
ప్యాకప్ చెప్పారు డైరెక్టర్. ఇంటికి వెళ్లిపోదామనుకున్న బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ చుట్టూ చేరారు అనిల్‌కపూర్, ఐశ్వర్యా రాయ్ అండ్ టీమ్. ఒక నిమిషం సైలెన్స్. ఆ నెక్ట్స్ కేక్ కటింగ్. మీరు ఊహించినట్లు రాజ్‌కుమార్ రావ్ బర్త్‌డే కాదు. ‘ఫ్యాన్నీఖాన్’ చిత్రంలో ఆయన వంతు షూటింగ్ కంప్లీటైనందుకు సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది టీమ్. అనిల్‌కపూర్, ఐశ్వర్యా రాయ్, రాజ్‌కుమార్ రావ్ ముఖ్య తారలుగా అతుల్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఫ్యాన్నీఖాన్’.
‘‘గ్రేట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. త్వరలో ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఆగస్టు 3న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రాజ్‌కుమార్ రావ్. అంటే ఇంతకాలం జూలైలో విడుదలవుతుందనుకున్న ‘ఫ్యాన్నీఖాన్’ ఆగస్టుకు వాయిదా పడిందన్నమాట. సెట్‌లో సెలబ్రేషన్సే కాదు, రిలీజ్ డేట్‌తో కూడా సర్‌ప్రైజ్ చేశారు టీమ్ అని అనుకుంటున్నారు బాలీవుడ్ మూవీ లవర్స్.
Comments
Please login to add a commentAdd a comment