
రాజస్థాన్: ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రీవల్లభ వ్యాస్ ఆదివారం మరణించారు. వ్యాస్(60) ఇవాళ రాజస్థాన్‌లోని జైపూర్‌లో మృతిచెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. వ్యాస్ గుజరాత్ సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు 2008 అక్టోబర్‌లో పక్షవాతం వచ్చింది. 2013లో ఆయనను జైసల్మేర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స ఖర్చులను భరించే పరిస్థితి లేకపోవడంతో అక్కడి నుంచి జైపూర్‌కి తరలించారని చెప్పారు. సినిమా, టెలివిజన్ ఆర్టిస్టు అసోసియేషన్ వ్యాస్‌కు కనీస సహాయం కూడా అందించలేదని, మనోజ్ బాజ్‌పాయి, అమిర్ ఖాన్,ఇర్ఫాన్ ఖాన్ తదితరులు ఆదుకున్నారని వ్యాస్ భార్య శోభ పేర్కొన్నారు.
శ్రీవల్లభ వ్యాస్ దాదాపు 60 సినిమాలు, ఎన్నో టెలివిజన్ కార్యక్రమాలు చేశారు. అందులో సర్ఫరోష్ (1999), లగాన్ (2001), అభయ్ (2001), ఆన్: మెన్ ఎట్ వర్క్ (2004), నేతాజీ సుబోస్ చంద్రబోస్: ద ఫర్‌గాటెన్ హీరో (2005), సంకట్ సిటీ (2009), విరసత్ (1985) తదితర చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అందులో అమిర్ ఖాన్ చిత్రం ‘లగాన్’ ప్రత్యేకం.
Comments
Please login to add a commentAdd a comment