throat cut
-
భార్య గొంతు కోసిన భర్త
జమ్మలమడుగు: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త బ్లేడ్‌తో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని ఎస్సీ కాలనీకి చెందిన మేరీ, విజయ్ భార్యభర్తలు. విజయ్ ఆటోలో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. కొంత కాలంగా మేరీపై అనుమానం పెంచుకున్నాడు. తన భార్య ఇతరులతో సంబంధం పెట్టుకుందనే అనుమానించేవాడు. భార్యతో పాటు ఆదివారం ప్రార్థన కోసం టౌన్ చర్చికి వచ్చాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో ఉన్నట్లుండి భర్త విజయ్ తనతోపాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో భార్య మేరీ గొంతు కోశాడు. గొంతు, మెడ దగ్గర తీవ్ర గాయాలై రక్తస్రావం ఎక్కువగా అవుతుండటంతో స్థానికులు రక్త స్రావం జరుగకుండా గుడ్డను గొంతుకు కట్టి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, మొదటి భార్య చనిపోవడంతో విజయ్ ఎస్సీ కాలనీకి చెందిన మేరీని 15 ఏళ్ల క్రితం రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం . ఒక బాబు పీఆర్ ఉన్నత పాఠశాలలో చదువుతుండగా.. మరో బాబు గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. -
చపాతీలు కోసం చంపేశారు..!
జైపూర్: చాలా చాలా చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యల వరకు వెళ్లిపోవడం చూశాం. కానీ ఈ మధ్యకాలంలో మరీచిన్న చిన్న సమస్యలకే హత్యలు చేయడం, నరుక్కోవడం వరకు వెళ్లిపోతున్నారు. అంతేకాదు ఆ క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకుని జైలు గోడలకు అంకితమవుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే జైపూర్‌లో చోటు చేసుకుంది. (చదవండి: నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!) అసలు విషయంలోకెళ్లితే...ఆల్వార్ నివాసితులైన సంతోష్ మీనా (45), లీలా రామ్ మీనా (36), గంగా లహేరి (35), జై ప్రకాశ్ నారాయణ(27) విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేస్తున్నారు. అంతేకాదు వారంతా ఐస్ ఫ్యాక్టరీకి సమీపంలో ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. అయితే చపాతీలు తయారు చేసే వంట విషయంలో వాళ్ల నలుగురి మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. అయితే వారితో జై ప్రకాశ్‌నారాయణ్ అనే వ్యక్తి తాను ఇతరుల కోసం చపాతీలను చేయను అని చెప్పడమే కాక ఆ ముగ్గురి పై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆ ముగ్గురు ఆవేశంతో జైప్రకాశ్ నారాయణని చంపేయాలని నిర్ణయించుకుంటారు. అంతేకాదు అనుకున్నదే తడువుగా జై నారాయణ్ వాష్‌రూమ్‌కి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించి గొంతుకోసి చంపేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురు బాధితుడిని వదిలి వెళ్లిపోయారు. ఈ మేరకు జైపూర్ పోలీసుల ఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి విచారించడమే కాక ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఆ వైరస్‌ని చూసి భయపడుతూ.. తిట్టుకుంటూ కూర్చోవద్దు!!) -
యువకుడి దారుణ హత్య
చందుర్తి(వేములవాడ):చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బైరగోని తిరుపతి(30)ని ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నర్సింగాపూర్‌కు చెందిన తిరుపతి కల్లు మండువలో ముగ్గురు వ్యక్తులకు కల్లు విక్రయించాడు. కల్లు పోస్తుండగా సేవించిన వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారా? భూ వివాదమే హత్యకు దారి తీసిందా తెలియాల్సి ఉంది. కల్లు సేవించేందుకు వచ్చి ముగ్గురు ఏ గ్రామానికి చెందినవారో గుర్తిస్తే అసలు విషయాలు బయటపడుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఘటన స్థలంలో పల్సర్‌బైక్‌తో పాటు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బైక్‌కు నంబర్ లేకపోవడంతో చాయిస్నంబర్ ఆధారంగా వివరాలు సేకరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. భూ వివాదమే కారణమా..? చందుర్తి మండలం మూడపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ భూమి కోసం అక్కాచెల్లెళ్ల కుమారుల మధ్య వివాదం ఉన్నట్లు సమాచారం. అమ్మమ్మకు చెందిన భూమి తమకే దక్కాలంటూ అక్కాచెల్లెళ్ల కొడుకులు కోర్టు వరకు వెళ్లినట్లు తెలిసింది. ఇటీవలే తిరుపతికి కోర్టు జడ్జిమెంట్ అనుకూలంగా రాగా, దీనిని దృష్టిలో పెట్టుకొని బంధువులే హత్యకు పాల్పడ్డరా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటన స్థలానికి డాగ్‌స్క్వాడ్ వచ్చినా వర్షం పడడంతో ప్రయోజనం లేకుండాపోయింది. గుండెలవిసేలా రోదిస్తున్న కుటుంబ సభ్యులు.. బైరగోని పెద్దమల్లయ్య– రాజవ్వ దంపతులకు నలుగురు సంతానం కాగా ముగ్గురు కూతుళ్లు. తిరుపతి చిన్నవాడు కావడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ‘భూమి కోసం పాణం తీసిండా కొడుకా’ అంటూ తల్లి రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. మృతుడికి భార్య సహస్ర, నెల రోజుల వయస్సు గల పాప ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భర్తకు అక్రమ బంధం గురించి తెలిస్తే బాగుండదని..
తలకొండపల్లి: ఓ వ్యక్తి గొంతు కోసి అడవిలో వదిలేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 10న ఫరూక్నగర్ మండలం వెంకన్నగూడెంకు చెందిన కొడావత్ రాజును గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి మండలంలోని నల్లమెట్టు అటవీ శివారు ప్రాంతంలో వదిలేసిన విషయం పాఠకులకు విదితమే. ఈ కేసులో రాజు భార్య శాంతిని, బామ్మర్ది శీనును, ఫంక్షన్‌హాల్ ఓనర్ ఎండీ యూసూప్, ఆయన చిన్నాయన జహీరోద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఎస్ఐ బీఎస్ఎస్ వరప్రసాద్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. (గొంతు కోసి.. అడవిలో వదిలేసి) రెండేళ్ల క్రితం.. బాధితుడు రాజు రెండేళ్ల కితం తన భార్య పిల్లలతో కలిసి కుటుంబ పోషణ నిమిత్తం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. బండ్లగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరి సంసారం సాఫీగా సాగిపోసాగింది. ఏడాది కితం రాజు భార్య శాంతికి ఫంక్షన్ హాల్ ఓనర్ ఎండీ యూసూఫ్‌తో పరిచయం ఏర్పడింది. వీరు పరిచయం కాస్తా ప్రేమగా ఏర్పడి వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. గత కొన్ని రోజులుగా అన్యోన్యంగా ఉండసాగారు. భవిష్యత్‌లో రాజుకు అక్రమ సంబంధం గురించి తెలిస్తే బాగుండదని వీరిరువురు (శాంతి, యూసూఫ్) ఒక్క నిర్ణయానికి వచ్చారు. మన అక్రమ సంబంధానికి అడ్డు పడుతాడని భావించారు. ముందు జాగ్రత్తగా రాజును హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు శాంతి అన్న శ్రీను, యూసూప్ చిన్నాయన జహీరోద్దీన్‌ల సహకారం తీసుకున్నారు. నలుగురు కలిసి పక్కా ప్లాన్ వేశారు. బయటికి వెళదామని.. ఈనెల 10న రాజుకు మాయమటలు చెప్పి బయటికి వెల్దామని ఆ నలుగురు చెప్పారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి రాజుతో పాటు నలుగురు కారులో బయలుదేరారు. మార్గ మధ్యలో రాజుకు మందు తాగించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో మండలంలోని నల్లమెట్టు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. రాజు దిగి మూత్రం పోస్తుండగా ఈ నలుగురు ఆయనను పొదల్లోకి లాక్కుపోయారు. చాక్‌తో గొంతు కోశారు. తీవ్రమైన రక్తం కారడంతో రాజు చనిపోతాడని భావించి వదిలేశారు. రాజు నడుచుకుంటూ మరుసటి రోజు ఉదయం రోడ్డు పైకి వచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చికిత్స నిమిత్తం రాజును హైదరాబాద్ ఈఎన్టీ ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం పోలిసులు గాలింపు చర్యలు చేపట్టారు. పక్కా వ్యూహంతో వల పన్ని పోలీసులు నిందితులను పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్ఐ చెప్పారు. -
ఆరేళ్ల బాలిక గొంతు కోసిన యువకుడు
-
బాలుడి గొంతు కోసిన యువకుడు
చెన్నై,తిరువొత్తియూరు: ఇంటి తాళంచెవి ఇవ్వలేదని పక్కింటి వారితో గొడవ పడి, కత్తితో చిన్నారి గొంతు కోసి పారిపోయిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు చెన్నైలోని తిరువళ్లూరు వీధికి చెందిన వివేక్ కుమార్ పెయింటర్. అతని భార్య ప్రియ. వీరికి ఒకటిన్నరేళ్ల సాయి చరణ్ అనే కుమారుడు ఉన్నాడు. వీరి పక్కింటిలో నివాసం ఉంటున్న దంపతుల కుమారుడు ఆకాష్ (19). అతనికి గంజాయి, మద్యం అలవాటు ఉంది. ఈ క్రమంలో ఆకాష్ తల్లిదండ్రులు బుధవారం ఇంటికి తాళం వేసి ప్రియకు ఇచ్చి వెళ్లారు. సాయంత్రం ఇంటి వద్దకు వచ్చిన ఆకాష్ తన ఇంటి తాళం ఇవ్వమని ప్రియను అడిగాడు. అయితే కుమారుడికి తాళం ఇవ్వొద్దని అతని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ప్రియ తన వద్ద తాళం లేదని ఆకాశ్‌కు చెప్పింది. దీంతో ఆగ్రహించిన అతను ప్రియతో గొడవ పడ్డాడు. అక్కడే ఆడుకుంటున్న సాయిచరణ్‌పై కూరగాయల కత్తితో దాడి చేశాడు. దానిని అడ్డుకోవాలని చూసిన ప్రియ తల్లి శారదపై దాడి చేసి పారిపోయాడు. తీవ్ర గాయాలతో తల్లడిల్లుతున్న సాయిచరణ్, శారదలను స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం చిన్నారి సాయిచరణ్‌ను చెన్నై ఎగ్మూర్ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పుళల్ పోలీసులు కేసు నమోదు చేసి ఆకాష్‌ను గురువారం ఉదయం అరెస్టు చేశారు. మాధవరం కోర్టులో హాజరుపరిచి విచారణ అనంతరం జైలుకు తరలించారు. -
మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని.. దారుణం
-
దారుణం : చిన్నారి గొంతు కోసిన యువకుడు
సాక్షి, గుంటూరు : జిల్లాలోని అచ్చంపెటలో దారుణం జరిగింది. మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని ఓ మహిళపై దాడి చేసి ఆమె కూతురు గొంతుకోశాడు ఓ తాగుబోతు యువకుడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అచ్చంపేటకు చెందిన రాజ్యలక్ష్మీ అనే మహిళ తన కూతురు శివదుర్గతో కలిసి జీవిస్తోంది. ఇటీవల ఆమె భర్త మరణించారు. దీంతో కూలీ పనిచేస్తూ చిన్నారితో కలిసి ఉంటుంది. పక్క గ్రామానికి చెందిన వీరయ్యతో రాజ్యలక్ష్మీ సన్నిహిత సంబంధం ఏర్పడింది.తరచూ వీరయ్య ఆమె ఇంటికి వచ్చి వేళ్లేవాడు. కాగా మంగళవారం వీరయ్య రాజ్యలక్ష్మీ ఇంటికి వచ్చి మద్యం కోసం డబ్బులు అడిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో ఆమెపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. అనంతరం చిన్నారి గొంతు కోసి పారిపోయాడు. స్థానికుల సహాయంతో రాజ్యలక్ష్మీ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తులం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు రాజ్యలక్ష్మీ ఇంటికి వచ్చి పరిశీలించారు. వీరయ్యపై కేసు నమోదు చేసుకొని, గాలింపు చర్యలు ప్రారంభించారు. -
మాంజా..పంజా..
సాక్షి, సిటీబ్యూరో: బైక్‌పై వేగంగా ఇంటికి వెళ్తున్న ఓ యువకుడిని చైనా మాంజా రూపంలో ప్రమాదం వెంటాడింది. అయితే సకాలంలో వైద్యసేవలు అందడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్బుల్ కటింగ్ వర్క్ చేసే శామీర్‌పేట బాలాజీనగర్‌కు చెందిన అశోక్‌గుప్తా (33) మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు పని ముగించుకుని బైక్‌పై జవహర్‌నగర్ నుంచి ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో గాలికి వేలాడుతున్న ఓ చైనా మాంజా ఆయన మెడకు బలంగా తగిలింది. దీంతో ఆయన గొంతుపై సుమారు పది సెంటిమీటర్ల పొడవు, అర సెంటి మీటరు గాయమై లోతుగా తెగింది. రక్తమోడుతున్న ఆయనను చికిత్స కోసం బంధువులు స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాధమిక చికిత్స అనంతరం ఆయనను మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సచివాలయం సమీపంలోని మాక్స్‌క్యూర్ ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెనీ విభాగం అధిపతి డాక్టర్ సతీష్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శివరామ్ నేతృత్వం లోని వైద్య బృందం వెంటనే ఆయనను ఆపరేషన్ థియేటర్‌కు తరలించి గాయానికి కుట్లు వేశారు. రక్తస్త్రావాన్ని నివారించి, ప్రాణాపాయం నుంచి రక్షించారు. అదృష్టవశాత్థు ప్రధాన రక్తనాళాలతో పాటు కీలకమైన శ్వాసనాళాలకు ఎలాంటి గాయం కాకపోవడంతో అశోక్గుప్తాకు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడు. మరో నాలుగైదు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్చి చేసే అవకాశం ఉందని వైద్యనిపుణులు స్పష్టం చేశారు. సింథటిక్ దారాలకు మెటల్ కోటింగ్ వల్లే.. సంక్రాంతి సెలవుల్లో పిల్లలు, పెద్దలు పతంగులు ఎగరేయడం తెలిసిందే. పతంగులకు సంప్రదాయ కాటన్ దారానికి బదులు తక్కువ ధరకు వచ్చే చైనా మాంజా వాడటం, వాటికి సింథటిక్, గ్లాస్, మెటల్ కోటింగ్ వేయడం వల్ల అవి శరీరానికి తగిలినప్పుడు కోసుకుపోతుంటాయి. ఈ మాంజా కోసుకుపోవడం వల్ల శరీరంపై లోతైన గాయాలు కావడంతో పాటు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాటిని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యనిపుణులు స్పష్టం చేశారు. -
ఐ లవ్ యూ... నన్ను చంపొద్దు అని వేడుకున్నా..
తార్నాక: తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో అనూష అనే ఇంటర్ విద్యార్థినిని అతి కిరాతకంగా బ్లేడుతో గొంతు కోసి హత్య చేసిన ప్రేమోన్మాది ఆరెపల్లి వెంకట్‌ను ఓయూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఓయూ పోలీస్ స్టేషన్లో బుధవారం ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్ వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ పార్శిగుట్ట అంబర్ నగర్‌కు చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి హరిప్రసాద్ కుమార్తె అనూష నారాయణగూడలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది, అదే ప్రాంతానికి చెందిన ఆరెçపల్లి రవీందర్ కుమారుడు వెంకట్ హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. పదో తరగతిలో ట్యూషన్ సెంటర్లో వారి మధ్య ఏర్పడిన పరిచయం గత రెండేళ్లుగా కొనసాగుతోంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అనూష గత నెలరోజులుగా వెంకట్‌తో మాట్లాడటం మానేసింది. ఆమెతో మాట్లాడేందుకు వెంకట్ పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అనూషపై కోపాన్ని పెంచుకున్న వెంకట్ ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకంలో భాగంగా జేబులో బ్లేడు పెట్టుకుని గత నెల రోజులుగా అనూష ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నాడు. మంగళవారం అనూష తన స్నేహితురాలితో కలిసి వెళుతుండటాన్ని గుర్తించాడు. అనూష ఇంట్లోకి వెళ్లగానే ఆమె స్నేహితురాలి వద్దకు వెళి బైక్ కీ లాక్కున్నాడు. అనూషను జామై ఉస్మానియా రోడ్డు వద్దకు తీసుకువస్తేనే బైక్ కీ ఇస్తానంటూ బైక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గత్యంతరం లేక ఆమె ఈ విషయాన్ని అనూషకు చెప్పడంతో ఇద్దరూ కలిసి జామై ఉస్మానియా రోడ్డుకు వచ్చారు. అక్కడికి వచ్చిన వెంకట్ బైక్‌ను తిరిగి ఇవ్వడంతో అనూష స్నేహితురాలు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం అనూషను దూర విద్యాకేంద్రం సమీపంలోని పాడుబడిన పోలీసు క్వార్టర్స్ వద్దకు తీసుకెళ్లిన వెంకట్ తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ‘నీవన్నా, నీ క్యారెక్టర్ అన్నా నాకు నచ్చడం లేదు. అందుకే నిన్ను అవాయిడ్ చేస్తున్నానని’ అనూష చెప్పడంతో ఆగ్రహించిన అతను జేబులో ఉన్న బ్లేడ్ తీసి ఆమె గొంతుపై రెండు గాట్లు పెట్టాడు. దీంతో భయాందోళనకు గురైన అనూష తనను చంపొద్దని వేడుకున్నా వినకుండా బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. స్పహకోల్పోయిన అనూషను మరో గదిలో పడేసి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, అప్పటికే ఆమె ఆర్తనాదాలు విని అక్కడికి చేరుకున్న ముగ్గురు యువకులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకట్‌ను అదుపులోకి తీసుకుని అనూషను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అప్పటికే ఆమె మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి అనూష కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు డీసీపీ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో కాచిగూడ డివిజన్ ఏసీపీ నర్సయ్య, ఓయూ ఇన్స్పెక్టర్ జగన్ పాల్గొన్నారు. పక్కా ప్లానింగ్ రెండేళ్లుగా ప్రేమించుకున్నాం. చివరకు నా కారెక్టర్ మంచిది కాదని.. నాతో మాట్లాడటం మానేసింది. ఆమెతో మాట్లాడేందుకు ఎంతో ప్రయత్నించాను. అయినా పట్టించుకోలేదు. నా ఫోన్‌కాల్స్ రిజెక్టులో పెట్టడంతో ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాను. పథకం ప్రకారమే రప్పించి హత్య చేశానని ఉన్మాది వెంకట్ పేర్కొన్నాడు. పాడుబడిన క్వార్టర్లలోకి తీసుకువెళ్లి అక్కడా అడిగాను.. అయినా ఆమె మనుసు మార్చుకోకుండా అలాగే మాట్లాడటంతో జేబులో నుంచి బ్లేడు తీసి గొంతుపై కోయడంతో భయపడిన అనూష .. ‘ఐ లవ్ యూ... ఐ లవ్ యూ... నన్ను చంపొద్దు’ అంటూ వేడుకున్నా పట్టించుకోకుండా ఆమె గొంతును కోసినట్లు తెలిపాడు. అనంతరం ఆమెను మరో గదిలోకి ఈడ్చుకెళ్లి పడేసి పారిపోయేందుకు ప్రయత్నించానన్నాడు. -
తాగిన మైకంలో..
చందానగర్ : తాగిన మైకంలో స్నేహితుడిని కత్తితో గొంతు కోసి హత్య చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ తిరుపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...చందానగర్‌లోని హుడా కాలనీకి చెందిన అజయ్ దీప్రాజ్ (20) ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. శేర్లింగంపల్లి గోపీనగర్‌కు చెందిన సంపత్ అతడికి చిన్ననాటి స్నేహితుడు. ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన సంపత్ అజయ్ దీప్‌రాజ్‌ను బయటికి తీసుకెళ్లాడు. రాత్రి తొమ్మిది గంటల సమంలో మద్యం తాగిన వీరు హుడా ట్రేడ్ సెంటర్ వద్ద ఘర్షణ పడ్డారు. నాలుగేళ్ల క్రితం జరిగిన గొడవను మనస్సులో పెట్టుకున్న సంపత్ అజయ్‌పై దాడి చేసి కత్తితో గొంతుకోశాడు. తీవ్రంగా గాయపడిన అజయ్‌ను అతని సోదరుడు పృధ్వీ మదీనాగూడలోని అర్చన ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి నీరేడు డానియెల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సంపత్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
పెళ్ళైన మూడు నెలలకే..
తూర్పుగోదావరి ,ఏలేశ్వరం: కలకాలం కలిసి ఉంటానని ప్రమాణం చేసి పెళ్లాడిన ఆ భర్త.. కట్టుకున్న భార్యను మూడు నెలలకే కడతేర్చాడు. నిద్రపోతున్న భార్య పీకను కత్తితో కోయడంతో ఆమె అక్కడిక్కడే తనువు చాలించింది. పోలీసుల కథనం ప్రకారం అడ్డతీగల గ్రామానికి చెందిన రొట్టా బాపనయ్య, వరలక్ష్మి దంపతుల కుమారై గ్రంధి స్వరూపరాణి (20)ని వరలక్ష్మి అన్న గ్రంధి అప్పారావు కుమారుడు ఈశ్వరరావుకు ఇచ్చి గత మే నెలలో వివాహం చేశారు. ఇతడు కోళ్ల మాంసం విక్రయిస్తుంటాడు. పెళ్లయిన దగ్గర నుంచి వారి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో ఆమె వేధింపులు ఎక్కువయ్యాయి. అనేకసార్లు తల్లికి పరిస్థితిని ఆమె చెప్పింది. అయితే తల్లి సర్దిచెబుతూ వచ్చిం ది. సోమవారం తెల్లవారు జామున నిద్రలో ఉన్న ఆమెను భర్త కత్తితో పీక కోశాడు. సమాచారం అందుకున్న సీఐ అద్దంకి శ్రీనివాసరావు, ఎస్సైలు ఏలేశ్వరం, ప్రత్తిపాడు, అన్నవరం ఎం.అప్పలనాయుడు, అశోక్, పార్థసారథి, తహసీల్దార్ రవీంద్రకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాల సేకరించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గొంతు కోసుకున్న ఆటోవాలా
చీమకుర్తి రూరల్: స్థానిక బస్టాండ్‌లో శుక్రవారం సాయంత్రం ఆటో డ్రైవర్ వి. వేణుగోపాల్‌రెడ్డి బ్లేడుతో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేణుగోపాల్‌రెడ్డి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే విధంగా ఆటోను నిలబెట్టాడు. ఇలాంటి ఆటోలను పోలీస్ స్టేషన్‌కు తీసుకురమ్మని పోలీసులు హెచ్చరించారు. దీంతో వేణుగోపాల్‌రెడ్డి ఆటోను పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకుపోయాడు. అయితే అతను మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించి డ్రంక్ అండ్ డ్రైవ్ కింద నమోదు చేశారు. అయితే పోలీసులు వేధింపులు ఎక్కువయ్యాయని, పెనాల్టీలు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో మనస్తాపం చెందిన వేణుగోపాల్ రెడ్డి బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు చీమకుర్తిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకుపోయి చికిత్స చేయించటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గతంలో కేసులున్నాయి.. తాళ్లూరు మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి ప్రతిరోజూ చీమకుర్తి, ఒంగోలుకు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. 2013లో చీమకుర్తి పోలీస్ స్టేషన్లో వాహనాల దొంగతనం ఘటనలో రెండు కేసులు ఉన్నట్లు ఎస్సై జీవీ చౌదరి తెలిపారు. గతంలో ఒంగోలులో కూడా ఓ ప్రమాదానికి కారణంగా నిలిచాడని పోలీసులు తెలిపారు. డ్రైవింగ్‌లో సరైన అనుభవం లేక ప్రమాదాలకు గురికావడం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నిద్రిస్తున్న వ్యక్తిపై కత్తితో దాడి రాచర్ల: నిద్రిస్తున్న వ్యక్తిపై కత్తితో దాడి చేసిన సంఘటన మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గురువారం రాత్రి జరిగింది. ఈ సంఘటనలో గుమ్ముళ్ల రమణకు గొంతుపై తీవ్ర గాయాలయ్యాయి. అందిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన గుమ్ముళ్ల రమణ అనే వ్యక్తి గొర్రెల పాక వద్ద నిద్రిస్తుండగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో అదే కాలనీకి చెందిన మండాది ఓబులేసు అనే వ్యక్తి పాత కక్షలు మనసులో పెట్టుకుని రమణ గొంతుపై కత్తితో కోశాడు. దీంతో రమణకు తీవ్ర గాయమైంది. నిద్ర నుంచి తేరుకునేలోగా ఓబులేసు అక్కడ నుంచి పరారయ్యాడు. కత్తి గాయానికి గురైన రమణయ్యను కుటుంబ సభ్యులు గిద్దలూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు. -
కోర్టు ప్రాంగణంలోనే భార్యను చంపిన భర్త
గౌహతి: అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. కన్నకూతురిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి కోర్టు ప్రాంగణంలోనే తన భార్యను గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చాడు. నిందితుడు పూర్ణ నహర్ కన్నకూతురును అత్యాచారం చేశాడనే ఆరోపణలతో 9 నెలలు జైళ్లో గడిపి ఇటీవలే బెయిల్‌పై బయటికి వచ్చాడు. విచారణ నిమిత్తం శుక్రవారం కోర్టుకు హాజరైన అతను అకస్మాత్తుగా భార్య రీటా నహర్పై దాడి చేశాడు. వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
భార్యను గొంతు కోసి చంపిన కిరాతకుడు
ప్రకాశం ,బద్వీడు (పెద్దారవీడు): వ్యసనాలకు బానిసైన భర్త.. భార్యను అతి కిరాతకంగా గొంతుకోసి చంపాడు. ఈ సంఘటన మండలంలోని బద్వీడులో శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన నాగమణి (25)ని ఆమె మేనత్త కుమారుడు ప్రగళ్లపాడుకు చెందిన వెంగళయ్య వివాహం చేసుకున్నాడు. వెంగళయ్య కొంతకాలం నుంచి అత్తగారింట్లోనే ఉంటున్నాడు. కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చి భార్యను హింసిస్తున్నాడు. దంపతలు మధ్య తరుచూ ఏర్పడే వివాదాలను గ్రామస్తులు, పెద్దలు పరిష్కరించేవారు. బతకుదెరువు కోసం భార్యతో కలిసి వెంగళయ్య మార్కాపురం, త్రిపురాంతకం, గుంటూరు జిల్లా గొల్లెపల్లెలో కాపురం పెట్టాడు. అక్కడ కూడా ఇంట్లోని వస్తువులు తాకట్టు పెట్టి మద్యం తాగేవాడు. భార్యపై వేధింపులు కూడా అలాగే కొనసాగించాడు. గొల్లపల్లెలో తరుచూ దంపతులు గొడవ పడుతుండటంతో స్థానికులు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నాగమణి తన తమ్ముడికి ఫోన్ చేసి తక్షణమే తనను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని కోరింది. ఆమె తమ్ముడు వచ్చి అప్పటికే తన బావ వెంగళయ్య తాకట్టులో ఉంచిన వస్తువులకు రూ.10 వేలు కట్టి విడిపించాడు. ఆటోలో సామగ్రితో పాటు అక్క, బావతో కలిసి స్వగ్రామం బయల్దేరారు. మార్గమధ్యంలో భార్య, బావమరిది గాలెయ్యను కర్రలతో కొట్టుతుండటంతో స్థానికులు వెంగళయ్యను మందలించి వారిని లారీలో సాగనంపారు. అంత వరకూ ఓకే.. దంపతులు బద్వీడులో అత్తగారింట్లో కాపురం ఉన్నారు. కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయినా తరుచూ భార్యతో గొడవపడుతూ కొట్టుతున్నాడు. గొడవ ఎక్కువ చేస్తుండటంతో గురువారం అదే గ్రామంలో అద్దె ఇంట్లో సామగ్రి చేర్చారు. ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు యజమానికి ఇష్టం లేకున్నా గ్రామస్తులు నచ్చజేప్పి ఇప్పించారు. రాత్రి పిల్లలు నాగమణి తల్లి ఇంట్లో నిద్రించారు. దంపతులు మాత్రం అద్దె ఇంట్లో ఉన్నారు. అర్ధరాత్రి కత్తితో నాగమణి గొంతుకోసి చంపి తలుపులు మూసి వెంగళయ్య ఎటో వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం అమ్మమ్మ ఇంటి నుంచి పిల్లలు తల్లిదండ్రుల కోసం వచ్చారు. ఎంతకూ తల్లి పలకకపోవడంతో పెద్దగా కేకలేశారు. ఇరుగుపొరుగు వచ్చి చూడగా నాగమణి నిర్జీవంగా రక్తపు మడుగులో పడి ఉంది. మృతురాలి తల్లి రోదన గ్రామస్తులను కంటతడి పెట్టించింది. వీఆర్వో ఏడుకొండలు ఫిర్యాదు మేరకు మార్కాపురం సీఐ భీమానాయక్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్ తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఇన్చార్జి తహసీల్దార్ రమణారావు సమక్షంలో వైద్యులు పంచనామా నిర్వహించారు. -
అవినీతి కాంట్రాక్టర్ల గొంతు కోస్తా!
న్యూఢిల్లీ: అవితినీకి పాల్పడితే గొంతు కోస్తానంటూ కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లోని ఆర్రా స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సింగ్ శనివారం తన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఏ కాంట్రాక్టరైనా అవినీతికి పాల్పడితే అలాంటివారి గొంతుకోసి, కేసు పెట్టి, జైలుకు పంపిస్తా’ అని హెచ్చరించారు. అందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటకొచ్చింది. -
చెల్లిని వేధిస్తున్నాడని..!
=యువకుడి గొంతు కోసిన బాధితురాలి సోదరులు =పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు ‘మా చెల్లికి నిశ్చితార్థమైంది. రేపోమాపో అత్తారింటికి వెళ్తోంది. ఇక ఆమెను వేధించొద్దు’ అని యువతి సోదరులు తమ చెల్లిని వేధిస్తున్న యువకుడిని వేడుకున్నారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. తరచూ వారి ఇంటి వైపు వస్తుండటంతో జీర్ణించుకోలేక పోయారు. ఎలాగైనా అతడిని మట్టుబెట్టాలని కాపుకాశారు. బలవంతంగా లాకెళ్లి దారుణంగా గొంతు కోశారు. యువకుడు అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన బుధవారం ఆలూరులో చోటు చేసుకుంది. ఆలూరు రూరల్ ఆలూరు ఎస్సీ కాలనీకి చెందిన సురేంద్ర అదే కాలనీకి చెందిన ఓ యువతిని కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. వెంటపడి తననే పెళ్లి చేసుకోవాలని భయాందోళనకు గురి చేశాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు, అన్నలకు చెప్పింది. దీంతో వారు యువకుడిని యువకుడిని మందలించారు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం యువతికి వేరే గ్రామానికి చెందిన వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేశారు. అయినా సురేంద్ర ఆ యువతిని వేధిస్తుండటంతో పాటు పెళ్లి కూడా కాకుండా అడ్డుకుంటానని హెచ్చరించాడు. దీంతో అతనిపై కక్ష కట్టిన ఆ యువతి సోదరులు జగన్, నాగరాజు నెల క్రితమే సురేంద్రను చంపేందుకు కుట్ర పన్నారు. విషయం తెలుసుకున్న సురేంద్ర తల్లిదండ్రులు తమ కుమారుడిని బెంగళూరుకు వలస పంపారు. కాగా ఇటీవల బెంగళూరులో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్న సురేంద్ర సోదరుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. అన్న అంత్యక్రియలకు హాజరైన సురేంద్ర తిరిగి బెంగళూరుకు వెళ్లకుండా గ్రామంలోనే ఉండి మళ్లీ యువతిని వేధించ సాగాడు. తరచూ ఆమె ఇంటి ముందే తిరుగుతుండడంతో జగన్, నాగరాజు తీవ్ర ఆవేశానికి గురయ్యారు. ఎలాగైనా అతడిని చంపాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. బుధవారం ఉదయం 6.30 గంటలకు సురేంద్ర బహిర్భూమికి ఇంటి నుంచి బయలుదేరగా మార్గమధ్యంలో ఆదిఆంధ్ర పాఠశాలోనికి బలవంతంగా లాక్కెళ్లారు. ముందుగానే అక్కడ ఉంచిన కత్తితో గొంతు కోశారు. తీవ్ర రక్తస్రావమై పడిపోవడంతో చనిపోయాడని భావించి నిందితులు వెళ్లిపోయారు. కొద్ది సేపటికి సమాచారం అందుకున్న యువకుడి తల్లి, బంధువులు అక్కడికి చేరుకుని కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సురేష్‌ను వెంటనే ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. సురేంద్ర తల్లి మారెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నట్లు ఆలూరు ఎస్ఐ ధనుంజయ తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
భార్య గొంతు కోసి పరారైన భర్త
చిలకలూరిపేట(గుంటూరు): మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్య గొంతుకోసి పరారైన సంఘటన జిల్లాలోని చిలకలూరిపేటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని కుమ్మరకాలనీకి చెందిన శిఖ వనజాక్షి(40), మాణిక్యరావు దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిసైన మాణిక్యరావు మద్యానికి డబ్బివ్వాలని వనజాక్షిని వేధిస్తున్నాడు. దీనికి ఆమె నిరాకరించడంతో.. ఆమె నిద్రిస్తున్న సమయంలో కొడవలితో ఆమె గొంతు కోసి, అనంతరం కూరగాయలు కోసే కత్తితో ఆమై పై దాడి చేసి చచ్చిందో లేదో నిర్ధరించుకోవడానికి ఆమె ముఖంపై దిండు వేసి హత్యచేశాడు. ఇది గుర్తించిన ఆమె చిన్న కూతురు తండ్రిని అడ్డుకోబోగా.. చేతిలో ఉన్న కత్తితో ఆమెపై దాడి చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధురాలి గొంతు కోసి ఆభరణాలతో పరార్
నాగోల్‌లో సంఘటన హైదరాబాద్: బంధువని ఆత్మీయంగా ఆహ్వానించి అన్నం పెట్టిన ఓ వృద్ధురాలి గొంతునే కోసి బంగారు నగలతో ఉడాయించాడో దుర్మార్గుడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొమ్మూరి దినేశ్‌రెడ్డి, శిరీషలు నగరానికి వచ్చి నాగోలు జైపురికాలనీ బాలాజీ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. దినేశ్‌రెడ్డి తల్లి సువర్ణ (60) కూడా వీరితో పాటే ఉంటోంది. దినేశ్‌రెడ్డి మార్కెటింగ్ ఉద్యోగం చేస్తుండగా శిరీష చెంగిచెర్లలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. గురువారం భార్యాభర్తలు ఇద్దరు విధులకు వెళ్లారు. దినేశ్‌రెడ్డి కుమారుడు స్కూల్‌కు వెళ్లగా ఇంట్లో కూతురు, సువర్ణ మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో శిరీష పెద్దమ్మ కుమారుడు శ్యామ్ ఇంటికి వచ్చాడు. సువర్ణ అతన్ని ఇంట్లోకి ఆహ్వానించి అన్నం పెట్టింది. అనంతరం వెళ్లి నిద్ర పోతుండగా శ్యామ్ ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని ఇవ్వాలని బెదిరించాడు. దీనికి సువర్ణ నిరాకరించడంతో శ్యామ్ కత్తితో గొంతు కోసి ఆమె మెడలోని 4 తులాల బంగారు గొలుసు, చేతికున్న 4 బంగారు గాజులు, 2 బంగారు ఉంగరాలను తీసుకుని పారిపోయాడు. వెంటనే దినేశ్‌రెడ్డి కూతురు, సువర్ణ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధురాలిని చికిత్స నిమిత్తం నాగోలులోని సుప్రజ ఆసుపత్రికి తరలించారు. దినేశ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చేవెళ్లలో మహిళ దారుణ హత్య
- గొంతు కోసి చంపిన దుండగులు - వివరాలు సేకరించిన పోలీసులు చేవెళ్ల రూరల్: చేవెళ్ల మండల కేంద్రంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఒంటరిగా ఉంటున్న ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి చంపేశారు. ఈ సంఘటన బుధవారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన నయికుడి రాంచంద్రయ్య, అంజమ్మ దంపతుల కూతురు తులసి(25)ని కొన్నేళ్ల క్రితం యాప్రాల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె భర్తను వదిలేసి ఐదు సంవత్సరాల క్రితం పుట్టింటికి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తులసి ఆరు నెలలుగా చేవెళ్ల మండలకేంద్రంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. తల్లిదండ్రులు తరచూ ఆమె వద్దకు వచ్చి వెళ్తుండేవారు. మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రించిన తులసి బుధవారం ఉదయం బయటకు రాలేదు. తలుపులు మూసి ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో నల్లానీళ్లు రావడంతో పట్టుకోమని పొరుగువారు కేకలు వేసినా తులసి నుంచి స్పందన లేకుండాపోయింది. స్థానికులు వెళ్లి చూడగా తలుపులు తీసి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా మంచంపై విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజశేఖర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తులసి గొంతుపై కోసిన ఆనవాళ్లను గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఆమెకు తెలిసిన వ్యక్తులే ఇంట్లోకి వచ్చి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. హతురాలి తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
వివాహిత గొంతు కోసిన దుండగులు
బెంగళూరు : ఇంటిలో ఒంటరిగా ఉన్న వివాహితను దారుణంగా హత్య చేసిన కిరాతకుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇక్కడి ఆర్ఎంసీ యార్డు పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన సంఘటన వివరాలు...ఇక్కడి తులసి గార్డెన్లో నివాసం ఉంటున్న విజయ్‌కుమార్, పారిజాత(29)కు పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. విజయ్‌కుమార్ ఆర్ఎంసీ యార్డులో ప్లాస్టిక్ కవర్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. పారిజాత తల్లిదండ్రులు అనారోగ్యానికి గురికావడంతో ఆరు నెలల క్రితం పారిజాత కుటుంబం సహా తల్లిదండ్రులు ఉంటున్న గురగుంటపాళ్యకు వచ్చి ఉంటోం ది. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం ఎప్పటిలాగే పిల్లలు స్కూల్‌కు వెళ్లారు. విజయ్‌కుమార్, పారిజాత తండ్రి లక్ష్మినారాయణ దుకాణం వెళ్లారు. మధ్యాహ్నం పారిజాత తల్లి లక్ష్మమ్మ బంధువుల ఇంటికి వెళ్లారు. అదే సమయంలో పారి జాత భర్త విజయ్‌తో ఫోన్లో కొద్దిసేపు మాట్లాడింది. ఇదే సమయంలో దుండగులు ఇంటిలోకి చొరబడి పారిజాత కళ్లల్లో కారంచల్లి కత్తులతో గొంతు కోసి దారుణంగా హతమార్చారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు, గదిలో ఉన్న వెండి విగ్రహాలు ఎత్తుకెళ్లారు. కొద్దిసేపు అనంతరం లక్ష్మమ్మ ఇంటికి వచ్చి చూడగా హత్య విషయం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న జాయింట్ పోలీసు కమిషనర్ ప్రణవ్ మోహంతి, అడిషనల్ పోలీసు కమిషనర్ ఎస్. రవి, డీసీపీ టీ.ఆర్. సురేష్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రత్యేక బృందాలు దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యార్ధిని గొంతు కోసేందుకు ప్రయత్నించిన అగంతకుడు
రాయదుర్గం: డిగ్రీ విద్యార్థిని గొంతు కోసేందుకు అగంతకుడి ప్రయత్నించిన సంఘటన రాయదుర్గంలో కలకలం రేపింది. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓ డిగ్రీ కాలేజీలో చోటు చేసుకుంది. అగంతకుడి దాడిలో గాయపడిన డిగ్రీ విద్యార్థిని పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. విద్యార్ధినిపై దాడి చేసిన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగంతకుడు ఉమేష్ గా గుర్తించారు. -
గొంతు కోసి... బావిలో తోసేసి...
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది ఆ యువతి. పెళ్లయి పన్నెండు రోజులైంది.. నూతన వధూవరులు అద్దె ఇంట్లో పాలు పొంగించారు. వారి జీవితం ఆనందంగా సాగాలని ఇరువురి బంధువులు ఆశీర్వదించారు. కానీ ఆ రాత్రే కాళరాత్రిగా మారింది. ప్రేమగా చెంతన చేర్చుకోవాల్సిన భర్త కిరాతకుడిలా మారాడు. గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించాడు. అరసవల్లిలోని శిమ్మవీధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన సంఘటన గురించి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం ఫైర్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నడిమింటి సత్యనారాయణకు, విజయనగరం జిల్లా జీఎం వలస మండలం చిన్నకుదమ గ్రామానికి చెందిన దివ్యశ్రీకి ఈ నెల 8న వివాహమైంది. శుక్రవారం రాత్రి అరసవల్లిలోని శిమ్మవీధిలో అద్దె ఇంట్లో పాలు పొంగించారు. సత్యనారాయణ తల్లిదండ్రులు పట్టణంలోని బంధువుల ఇంటికి వెళ్లగా, దివ్యశ్రీ అమ్మ జయమ్మ, అమ్మమ్మ నారాయణమ్మ ఇంట్లో ఉన్నారు. అర్ధరాత్రి 12. 30 గంటల సమయంలో బ్లేడుతో దివ్యశ్రీపై సత్యనారాయణ దాడి చేశాడు. గొంతుపై తీవ్రగాయమై రక్తం కారుతుండడంతో అతనిని ప్రతిఘటించిన ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. సమీపంలోని బావివద్ద దాక్కుంది. బయటకు వచ్చిన అతనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన దివ్యశ్రీ అమ్మ, అమ్మమ్మను తోసేశాడు. నారాయణమ్మ ఎడమ చెయ్యి విరగ్గొట్టి కుడిచేతిని బ్లేడుతో కోసేశాడు. జయమ్మను గోడకేసి కొట్టాడు. బావిపక్కన దాక్కున్న దివ్యశ్రీని గమనించి అందులో పడేసి రాళ్లు విసిరేశాడు. పాతకాలం బావి కావడంతో ఆమె బావిలోని మెట్లను పట్టుకుని వేలాడుతూ ఉంది. అప్పటికే ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగువారు అక్కడికి వచ్చారు. 100 నంబరుకు సమాచారం ఇచ్చారు. ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని బావిలో ఉన్న ఆమెను రక్షించారు. గాయాల పాలైన దివ్యశ్రీ, నారాయణమ్మను 108లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దివ్య పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం తరలించాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం వారిద్దరూ విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పథకం ప్రకారమే... సంచలనం కలిగించిన ఈ సంఘటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. భార్యను ఒక పథకం ప్రకారమే హత్య చేసేందుకు ప్రయత్నించాడని భావిస్తున్నారు. ముందుగా తల్లిదండ్రులను బంధువుల ఇంటికి పంపడం దీనిని బలపరుస్తోంది. సమయం చూసి హత్యచేసేందుకే బ్లేడ్ దగ్గర ఉంచుకున్నాడని భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒకటో పట్టణ ఎస్సై భాస్కరరావు శనివారం సంఘటన స్థలాన్ని, పరిసరాలను పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్నవారితో మాట్లాడారు. క్లూస్ టీం సంఘటన స్థలంలో ఆధారాలనుసేకరించింది. ఒకటవ పట్టణ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉలిక్కిపడ్డ కంబరవలస కంబరవలస(వీరఘట్టం) : చీమకు కూడా అపకారం చేయడని తాము అనుకుంటున్న వ్యక్తి ఇంత క్రూరంగా ప్రవర్తించాడా అని కంబరవలస వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్ళితే మండలంలోని కంబరవలస గ్రామానికి చెందిన నడిమింటి సత్య నారాయణ పెళ్ళైన రెండు వారాలు గడవక ముందే తనతో జీవితాంతం నడిచేందుకు వచ్చిన దివ్యశ్రీపై దారుణంగా హత్యా యత్నానికి పాల్పడ్డాడని తెలియడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శుక్రవారం రాత్రి శ్రీకాకుళంలో దివ్యశ్రీపై భర్త సత్య నారాయణ దాడి చేసి పీకకోసి బావిలో పడేశాడని చర్చించుకుంటున్నారు. సత్యనారాయణ ఇంత దారు ణానికి పాల్పడతాడని ఎవరూ ఊహించలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న దివ్యశ్రీ ఆరోగ్యం కుదుటపడాలని స్ధానికులు భగవంతుని ప్రార్థిస్తున్నారు.