ఆస్కార్ బరిలో సత్తా చాటలనుకున్న బాలీవుడ్ మూవీ న్యూటన్ కు నిరాశే ఎదురైంది. ఇప్పటి వరకు ఆస్కార్ బరిలో ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం కేటగిరిలో లగాన్, మదర్ ఇండియా, సలాం బాంబే చిత్రాలు మాత్రమే ఫైనల్స్ వరకు వెళ్లాయి. ఈ సారి న్యూటన్ ఆ ఘనత సాదిస్తుందని భావించినా.. నిరాశే ఎదురైంది. 90వ ఆస్కార్ అవార్డ్స్ లో ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరిలో 98 విదేశీ సినిమాలు పోటిలో పడ్డాయి. వీటిలో కేవలం 9 సినిమాలు మాత్రమే ఫైనల్స్ కు చేరాయి. రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన న్యూటన్ కు ఫైనల్స్ లో చోటు దక్కలేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియపై తెరకెక్కిన న్యూటన్ సినిమాకు అమిత్ మసూర్కర్ దర్శకుడు.
ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం కేటగిరిలో ఫైనల్స్ కు చేరిన చిత్రాలు...
- ఫెలిసైట్
- ఆన్ బాడీ అండ్ సోల్
- ఎ ఫెంటాస్టిక్ ఉమెన్
- ఇన్ ది ఫేడ్
- ది ఇన్ సల్ట్
- ఫాక్స్ ట్రాట్
- లవ్ లెస్
- ది స్క‍్వేర్
- ది వూండ్
Comments
Please login to add a commentAdd a comment