Bollywood Art Director Nitin Desai Had A Debt Of Rs 250 Crores - Sakshi
Sakshi News home page

నితిన్‌ దేశాయ్‌ అకాల మరణం: అదే కొంప ముంచింది!

Published Wed, Aug 2 2023 4:52 PM

Bollywood Art Director Nitin Desai had debt of Rs 250 crores - Sakshi

Bollywood Art Director Nitin Desai: ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ (57) అకాల మరణం అటు పలువురి ప్రముఖులను ఇటు నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. అనుమానాస్పద మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ. బుధవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా  భావిస్తున్నారు. అయితే ఆయన మరణానికి సంబంధించి కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.   సుమారు రూ.252 కోట్ల అప్పులున్నాయని, ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే ఊహాగానాలు విని పిస్తున్నాయి.

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా,  కర్జాత్‌లోని ఎన్‌డీ స్టూడియోలోని అతని గదిలో నితిన్ దేశాయ్ మృతదేహం లభ్యమైంది. క్లీనింగ్ సిబ్బంది గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా.. ఈ విషయాన్ని గమనించారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత కర్జాత్, ఖలాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు సూపరింటెండెంట్ సోమనాథ్ ఘర్గే స్పష్టం చేశారు.

నివేదికల ప్రకారం నితిన్ దేశాయ్ కొన్ని ఆర్థిక సంస్థల నుండి ఫిక్స్‌డ్ టర్మ్ లోన్ తీసుకున్నాడు.అదే అతని జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టి వేసి, చివరికి మరణానికి దారి తీసింది. రూ. 180 కోట్ల రుణం వడ్డీతో కలిపి  రూ.252 కోట్లకు చేరింది. దీనికి సంబంధించి సదరుసంస్థ ఎన్‌డీ ‍స్టూడియోసీజ్‌కు సిద్ధమౌతోంది. కలీనాకు చెందిన ఎడెల్వీస్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ రాయగడ కలెక్టరేట్‌కు దరఖాస్తు చేసింది. కానీ జప్తు చర్యలకు కలెక్టర్ కార్యాలయం తుది అనుమతి ఇవ్వలేదు.

ఎన్‌డి స్టూడియో సీజ్‌కు సంబంధించిన దరఖాస్తు తన కార్యాలయానికి అందిందని రాయగడ రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్ సందేశ్ షిర్కే ధృవీకరించారు. కానీ జూలై 25న, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని ఎడెల్వీస్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరించింది. మార్చి 31, 2021న ఖాతాని  నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA)గా వర్గీకరించారని, జూన్ 30, 2022 నాటికి మొత్తం డిఫాల్ట్ మొత్తం  రూ.252.48 కోట్లుగా తేలింది.  (ఒప్పో కొత్త ఫోన్‌, ప్రారంభ ఆఫర్‌, ఫీచర్లు  ఎలా ఉన్నాయంటే..?)

నితిన్ దేశాయ్ వల్ల సీఎఫ్‌ఎం అనే ఆర్థిక సంస్థ నుంచి రూ.180 కోట్ల రుణం తీసుకున్నారు. 2 సంవత్సరాల 2016, 2018లో ఒప్పందం ప్రకారం దీని కోసం దేశాయ్ 40 ఎకరాల భూమి,ఇంకా  3 వేర్వేరు ఆస్తులను తనఖా పెట్టాడు. అనుకోని కారణాల వల్ల 2020నుంచి రుణం తిరిగి చెల్లించలేకపోయాడు.  కొంత సమయం తర్వాత CFM తన రుణ ఖాతాలన్నింటినీ ఎడెల్వీస్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి కేటాయించింది. అయితే అప్పుడు కూడా రుణం రికవరీ కాలేదు. దీంతో దీంతో దేశాయ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ విషయమై కొద్దిరోజుల క్రితం ఖలాపూర్ ఎమ్మెల్యే మహేష్ బల్దితో కూడా చర్చించినట్టు సమాచారం.

ఎమ్మెల్యే మహేష్ బల్ది ఏమన్నారు?
ఆర్థిక ఇబ్బందుల వల్లే నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు కర్జాత్ ఎమ్మెల్యే మహేశ్ బల్ది తెలిపారు. ఆయన మాట్లాడుతూ- నితిన్ దేశాయ్ తన నియోజకవర్గానికి నిత్యం వచ్చేవారు. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఉదయం ఎన్డీ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని వ్యాఖ్యానించారు. (రూ. 26,399కే యాపిల్‌ ఐఫోన్‌14: ఎలా? )

నితిన్ కుడిభుజం కాకా
ఎన్‌డీ స్టూడియోస్‌ను నడిపిన నితిన్ కుడిచేతిగా భావించే కాకా కూడా ఆర్థిక ఇబ్బందులగురించి మాట్లాడారు. కానీ ఇంత కఠిన నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరులకు ప్రేరణగా నిలిచేవ్యక్తి ఆయన. కొన్ని ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి.ఇంతలోనే ఇలా జరగడం విషాదకరమన్నారు. నితిన్ దేశాయ్  మరణంతో అక్షయ్ కుమార్, మేకర్స్  అప్‌కమింగ్‌ మూవీ OMG 2 ఆన్‌లైన్ ట్రైలర్ లాంచ్‌ను వాయిదా వేశారు. (Today August 2nd gold price గుడ్‌ న్యూస్‌: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు)

నాలుగు జాతీయ అవార్డులు,  అద్భుతమైన సినిమాలు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్ ,  దేవదాస్  మూవీలకు నాలుగు సార్లు జాతీయ అవార్డులను సాధించిన నితిన్‌ జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడంపై పలువురు నటులు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్లమ్‌డాగ్ మిలియనీర్,  కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్‌లను కూడా రూపొందించిన ఘనత ఆయన సొంతం. లగాన్, జోధా అక్బర్, మున్నాభాయ్ M.B.B.S., లగే రహో మున్నా భాయ్ అతను పనిచేసిన కొన్ని  ప్రముఖ బాలీవుడ్ సినిమాలు .

Advertisement
 
Advertisement
 
Advertisement