భార్య గొంతు కోసిన భర్త | husband Cut His Wife Throat | Sakshi
Sakshi News home page

భార్య గొంతు కోసిన భర్త

Published Mon, Oct 28 2024 10:56 AM | Last Updated on Mon, Oct 28 2024 10:56 AM

husband Cut His Wife Throat

జమ్మలమడుగు: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త బ్లేడ్‌తో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులోని ఎస్సీ కాలనీకి చెందిన మేరీ, విజయ్‌ భార్యభర్తలు. విజయ్‌ ఆటోలో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. కొంత కాలంగా మేరీపై అనుమానం పెంచుకున్నాడు. తన భార్య ఇతరులతో సంబంధం పెట్టుకుందనే అనుమానించేవాడు. భార్యతో పాటు ఆదివారం ప్రార్థన కోసం టౌన్‌ చర్చికి వచ్చాడు. 

ప్రార్థన చేస్తున్న సమయంలో ఉన్నట్లుండి భర్త విజయ్‌ తనతోపాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో భార్య మేరీ గొంతు కోశాడు. గొంతు, మెడ దగ్గర తీవ్ర గాయాలై రక్తస్రావం ఎక్కువగా అవుతుండటంతో స్థానికులు రక్త స్రావం జరుగకుండా గుడ్డను గొంతుకు కట్టి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, మొదటి భార్య చనిపోవడంతో విజయ్‌ ఎస్సీ కాలనీకి చెందిన మేరీని 15 ఏళ్ల క్రితం రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం . ఒక బాబు పీఆర్‌ ఉన్నత పాఠశాలలో చదువుతుండగా.. మరో బాబు గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement