![Three Men Arrested For Assassinated Man To Refuse To Prepare Chapattis - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/29/crime_0.jpg.webp?itok=akBeBaeT)
జైపూర్: చాలా చాలా చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యల వరకు వెళ్లిపోవడం చూశాం. కానీ ఈ మధ్యకాలంలో మరీచిన్న చిన్న సమస్యలకే హత్యలు చేయడం, నరుక్కోవడం వరకు వెళ్లిపోతున్నారు. అంతేకాదు ఆ క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకుని జైలు గోడలకు అంకితమవుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే జైపూర్‌లో చోటు చేసుకుంది.
(చదవండి: నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!)
అసలు విషయంలోకెళ్లితే...ఆల్వార్ నివాసితులైన సంతోష్ మీనా (45), లీలా రామ్ మీనా (36), గంగా లహేరి (35), జై ప్రకాశ్ నారాయణ(27) విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేస్తున్నారు. అంతేకాదు వారంతా ఐస్ ఫ్యాక్టరీకి సమీపంలో ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. అయితే చపాతీలు తయారు చేసే వంట విషయంలో వాళ్ల నలుగురి మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. అయితే వారితో జై ప్రకాశ్‌నారాయణ్ అనే వ్యక్తి తాను ఇతరుల కోసం చపాతీలను చేయను అని చెప్పడమే కాక ఆ ముగ్గురి పై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డాడు.
దీంతో ఆ ముగ్గురు ఆవేశంతో జైప్రకాశ్ నారాయణని చంపేయాలని నిర్ణయించుకుంటారు. అంతేకాదు అనుకున్నదే తడువుగా జై నారాయణ్ వాష్‌రూమ్‌కి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించి గొంతుకోసి చంపేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురు బాధితుడిని వదిలి వెళ్లిపోయారు. ఈ మేరకు జైపూర్ పోలీసుల ఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి విచారించడమే కాక ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
(చదవండి: ఆ వైరస్‌ని చూసి భయపడుతూ.. తిట్టుకుంటూ కూర్చోవద్దు!!)
Comments
Please login to add a commentAdd a comment