‌తో రెండు బాల్స్ ఆడి, అప్పుడే కారులో వచ్చిన తండ్రి వైపు పరిగెత్తుకుంటూ వచ్చి ‘డాడీ’ అనడం వరకే మన సినిమాల్లో ఆటలు కనిపించేవి. సినిమాలో ఆట ఎప్పుడైనా ఒక భాగమే తప్ప ఆటే సినిమా కావడం ఏమిటి ఎవరు చూస్తారు అని మన వాళ్లు ఆ జానర్‌ని ఔట్ చేసి కోర్ట్ బయట ఎప్పుడో కూచోబెట్టారు. కాని ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఆటే కథ. ఆటే క్లయిమాక్స్. ఆటే హీరో. ఆటగాడే హీరో. నీవు లేని నేను లేను శోభన్‌బాబు నటించిన ‘మంచి మనుషులు’లో స్కేటింగ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ‘గంగ–మంగ’ సినిమాలో శోభన్‌బాబు, వాణిశ్రీ ‘గాలిలో పైరగాలిలో’ అని పాట స్కేటింగ్ చేస్తారు. ‘గండికోట రహస్యం’ సినిమాలో ఎన్.టి.ఆర్ కబడ్డీ ఆడటం, ‘యుగపురుషుడు’లో కరాటే చేయడం తప్ప ఆటల ప్రస్తావన మనకు లేదు. విలువిద్య ఉంది కాని సినిమా విలువిద్యలో ఒకరు ఆగ్నేయాస్త్రం వేస్తే ఒకరు వరుణాస్త్రం వేస్తారు. రెండు ఆకాశంలో గంటసేపు ప్రయాణించి ఢీకొంటాయి. ఇలాంటివి ఒలింపిక్స్ వారు ఒప్పుకోరు. కాలం మారి చిరంజీవి వచ్చి ‘ఇంటిగుట్టు’లో మిక్స్డ్ కబడ్డీ ఆడాడు నళినితో. ఆ తర్వాత ‘విజేత’లో ఫుట్‌బాల్ గోల్ కీపర్‌గా కనిపించాడు. మెల్లగా ఆటల బంతి దొర్లడం మొదలెట్టింది. ఆట మార్చిన అశ్వని 1991లో తెలుగులో ‘అశ్వని’ వచ్చింది. జాతీయ స్థాయిలో పరుగుల రాణిగా నిలిచిన అశ్వని నాచప్ప జీవితం స్ఫూర్తితో ఆమెనే హీరోయిన్గా పెట్టి ‘ఉషాకిరణ్ మూవీస్’ తీసిన ఈ సినిమా ఒక సంచలనం అని చెప్పాలి తెలుగులో. ఒక పేదింటి అమ్మాయి కూడా క్రీడాకారిణి కావచ్చు అని చెప్పిన కథ ఇది. ఆట నేపథ్యంలో పూర్తి సినిమా తీయవచ్చని నిరూపించింది. కాని ఆ స్థాయి కథ లేదా ఆ వాతావరణం ఏర్పడలేక పోయింది. పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ ఆ తర్వాత కిక్ బాక్సింగ్‌ని నేపథ్యంగా తీసుకుంది. పూరి జగన్నాథ్ వచ్చి ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’లో కూడా అదే కిక్ బాక్సింగ్‌ని తీసుకున్నాడు. హీరో పంచ్ విసిరే ఆటలే ఆటలుగా మనకు ఉన్నాయి. ఎందుకంటే ఈత కొట్టే హీరో కంటే పంచ్ కొట్టే హీరోకు హిట్ కొట్టే చాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొండారెడ్డి బురుజు దగ్గర ‘ఒక్కడు’ 2003లో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ కథకు ఆటను నేపథ్యంగా తీసుకోవచ్చని మరోసారి గట్టిగా ఇండస్ట్రీకి చెప్పింది. ఇందులో మహేశ్ బాబు కబడ్డీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. దీనికి కొద్దిగా ముందు వచ్చిన శ్రీహరి ‘భద్రాచలం’ తైక్వాన్డును కథగా తీసుకున్నప్పటికీ పూర్తి విజయం మాత్రం ‘ఒక్కడు’ సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెగ్యులర్‌గానే స్పోర్ట్స్ కథలు కనిపిస్తూ వచ్చాయి. ‘బీమిలి కబడ్డీ జట్టు’ (కబడ్డీ), ‘గోల్కొండ్ హైస్కూల్’ (క్రికెట్), ప్రకాష్ రాజ్ ‘ధోని’ (క్రికెట్), ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ (అథ్లెట్), ‘సై’ (రగ్బీ)... ఇవన్నీ ఆటలను చూపినవే. హీరో నాని క్రికెట్ నేపథ్యంలో ‘జెర్సీ’ చేసి పెద్ద హిట్ అందుకుంటే నాగ చైతన్య కూడా అదే క్రికెట్ నేపథ్యంలో ‘మజిలీ’ చేసి విజయం సాధించాడు. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రెడ్’లో క్రికెట్, సందీప్ కిషన్ ‘ఏ1ఎక్స్‌ప్రెస్’లో హాకీ ఆటలు ప్రేక్షకుల్ని గ్రౌండ్స్‌లోకి తీసుకెళ్లాయి. అన్నింటికి మించి మహిళా బాక్సింగ్‌ను తీసుకుని వెంకటేశ్ హీరోగా, రితికా మోహన్ సింగ్ హీరోయిన్గా వచ్చిన ‘గురు’, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా మహిళా క్రికెట్‌ను తీసుకుని వచ్చిన ‘కౌసల్యా క్రిష్ణమూర్తి’, మహిళా ఫుట్‌బాల్‌ను తీసుకుని విజయ్ హీరోగా వచ్చిన ‘బిగిల్’ క్రీడల్లోనే కాదు సినిమాల్లో కూడా మహిళల విజయాన్ని చూపించాయి. వరుస కట్టిన సినిమాలు ఇక మీదట కూడ బోలెడు స్పోర్ట్స్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ రానుంది. కీర్తి సురేశ్ హీరోయిన్గా ‘గుడ్‌లక్ సఖీ’ (షూటింగ్), నాగ శౌర్య హీరోగా ‘లక్ష్య’ (విలువిద్య) రానున్నాయి. ఇవి కాకుండా కోడి రామ్మూర్తి, పి.వి.సింధు, పుల్లెల గోపీచంద్, కరణం మల్లీశ్వరి, విశ్వనాథన్ ఆనంద్‌ల బయోపిక్‌లు వరుసలో ఉన్నాయి. ఇక తమిళం నుంచి డబ్ అయిన తాజా సినిమా ‘సార్పట్టా’ కాలం వెనక్కు వెళ్లి మన దేశీయులు ఆడిన బాక్సింగ్‌లో పల్లె పౌరుషాలు పట్టుదలలు ఏ విధంగా ఉంటుందో చూపింది. అసలు గతాన్ని తవ్వుకుంటూ వెళితే ఎన్ని స్పోర్ట్స్ డ్రామాలు దొరుకుతాయో కదా. ఓడటం తెలిసినవాడే గెలవడం నేరుస్తాడు. ఆటల్లో ఉంటేనే ఓడటం గెలవడం ఓడినా గెలిచినా సాధన కొనసాగించడం తెలుస్తాయి. మనిషిని మానసికంగా శారీరకంగా తీర్చిదిద్దడంలో ఆటను మించింది లేదు. ఆటలో ఉండే ఉద్వేగం కూడా మనిషిని ఆకర్షిస్తుంది. సెల్‌ఫోన్‌ను అంటుకుపోతున్న నేటి తరాన్ని క్రీడామైదానం వైపు తరమాలంటే బయట, బడులలో, సినిమాల్లో ఎంత క్రీడా వాతావరణం కనిపిస్తే అంత మేలు. క్రీడలకు జయం. ఒలింపిక్స్‌లో ఉన్న భారతీయులకు జయం. ఈ ఒలింపిక్స్ జరిగినన్నాళ్లు అంతటా క్రీడా వాతావరణమే ఉంటుంది. ఒకవైపు ఆటలూ చూడొచ్చు. చూడని స్పోర్ట్స్ సినిమాలనూ చూడొచ్చు. నిజంగా ఇది క్రీడా వీక్షణ సమయమే. ‘లగాన్’ నుంచి సిక్సర్లే 2001లో ఏ ముహూర్తాన బాలీవుడ్లో ‘లగాన్’ వచ్చిందో అక్కడ స్పోర్ట్స్ సినిమాలు హిట్ మీద హిట్ కొడుతూనే ఉన్నాయి. బ్రిటిష్ కాలమేంటి... అక్కడ పన్ను పెంచడమేంటి... దానిని ఎదుర్కొనడానికి పల్లెటూరివాళ్లు బ్రిటిష్ వారితో క్రికెట్ ఆడటం ఏంటి... అసలా కథను తీయడం ఎలా సాధ్యం. దర్శకుడు అశితోష్ గొవారికర్ తీశాడు. సినిమా దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఆకర్షించింది. మన తెలుగువాడు నగేశ్ కుకునూర్ మూగ, చెవిటి ఆటగాడి కథను తీసుకుని అద్భుతంగా తీసిన ‘ఇక్బాల్’ ఒక గ్రామీణ క్రికెట్ బౌలర్ కథను చెప్పింది. ఆ తర్వాత మహిళా హాకీని తీసుకు షారూక్ ఖాన్ ‘చక్‌దే ఇండియా’ తీస్తే సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. వయసు మీరిన కోచ్ పాత్రలో షారూక్ కనిపించడానికి సిద్ధమయ్యి మరీ హిట్ కొట్టాడు. పరుగుల నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ హీరోగా ‘పాన్‌సింగ్ తోమార్’, మిల్కా సింగ్ ఆత్మ కథ ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీ కోమ్’, ‘ధోని’, ‘సైనా’, ‘సుల్తాన్’... ఇవన్నీ ఉద్వేగపూరిత క్రీడా అనుభవాన్ని ఇచ్చాయి. మహిళా కుస్తీ నేపథ్యంలో ఆమిర్ ఖాన్ ‘దంగల్’ రికార్డుల చరిత్రను తిరగరాసింది. ఇక 1983 వరల్డ్ కప్ నేపథ్యలో ‘1983’ రానుంది. ఫర్హాన్ ఖాన్ బాక్సర్‌గా ‘తూఫాన్’ తాజాగా విడుదలైంది. మిథాలి రాజ్ బయోపిక్ ‘శభాష్ మితూ’ వరుసలో ఉంది. ‘మైదాన్’ (ఫుట్‌బాల్) కూడా. -
రీనాతో 16 ఏళ్లు.. కిరణ్ రావుతో 15 ఏళ్లు.. ఎందుకిలా చేశావు ఆమిర్!?
వెబ్‌డెస్క్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరొందాడు ఆమిర్ ఖాన్. కుటుంబం మొత్తం సినీ నేపథ్యం ఉన్నదే. తండ్రి తాహిర్ హుస్సేన్ నిర్మాత. అంకుల్ నాసిర్ హుస్సేన్ 70వ దశకంలో బడా నిర్మాతగా, దర్శకుడిగా పేరు పొందాడు. ఇక ఆమిర్ ఖాన్ కజిన్ మన్సూర్ ఖాన్ కూడా దర్శకుడే. అతడి డైరెక్షన్లోనే ‘‘ఖయామత్ సే ఖయామత్ తక్’’తో సినీ హీరోగా అరంగేట్రం చేశాడు ఆమిర్. తొలి సినిమాతోనే.. ‘‘అరె.. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడే’’ అనిపించేలా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. దిల్, దిల్ హై కే మాన్తా నహీ, ఇష్క్, జో జీతా హై వహీ సికిందర్ వంటి సినిమాలతో ఫర్వాలేదనిపించిన ఆమిర్ ఖాన్... 90వ దశకం నుంచి విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నాడు. రంగీలా, ఇష్క్ వంటి సినిమాల్లో కనిపించిన అతడు.. రాజా హిందుస్థానీతో తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఇక లగాన్, త్రీ ఇడియట్స్, పీకే వంటి చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లగాన్‌తో నిర్మాణ సంస్థను స్థాపించిన ఆమిర్ ఖాన్.. తారే జమీన్పర్తో డైరెక్టర్‌గానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. కెరీర్లో ఇంతగా విజయవంతమైన ఆమిర్ ఖాన్.. వ్యక్తిగతంగా ముఖ్యంగా వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. అది కూడా రెండుసార్లు. పక్కింటి అమ్మాయి రీనాతో ‘ఇష్క్’ తమ పక్కింట్లో ఉండే అమ్మాయిపై మనసు పారేసుకున్నాడు ఆమిర్ ఖాన్. వీలు చిక్కినప్పుడల్లా.. గంటల తరబడి కిటికీలో నుంచే ఆమెను చూసేవాడు. మూగగా ఆరాధించేవాడు. రోజులు గడుస్తున్నాయి. అటువైపు నుంచి పెద్దగా స్పందన లేదు. ఇలా అయితే లాభం లేదనుకున్నాడు ఆమిర్. ఆఖరికి.. ధైర్యం చేసి.. ఒకరోజు రీనా దత్తాకు తన ప్రేమ గురించి చెప్పాడు. ఆమె.. ‘నో’ చెప్పింది. కానీ అతడు వదల్లేదు. పట్టువీడని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్చ్... అయినా రీనా మనసు కరగలేదు. నువ్వంటే నాకూ ఇష్టమే ఆమిర్ గుండె పగిలింది. తను మారదు... ఇక కుదరదులే అని ఆశలు వదిలేసుకున్న సమయంలో... రీనా స్వీట్ షాకిచ్చింది. ‘‘నువ్వంటే నాకూ ఇష్టమే’’ అని సిగ్గుల మొగ్గయింది. ఎగిరి గంతేశాడు ఆమిర్. ఇంకేముంది.. సరదాలు.. సంతోషాలు.. షికార్లు.. షరా మామూలే. రీనాను సర్ప్రైజ్ చేసేందుకు సగటు ప్రేమికుడు వేసే వేషాలన్నీ వేశాడు ఆమిర్. తనను ఇంప్రెస్ చేసేందుకు రక్తంతో ప్రేమలేఖ రాశాడు కూడా. కానీ రీనాకు ఇది అస్సలు నచ్చలేదు. ఇంకోసారి ఇలా చేస్తే.. నీతో మాట్లాడేదే లేదు అని కరాఖండిగా చెప్పేసింది. ప్రేమను నిరూపించుకునేందుకు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని గట్టిగానే హెచ్చరించింది. 2002లో విడిపోయారు ఆమిర్‌కు ఆమెపై ప్రేమతో పాటు గౌరవం కూడా పెరిగింది. పెళ్లి చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చారిద్దరూ. 1986లో ఏప్రిల్ 18న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు జునైద్ ఖాన్, ఇరా ఖాన్ సంతానం. పదహారేళ్లపాటు ఆమిర్- రీనా కాపురం సాఫీగా సాగిపోయింది. ఆ తర్వాత అభిప్రాయ బేధాలు తలెత్తిన కారణంగా స్నేహ పూర్వకంగానే విడిపోతున్నట్లు ప్రకటించారు. 2002లో వివాహ బంధానికి స్వస్తి పలికారు. నిర్మాతగా మొదటి భార్య.. అసిస్టెంట్ డైరెక్టర్‌తో ప్రేమ! విడాకులు తీసుకున్న తర్వాత కూడా రీనాతో అనుబంధం కొనసాగించాడు ఆమిర్ ఖాన్. ఇద్దరూ కలిసి పానీ ఫౌండేషన్ తరఫున సామాజిక సేవలో భాగమయ్యారు. ఇక లగాన్ సినిమాతో ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించిన ఆమిర్ ఖాన్... నిర్మాతగా వ్యవహరించాలని రీనాను కోరాడు. హీరోను పెళ్లాడినప్పటికీ రీనాకు సినిమాలపై పెద్దగా ఇంట్రస్ట్ లేదు. నిర్మాణ రంగంపై అసలే అవగాహన లేదు. ఆమిర్ కోసం ఆమె.. ప్రేమలో అతడు కానీ.. ఆమిర్ సాయం కోరాడన్న ఒక్క కారణంతో రీనా పెద్ద సాహసమే చేసింది. లగాన్ వంటి నేపథ్యం ఉన్న సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధపడింది. సుభాష్ ఘాయ్(ప్రముఖ ఫిల్మ్ మేకర్)ను కలిసింది. అప్పటి వరకు ల్యాబ్‌లో అడుగుపెట్టని ఆమె.. మన్మోహన్ శెట్టి(ల్యాబ్ యజమాని)ని అడిగి అన్ని వివరాలు తెలుసుకుంది. సినీ నిర్మాణ వ్యవహారాలపై అవగాహన పెంచుకుంది. ఎట్టకేలకు లగాన్‌ను పట్టాలెక్కించింది. అయితే, లగాన్ సినిమా సమయంలోనే ఆమిర్ ఖాన్‌కు రెండో ప్రేమ లభించింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కిరణ్ రావుతో ఏర్పడ్డ పరిచయం.. ప్రణయం, ఆపై పరిణయానికి దారి తీసింది. ఆమె.. హీరోయిన్ అతిథి రావు హైదరి కజిన్. వీరిద్దరి పూర్వీకులు గద్వాల్(వనపర్తి- తెలంగాణ) సంస్థానానికి చెందిన వారు. 2005లో పెళ్లి బంధంతో ఒక్కటైన కిరణ్- ఆమిర్ సరోగసి పద్ధతిలో ఆజాద్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. .కానీ, ఈ బంధం కూడా 15 ఏళ్లకే విడాకుల వరకు వెళ్లింది. తామిద్దరం భార్యాభర్తలుగా విడిపోతున్నామని, ఆజాద్‌కు మాత్రం... తల్లిదండ్రులుగా అన్ని బాధ్యతలు కలిసి నెరవేరుస్తామని శనివారం ప్రకటించారు కిరణ్ రావు- ఆమిర్ ఖాన్ దంపతులు. స్నేహితులుగా కొనసాగుతామని, రీనా దత్తా సీఓఓగా వ్యవహరిస్తున్న పానీ ఫౌండేషన్ వ్యవహారాల్లో కలిసి పనిచేస్తామని సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దీంతో.. సినిమాల్లో మిస్టర్ పర్ఫెక్ట్గా ఉండే నువ్వు ఎందుకిలా చేశావు ఆమిర్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. -
‘రివర్స్ ల్యాప్’ షాట్: రిస్క్ చేసే గుణం ఎక్కడికి పోతుంది!
లండన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్‌కు చేరుకున్న టీమిండియా బృందం ప్రాక్టీస్ మ్యాచ్‌లతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రెండు జట్లుగా విడిపోయి మెగా టోర్నీ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లలో టీమిండియా వికెట్ కీపర్, స్టార్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ సూపర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అద్భుత శతకంతో పాటు సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది కూడా. ఇక కరోనా కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అర్ధంతరంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ ఆటగాళ్లకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ పలు ఫ్రాంఛైజీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ కెప్టెన్ రిషభ్ పంత్ సూపర్ ఫాంను ఉటంకిస్తూ మంగళవారం షేర్ చేసిన ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇండియన్ ఐకానిక్ మూవీ ‘లగాన్’ విడుదలై 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ పోస్టు పెట్టింది. ఇందులో.. సినిమాలోని క్యారెక్టర్ గురాన్(రాజేశ్ వివేక్) పట్టుదలగా బ్యాట్‌తో నిలబడిన ఫొటోను, పంత్ రివర్స్ షాట్ ఆడుతున్న ఫొటోను జతచేసి .. ‘‘రిస్క్ చేసే గుణం.. ఆ వారసత్వం అలాగే కొనసాగుతుంది’’ అంటూ చమత్కరించింది. ఇందుకు స్పందనగా.. ‘‘ పరిగెత్తే గుర్రం లాంటి వాడు పంత్.. తన దూకుడైన ఆట మాకెంతగానో ఇష్టం.. మీ క్రియేటివిటీ సూపర్’’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఆనాటి సూపర్ షాట్ ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన నాలుగో టెస్టులో పంత్ తొలి ఇన్నింగ్స్ ఫొటో అది. ఇన్నింగ్స్ 83వ ఓవర్లో... తళతళ మెరుస్తున్న కొత్త బంతితో అండర్సన్ వేసిన ఫుల్ బాల్‌ను పంత్ స్లిప్ మీదుగా ‘రివర్స్ ల్యాప్’ షాట్‌తో బౌండరీకి తరలించాడు. తేడా వస్తే పంత్ గాయపడే అవకాశం ఉన్నా అతడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అసలు ఈ షాట్ ఎలా ఆడగలిగాడు అన్నట్లుగా స్వయంగా అండర్సన్ మొహం మాడ్చుకున్న దృశ్యాలు నెటిజన్లకు వినోదం పంచాయి. NO YOU CANNOT DO THAT RISHABH PANT!!! 🤯 #INDvENG https://t.co/DiRX7IMXyv — Wasim Jaffer (@WasimJaffer14) March 5, 2021 చదవండి: శతక్కొట్టిన పంత్.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్ -
లగాన్ వర్సెస్ గదర్: రెండూ గొప్ప సినిమాలే!
భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం ‘లగాన్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇండియా’. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డుకి నామినేషన్ ఎంట్రీకి వెళ్లడంతో పాటు ఎనిమిది జాతీయ అవార్డులు సాధించిన చిత్రం ‘లగాన్’. ఆమిర్ ఖాన్ హీరోగా నటించడమే కాదు.. నిర్మాతగా మారి, నిర్మించిన తొలి చిత్రం ఇది. అశుతోష్ గోవారీకర్ దర్శ కత్వం వహించిన ఈ చిత్రం విడుదలై జూన్ 15కి 20 ఏళ్లయింది. ఈ చిత్రంతో పాటు సన్నీ డియోల్ నటించిన ‘గదర్: ఏక్ ప్రేమ్‌కథ’ కూడా విడుదలై 20 ఏళ్లయింది. ఈ చిత్రాన్ని అనిల్ శర్మ డైరెక్ట్ చేశారు. రెండు సినిమాలు ఒకే రోజున విడుదలైనప్పుడు పోలికలు సహజం. ఎక్కువ తక్కువలు ఉండటమూ సహజమే. ‘గదర్’కి జాతీయ అవార్డులు రాకపోయినా మంచి సినిమా అనిపించుకుని, మంచి విజయాన్ని అందుకుంది. ఇక 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘లగాన్’ 20 ఇయర్స్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనవలసిందిగా చిత్రబృందం ఇచ్చిన పిలుపుకు నెటిజన్లు పాజిటివ్‌గా స్పందించారు. ‘మై లగాన్ స్టోరీ’ అంటూ ‘లగాన్’ సినిమా గురించిన తమ అభిప్రాయాలను, అనుభూతులను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు ‘‘లగాన్’ చిత్రం విడుదలైన రోజునే (జూన్ 15, 2001) ‘గదర్’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గదర్’ కూడా మంచి సినిమాయే. వసూళ్ల పరంగా కూడా మంచి విజయం సాధించింది. కేవలం ‘లగాన్’ సినిమా గురించే ప్రస్తావించడం సరైంది కాదు. ‘గదర్’ సినిమాను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అన్నట్లుగా కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇలా ఇరవై ఏళ్ళ క్రితం ‘లగాన్’, ‘గదర్’ సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీపడితే తాజాగా ఈ రెండు సినిమాల అభిమానులు సోషల్ మీడియాలో ‘లగాన్ వర్సెస్ గదర్’ అనే విధంగా కామెంట్లు విసురుకోవడం విశేషం. ఆ సంగతలా ఉంచితే... ‘లగాన్’ చిత్రబృందం రీ యూనియన్‌కు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రంగం సిద్ధం చేస్తోంది. ‘ఛలే ఛలో లగాన్: వన్స్ అపాన్ యాన్ ఇంపాజిబుల్ డ్రీమ్’ అనే టైటిల్‌తో జరగనున్న ఈ రీ యూనియన్ స్పెషల్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ చానెల్లో ప్రసారం కానుంది. ‘లగాన్’ గురించి ఆమిర్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ..‘‘ఈ చిత్రప్రయాణంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను. ‘లగాన్’ నాకు అద్భుతమైన జర్నీ. నా జీవితానికి కొత్త స్నేహితులను, బంధాలను ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమాతో పాటు ఈ బంధాలు కూడా ఇరవై ఏళ్ళ నుంచి నా జీవితంలో కొనసాగుతూనే ఉన్నాయి. ‘లగాన్’ గ్యాంగ్‌ని కలిసేందుకు ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. ‘‘ప్రజలందరూ కలిసి కష్టాలపై సమష్టిగా పోరాడే తత్వమే ‘లగాన్’ చిత్రానికి ప్రేరణ’’ అన్నారు దర్శకులు అశుతోష్. ‘‘ఇండియన్ సినిమా చరిత్రలో ‘లగాన్’ ఒక ఐకానిక్ మూవీ. భారతీయ కథలను విశ్వ వేదికపై నిలిపిన చిత్రం ఇది. ‘లగాన్’ 20 ఏళ్ళ సెలబ్రేషన్స్ చేస్తున్నందుకు గౌరవంగా ఫీల్ అవుతున్నాం’’ అన్నారు నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి షెర్గిల్. ‘గదర్’ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘‘మేం ఒక సినిమా చేశాం. ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్స్‌లో ఓ వేడుకలా చూశారు. ఈ హిస్టారిక్ ఫిల్మ్‌తో అసోసియేట్ ఉన్న అందరికీ ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు సన్నీ డియోల్. చదవండి: ఒంటినిండా బురదతో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? -
కరణ్, ఆది.. పెద్ద తప్పు చేస్తున్నావని హెచ్చరించారు: ఆమిర్ ఖాన్
వెబ్‌డెస్క్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కెరీర్‌లోని బిగ్గెస్ట్ హిట్లలో ‘లగాన్’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. అశుతోశ్ గోవరికర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆస్కార్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న లగాన్‌కు మొత్తంగా ఎనిమిది జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ఆడియోగ్రఫీ, బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ ఇలా పలు విభాగాల్లో పురస్కారాలు లభించాయి. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొత్తంగా 650 మిలియన్ రూపాయలు వసూలు చేసినట్లు సినీ పండితుల విశ్లేషణ. భారతీయ సినీ చరిత్రలో ఐకానిక్‌గా నిలిచే సినిమాల్లో ఒకటైన లగాన్ విడుదలై నేటికి సరిగ్గా 20 ఏళ్లు. ఈ సందర్భంగా.. పీటీఐతో మాట్లాడిన ఆమిర్ ఖాన్ గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. లగాన్ సినిమా సమయంలో దర్శక నిర్మాతలు కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా తనకు ఇచ్చిన సలహాలు కాదని మరీ ముందడుగు వేశానని చెప్పుకొచ్చాడు. ‘‘లగాన్ అవుట్డోర్ షూటింగ్ ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందు కరణ్ జోహార్, ఆదిని ఓ పార్టీలో కలిశాను. వాళ్లేం చెప్పారో నాకింకా గుర్తుంది. ‘‘జీవితంలో పెద్ద తప్పు చేస్తున్నావు. సింగిల్ షెడ్యూల్ అసలే వద్దు. రిస్క్ తీసుకోవద్దు. పెంట పెట్టుకోవద్దు’’ అని నన్ను హెచ్చరించారు. కానీ నేను నమ్మకంగా ముందుకు సాగాను’’ అని ఆమిర్ పేర్కొన్నాడు. నటుడిగా, నిర్మాతగా తను ధైర్యంగా తీసుకున్న నిర్ణయం కెరీర్‌నే మలుపు తిప్పిందని హర్షం వ్యక్తం చేశాడు. లైఫ్ పార్ట్నర్ కూడా దొరికింది.. అదే విధంగా.. ‘‘ నిర్మాతగా లగాన్‌తో నిర్మాణ బాధ్యతలు చేపట్టడం, సింక్ సౌండ్ రికార్డింగ్, అసిస్టెంట్ డైరెక్టర్ విధానం ప్రవేశపెట్టడం వంటివి నాకు ఎంతో తృప్తినిచ్చాయి. నిజానికి అశుతోశ్ కథ చెప్పినపుడే ఇదొక సంక్లిష్టమైన సినిమా అని అనిపించింది. అయినప్పటికీ అశుతోశ్ పట్టుదల వీడలేదు. మళ్లీ మళ్లీ నాతో చర్చించి ఒప్పించాడు. అదే మంచిదైంది. సినిమా సంప్రదాయాలన్నెంటినో మేం బ్రేక్ చేశాం’’ అని ఆమిర్ పేర్కొన్నాడు. ఇక కెరీర్పరంగానూ, వ్యక్తిగతంగానూ ఆమిర్ జీవితంలో లగాన్‌కు ప్రత్యేక స్థానం ఉండటానికి మరో కారణం కిరణ్ రావు. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆమెతో ప్రేమలో పడిన ఆమిర్.. కొన్నాళ్ల తర్వాత ఆమెను వివాహమాడాడు. ఈ జంటకు ఆజాద్(సరోగసీ ద్వారా జన్మించాడు) సంతానం. ఇక కిరణ్ రావు మరెవరో కాదు.. హీరోయిన్ అతిథి రావు హైదరీకి కజిన్. వీరిద్దరి పూర్వీకులు గద్వాల్ సంస్థానాని(వనపర్తి- తెలంగాణ)కి చెందిన వారు. క్రికెట్ నేపథ్యంలో.. స్వాతంత్య్రానికి ముందు మధ్య భారతదేశంలోని కరువుతో అల్లాడుతున్న ఓ చిన్న గ్రామంలోని పరిస్థితుల చుట్టూ అల్లుకున్న కథే లగాన్. పన్నుల కోసం తమను వేధిస్తున్న బ్రిటీష్ అధికారులతో సవాల్ చేసి క్రికెట్ ఆడి అధిక పన్ను భారం నుంచి విముక్తి పొందేందుకు గ్రామస్తులు చేసే పోరాటం ఇతివృత్తంగా సినిమా సాగుతుంది. తమకు అసలు పరిచయం లేని ఆటను నేర్చుకుని.. తమ తలరాతను తామే మార్చుకున్న విధానం ఆకట్టుకుంటుంది. ఆమిర్‌ఖాన్, గ్రేసీ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం నేటికీ లక్షలాది మంది ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. మ్యూజికల్‌గానూ హిట్టయిన ఈ సినిమా పాటలు సంగీత ప్రియుల మనసు చూరగొంటూనే ఉన్నాయి. View this post on Instagram A post shared by Aamir Khan Productions (@aamirkhanproductions) చదవండి: రజనీకాంత్ ‘శివాజీ’ మూవీకీ 14 ఏళ్లు: అప్పటి కలెక్షన్స్ ఎంతంటే.. This is where my journey in cinema began. I stood in front of a movie camera & cherished every bit of it. 20yrs since this epic released. Immense gratitude to @AshGowariker #AamirKhan ,entire TeamLagaan THANKYOU our audience & media for all the love you showered#20YearsOfLagaan pic.twitter.com/6JvbqaC8rm — Gracy Singh (@iamgracysingh) June 15, 2021 -
కోర్టులో‘లగాన్’ నటుడు
‘ముంగేరిలాల్ కే హసీన్ సప్నే’ సీరియల్ ద్వారా టీవీ ప్రేక్షకులకు, ‘లగాన్’ వంటి అనేక సినిమాల ద్వారా సినిమా ప్రియులకు సుపరిచతుడైన నటుడు రఘువీర్ యాదవ్ విడాకుల కేసును ఎదుర్కొంటున్నాడు. రఘువీర్ యాదవ్, పూర్ణిమ 1988లో వివాహం చేసుకున్నారు. పూర్ణిమ అంతర్జాతీయ స్థాయి కథక్ డాన్సర్ అయితే1995 నుంచే వారు విడివిడిగా ఉంటున్నారు. వీళ్లకు ఒక కుమారుడనీ అతనికిప్పుడు 30 ఏళ్లు అనీ తల్లితోనే ఉంటున్నాడని ముంబై మిర్రర్ పత్రిక రాసింది. రఘువీర్ యాదవ్ భారతీయ నాటకరంగంలో చాలా పెద్ద పేరు. టెలివిజన్ రంగంలో ‘ముల్లా నసీరుద్దీన్’, ‘అమరావతి కే కహానియా’ వంటి ఎన్నో సీరియల్స్‌లో పని చేశాడు. ‘సలాం బాంబే’, ‘రుడాలీ’, ‘బాండిట్ క్వీన్’ సినిమాలలో ముఖ్య పాత్రలు ధరించాడు. ‘డియర్ ఫ్రెండ్ హిట్లర్’ సినిమాలో హిట్లర్ పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు 62 సంవత్సరాల వయసులో కోర్టు మెట్లు ఎక్కనున్నాడు. అతడి భార్య అతడి నుంచి చట్టపరంగా విడిపోవడానికి ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు నమోదు చేసింది. విడాకులు మంజూరు అయ్యేంత వరకు నెలకు లక్ష రూపాయల ఇంటిరియమ్ మెయింటెన్స్, మంజూరయ్యాక పది కోట్ల పరిహారం రఘువీర్ యాదవ్ నుంచి కోరుతోంది. రఘువీర్ యాదవ్, పూర్ణిమ 1988లో వివాహం చేసుకున్నారు. పూర్ణిమ అంతర్జాతీయ స్థాయి కథక్ డాన్సర్ అయితే 1995 నుంచే వారు విడివిడిగా ఉంటున్నారు. వీళ్లకు ఒక కుమారుడు అనీ, అతనికిప్పుడు 30 ఏళ్లు అనీ, తల్లితోనే ఉంటున్నాడని ముంబై మిర్రర్ పత్రిక రాసింది. ‘అతడు వేరొకరితో సంబంధం పెట్టుకొని నన్ను మోసం చేశాడు’ అని పూర్ణిమ ఆరోపిస్తోంది. రఘువీర్ యాదవ్ మేనేజర్ రోష్నీ అర్చెజాను ఇందుకు కారణంగా చెబుతోంది. ‘ప్రస్తుతం అతను నెలకు నలభై వేల రూపాయలు ఖర్చులకు ఇస్తున్నాడు. అవి కూడా సరిగ్గా సమయానికి ఇవ్వడు. నాకు న్యాయం కావాలి’ అని పూర్ణిమ తన పిటిషన్లో పేర్కొంది. ‘ఎక్కడ భరణం ఇవ్వాల్సి వస్తుందో అని ఆస్తులు రోష్నీ పేరు మీద మార్చేశాడు’ అని కూడా పూర్ణిమ చెప్పింది. ఈ విషయమై రఘువీర్ యాదవ్‌ను సంప్రదించగా ‘ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించను. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది’ అని ఊరుకున్నాడు. 2017లో సూపర్ హిట్ అయిన సినిమా ‘న్యూటన్’లో రఘువీర్ యాదవ్ కార్డ్స్ ఆడుతూ కనిపించే ఎన్నికల అధికారిగా నటించాడు. ప్రస్తుతం అతడికి మంచి ముక్క పడట్లేదని మాత్రం ఈ ఉదంతం తెలియచేస్తోంది. -
ప్రముఖ బాలీవుడ్ నటుడు మృతి
రాజస్థాన్: ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రీవల్లభ వ్యాస్ ఆదివారం మరణించారు. వ్యాస్(60) ఇవాళ రాజస్థాన్‌లోని జైపూర్‌లో మృతిచెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. వ్యాస్ గుజరాత్ సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు 2008 అక్టోబర్‌లో పక్షవాతం వచ్చింది. 2013లో ఆయనను జైసల్మేర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స ఖర్చులను భరించే పరిస్థితి లేకపోవడంతో అక్కడి నుంచి జైపూర్‌కి తరలించారని చెప్పారు. సినిమా, టెలివిజన్ ఆర్టిస్టు అసోసియేషన్ వ్యాస్‌కు కనీస సహాయం కూడా అందించలేదని, మనోజ్ బాజ్‌పాయి, అమిర్ ఖాన్,ఇర్ఫాన్ ఖాన్ తదితరులు ఆదుకున్నారని వ్యాస్ భార్య శోభ పేర్కొన్నారు. శ్రీవల్లభ వ్యాస్ దాదాపు 60 సినిమాలు, ఎన్నో టెలివిజన్ కార్యక్రమాలు చేశారు. అందులో సర్ఫరోష్ (1999), లగాన్ (2001), అభయ్ (2001), ఆన్: మెన్ ఎట్ వర్క్ (2004), నేతాజీ సుబోస్ చంద్రబోస్: ద ఫర్గాటెన్ హీరో (2005), సంకట్ సిటీ (2009), విరసత్ (1985) తదితర చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అందులో అమిర్ ఖాన్ చిత్రం ‘లగాన్’ ప్రత్యేకం. -
‘న్యూటన్’కు నిరాశ
ఆస్కార్ బరిలో సత్తా చాటలనుకున్న బాలీవుడ్ మూవీ న్యూటన్ కు నిరాశే ఎదురైంది. ఇప్పటి వరకు ఆస్కార్ బరిలో ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం కేటగిరిలో లగాన్, మదర్ ఇండియా, సలాం బాంబే చిత్రాలు మాత్రమే ఫైనల్స్ వరకు వెళ్లాయి. ఈ సారి న్యూటన్ ఆ ఘనత సాదిస్తుందని భావించినా.. నిరాశే ఎదురైంది. 90వ ఆస్కార్ అవార్డ్స్ లో ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరిలో 98 విదేశీ సినిమాలు పోటిలో పడ్డాయి. వీటిలో కేవలం 9 సినిమాలు మాత్రమే ఫైనల్స్ కు చేరాయి. రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన న్యూటన్ కు ఫైనల్స్ లో చోటు దక్కలేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియపై తెరకెక్కిన న్యూటన్ సినిమాకు అమిత్ మసూర్కర్ దర్శకుడు. ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం కేటగిరిలో ఫైనల్స్ కు చేరిన చిత్రాలు... ఫెలిసైట్ ఆన్ బాడీ అండ్ సోల్ ఎ ఫెంటాస్టిక్ ఉమెన్ ఇన్ ది ఫేడ్ ది ఇన్ సల్ట్ ఫాక్స్ ట్రాట్ లవ్ లెస్ ది స్క్వేర్ ది వూండ్ -
పొరపాట్లు... ఏమరుపాట్లు
రాంగ్ డైరెక్షన్ గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు. సినిమా ప్రేక్షకులు కూడా దర్శక , నిర్మాతలకు దేవుళ్ల వంటివారే. పిక్చర్‌ను హిట్ చేసి కోట్లకు కోట్లు కుమ్మరిస్తారు. పిక్చర్‌లోని తప్పులను చూసీ చూడనట్లు పెద్ద మనసుతో క్షమించేస్తారు! తప్పులంటే పెద్ద తప్పులేం కాదు లెండి, మానవ తప్పిదాలు. వాటిని పొరపాట్లు, ఏమరుపాట్లు అనుకోవాలి. సరదాగా తీసుకుని నవ్వుకోవాలి. అలా కాసేపు మీ ముఖంపై చిరునవ్వుల్ని చిందించే కొన్ని బాలీవుడ్ ‘చిత్ర’ విచిత్రాలు ఇవి. ఎంజాయ్ చెయ్యండి. 1. ఓవర్‌కి 6 బంతులా? ‘లగాన్’ సినిమా కథ 1892 నాటిది. అందులో రెండు క్రికెట్ టీములూ ఓవర్‌కి ఆరు బంతులు చొప్పున ఆడతాయి! కానీ ఇంగ్లండ్‌లో ఆ కాలంలో ఓవర్‌కి 5 బంతులే ఆడేవారు! హౌ ఈజ్ దాట్!! 2. రెండున్నర ‘నవమాసాలు’! ‘క్రిష్’ చిత్రంలో రోహిత్ (హృతిక్ రోషన్) రెండేళ్లుగా సింగపూర్‌లో ఉంటాడు. ఇక్కడ ఇండియాలో ఉన్న రోహిత్ భార్య ప్రీతీ జింతా ఈ రెండేళ్లూ ప్రెగ్నెంట్‌గానే ఉంటుంది! 3. పాట 1950ల సినిమాలో! ‘భాగ్ మిల్కా భాగ్’ మూవీ కథాంశం 1950ల నాటిది. అందులో ఫర్హాన్ అఖ్తర్ ‘నన్హా మున్నా రహీ హూ’ అనే పాట పాడతాడు. అయితే ఆ పాట 1962 నాటి ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రంలోనిది! భలే బుక్ అయ్యారు రాకేశ్ ఓం ప్రకాష్ మిశ్రా. మిశ్రా ఎవరా? ఆ సినిమా డైరెక్టర్. 4. రాంగ్ అడ్రస్! ‘పికె’ చిత్రంలో సర్ఫరాజ్ (సుశాంత్ సింగ్) తను బ్రూజెస్లోని పాకిస్తానీ రాయబార కార్యాలయంలో పనిచేస్తుంటానని జగ్గుతో (అనుష్క) చెబుతాడు. కానీ బ్రూజెస్లో ఆ కార్యాలయం లేదు. బ్రస్సెల్స్‌లో ఉంది. (ఈ రెండు ప్రాంతాలూ బెల్జియంలోనివే.) 5. రాంగ్ ట్రైన్ ఇదే సినిమాలో సంజయ్‌దత్ 12290 నెంబర్ ట్రైన్లో ఢిల్లీ వస్తాడు. కానీ అది ముంబై, నాగపూర్‌ల మధ్య నడిచే ‘దురంతో’ ఎక్స్‌ప్రెస్! ట్రైన్ మీద ‘కల్యాణ్’ అనే ఇంగ్లీషు అక్షరాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి... అది ‘దురంతో’ ఎక్స్‌ప్రెస్ అనేదానికి రుజువుగా. 6. క్రిస్టియన్ చితాభస్మం! ‘రా.1’ చిత్రంలో షారుఖ్ ఖాన్ దక్షిణాది హిందువు. అతడిని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం శవపేటికలో ఉంచి, ఖననం చేస్తారు! ఆ తర్వాత వచ్చే సీన్లో షారుఖ్ భార్య అతడి చితాభస్మాన్ని నదిలో కలుపుతూ కనిపిస్తుంది! దేవుడా!! 7. ‘టాప్’ మిస్టేక్ ‘జిందగీ న మిలేగీ దొబారా’ మూవీలో ఒకే సన్నివేశంలో కత్రినా కైఫ్ టీషర్ట్ కలర్ మారిపోతుంది. హృతిక్ రోషన్‌ని కలవడం కోసం ఈ పిల్ల తన ఫ్రెండ్ బైక్ అడిగి తీసుకుని బయల్దేరినప్పుడు పింక్ టాప్‌లో ఉంటుంది. తర్వాతి సీన్లో బైక్ దిగి, హృతిక్ రోషన్‌ని కలిసినప్పుడు మెరూన్ కలర్ టాప్‌లో ఉంటుంది. 8. బేతాళుడి బుక్ ‘యే జవానీ హై దీవానీ’ చిత్రంలో బన్నీ (రణబీర్ కపూర్), నైనా (దీపికా పదుకొనే) పట్టుకొని ఉన్న లగేజీతో పాటు, ఆమె చేతిలోని పుస్తకం కూడా అందుకుంటాడు. ఆ వెంటనే వచ్చే సీన్లో ఆ బుక్ ఇంకా నైనా చేతిలోనే ఉంటుంది! బేతాళుడు తిరిగి చెట్టెక్కినట్టుగా! 9. ఫోర్త్ ఇడియట్! ‘త్రీ ఇడియట్స్’ ఎండింగ్ సీన్లో సుహాస్ (ఆలివర్ సంజయ్ లఫాంట్) ఆల్రెడీ పెళ్లి మండపం లోపల ఉంటాడు. కానీ ఆ వెంటనే అతడు మెయిన్ గేటులో నుంచి పెళ్లి మండపంలోకి పరుగెత్తి వస్తూ కనిపిస్తాడు. 10. షేప్ మారిపోయింది ‘దమ్ లగాకే హైస్సా’ మూవీలో సంధ్యను కలవడానికి ప్రేమ్, అతడి కుటుంబం లేత నీలి రంగు ఆమ్నీ వ్యాన్‌లో బయల్దేరతారు. దారి మధ్యలో ఆమ్నీ కాస్తా డొక్కు వ్యానుగా మారిపోతుంది! 11. లేని చానల్లో అల్లర్ల న్యూస్! ‘కాయ్ పో చె’ చిత్రంలో గుజరాత్ అల్లర్ల సీన్ ఉంటుంది. ఆ అల్లర్లను సినిమాలో ‘హెడ్‌లైన్స్ టుడే’ ఛానల్ చూపిస్తూ ఉంటుంది. నిజానికి అప్పటికి ఆ ఛానల్ లేదు. అల్లర్లు జరిగింది 2002లో. చానల్ స్టార్ట్ అయింది 2003లో! -
గుండెపోటుతో బాలీవుడ్ నటుడు మృతి
-
గుండెపోటుతో బాలీవుడ్ నటుడు మృతి
ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ వివేక్ ఉపాధ్యాయ గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మరణించారు. ఓ సౌత్ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఆయన హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు. లగాన్ సినిమాలో ఆయన నటించిన గోరన్ పాత్రతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు పలు టివి షోలలోనూ రాజేష్ వివేక్ నటించారు. రాజేష్ వివేక్, శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో తెరకెక్కిన జునూన్ చిత్రంతో 1978లో సినీరంగ ప్రవేశం చేశారు. కెరీర్ స్టార్టింగ్ లో విలన్ రోల్స్ లో కనిపించిన రాజేష్ వివేక్, ఆ తరువాత కామెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. ఎవడే సుబ్రమణ్యం సినిమాలో పెంబా పాత్రలో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఎన్నో మంచి పాత్రలతో అలరించిన రాజేష్ వివేక్ ఉపాధ్యాయ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
ఆ సీక్వల్లో నటించటం లేదు
అమీర్ ఖాన్ కెరీర్లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే సెన్సేషనల్ సినిమా లగాన్. కమర్షియల్ సినిమా రాజ్యమేలుతున్న సమయంలో అమీర్ లాంటి స్టార్ హీరో స్వాతంత్ర్య సమరం నేపధ్యంతో తెరకెక్కించిన పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా లగాన్. ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా, తరువాత కమర్షియల్ గానూ ఘనవిజయం సాదించి, అస్కార్ రేసులో పోటి పండింది. ఇంతటి ఘనవిజయం సాధించిన లగాన్‌కు సీక్వల్ రూపొందించాలన్న ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. లగాన్ స్థాయి కథ కోసం ఇంతకాలం ఎదురుచూసిన దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఫైనల్‌గా ఈ సినిమా సీక్వల్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లాడానికి రెడీ అవుతున్నాడు. అయితే లగాన్ తొలి భాగంలో నటించిన నటీనటులు సీక్వల్లో నటించే అవకాశాలు మాత్రం కనిపించటం లేదు. లగాన్ సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసిన హీరో అమీర్ ఖాన్ సీక్వల్లోనటించటం లేదని ప్రకటించేశాడు. ప్రస్తుతం దంగల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అమీర్ లగాన్ సీక్వల్లో నటించడానికి ఇంట్రస్ట్ చూపించటం లేదు. హీరోయిన్గా మాత్రం బాలీవుడ్ నటి ప్రాచీ దేశాయ్‌ని ఫైనల్ చేశారు చిత్రయూనిట్. సినీ చరిత్రను మలుపు తిప్పిన లగాన్ సీక్వల్ హీరోగా ఎవరు నటిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
క్రికెట్ నేపథ్యంలో ఇలాంటి సినిమా రాలేదు :చిరంజీవి
‘‘క్రికెట్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. వాటిల్లో ‘లగాన్’ బెస్ట్ అని నా అభిప్రాయం. ఆటిజంతో బాధ పడుతున్న కుర్రాడికి క్రికెట్‌పై ఉన్న ప్రేమను ఇందులో చూపించారు. ఇప్పటివరకూ క్రికెట్ నేపథ్యంలో ఇలాంటి సినిమా రాలేదు. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిరంజీవి అన్నారు. స్నేహిత్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘సచిన్’. సుహాసిని ప్రత్యేక పాత్ర పోషించారు. ఎస్.మోహన్ దర్శకుడు. తానికొండ వెంకటేశ్వర్లు నిర్మాత. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో సినీ ప్రముఖులకు ప్రదర్శించారు. కె.విశ్వనాథ్, చిరంజీవి, టి.సుబ్బిరామిరెడ్డి, కుట్టి పద్మిని, మారుతి ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ- ‘‘నటిగా సుహాసిని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి మంచి సినిమాలో తాను భాగమైనందుకు ఆనందంగా ఉంది. స్నేహిత్ బాగా నటించాడు. దర్శకుడు మోహన్ చేసిన మంచి ప్రయత్నమిది’’ అన్నారు. 45 ఏళ్ల పైచిలుకు వయసులో 11 ఏళ్ల అబ్బాయికి అక్కగా నటించడం ఆనందంగా ఉందని, ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తామని సుహాసిని చెప్పారు. ఇందులో సుహాసిని నటన చూసి ఈర్ష్య కలిగిందని, కథ నచ్చి హిందీ హక్కులు తీసుకున్నానని నటి కుట్టి పద్మిని అన్నారు.